ETV Bharat / entertainment

Thalaivar 171 Cast : 'జైలర్' సక్సెస్ ఫార్ములా.. అప్​కమింగ్ మూవీస్ కోసం రజనీ బిగ్ ప్లాన్..

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 25, 2023, 1:00 PM IST

Thalaivar 171 Cast : 'జైలర్​' సక్సెస్​ తర్వాత గ్యాప్ ఇవ్వకుండా వరుస సినిమాలు చేస్తున్నారు హీరో రజనీకాంత్​. అయితే 'జైలర్​' సినిమాలో కీలక పాత్ర పోషించిన ఓ సక్సెస్​ ఫార్ములాను రానున్న సినిమాల్లోనూ ఉపయోగించనున్నారట. ఇంతకీ అదేంటంటే ?

Thalaivar 171 Cast
Thalaivar 171 Cast

Thalaivar 171 Cast : తమిళ సూపర్​ స్టార్ రజనీకాంత్​ ప్రస్తుతం 'జైలర్​' సక్సెస్​ను ఆస్వాదిస్తున్నారు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా అదే స్థాయిలో బాక్సాఫీస్​ వద్ద మంచి టాక్​ అందుకుని దూసుకెళ్లింది. గతంలో వరుస ఫ్లాప్​లను చవి చూసిన రజనీ ఈ హిట్​తో మళ్లీ ఫామ్​లోకి వచ్చారు. దీంతో తలైవర్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే 'జైలర్​' తర్వాత మరింత జోరు పెంచిన సూపర్​ స్టార్​.. గ్యాప్​ ఇవ్వకుండా మరిన్ని సినిమాల్లో నటించేందుకు రెడీ అయ్యారు. ఇటీవలే తన కుమార్తె దర్శకత్వంలో రూపొందిన 'లాల్​ సలామ్' చిత్రంలో ఓ గెస్ట్​ రోల్​ చేసిన రజనీ.. వెనువెంటనే 'తలైవర్​ 170' సినిమా షూటింగ్​లో బిజీ అయిపోయారు. 'జై భీమ్​' ఫేమ్​ దర్శకుడు టీజే జ్ఞానవేల్​ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రజనీతో పాటు భారీ తారాగణమే రంగంలోకి దిగనుంది. బిగ్‌బీ అమితాబ్ బచ్చన్‌తో పాటు రానా, ఫాహద్ ఫాజిల్‌, రితికా సింగ్​, మంజూ వారియర్​, దుషారా విజయన్​ లాంటి స్టార్స్​ కీలక పాత్ర పోషించనున్నారు.

Jailer Movie Cast : అయితే 'జైలర్'​ సినిమాలో రజనీ యాక్షన్​తో పాటు గెస్ట్​ రోల్స్​ కీలక పాత్రలు పోషించాయి. స్టోరీకి తగ్గట్టుగా పాత్రల చిత్రీకరణ కూడా ప్లస్​ పాయింట్​గా మారింది. మోహన్‌లాల్‌, శివరాజ్‌ కుమార్‌, జాకీ ష్రాఫ్​ లాంటి స్టార్స్​ అలా సినిమాలో ఒక్కొక్కరిగా ఎంట్రీ ఇస్తుంటే ఇక థియేటర్లలో ఈలలు గోలల మోతతో మెగింది. ముఖ్యంగా మాలీవుడ్‌, శాండల్‌వుడ్‌లలో ఈ సినిమా భారీ కలెక్షన్స్‌ సాధించడానికి ఈ ఫార్ములా హెల్ప్ అయ్యాయి. దీంతో రజనీ తన అప్​కమింగ్​ మూవీ కోసం ఈ ఫార్ములాను ఉపయోగించేందుకు ప్లాన్​ చేశారు. అలా అటు నార్త్​, ఇటు సౌత్​ స్టార్స్​ను ఈ 'తలైవర్​ 170' ద్వారా రంగంలోకి దింపారు. ఇంతటి భారీ తారాగణంతో ఈ సినిమా అభిమానుల్లో ఓ రేంజ్​లో అంచనాలు పెంచేసింది.

తాజాగా 'తలైవర్​ 170' సినిమా షూటింగ్​ మొదలైంది. దీంతో ఈ చిత్రంలోని స్టార్స్​ అందరూ చిత్రీకరణలో పాల్గొంటున్నారు. తాజాగా రజనీతో బిగ్​బీ అమితాబ్​ కూడా సెట్స్​లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ విషయాన్ని రజనీ ఓ ట్వీట్​ ద్వారా తెలిపారు.''33 ఏళ్ళ తర్వాత నా మార్గదర్శి అమితాబ్ బచ్చన్ గారితో నటిస్తున్నాను. టీఈ జ్ఞానవేల్ రాజా దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న సినిమా షూటింగ్ చేస్తున్నాం. నా మనసు ఆనందంతో ఉప్పొంగుతోంది'' అంటూ రజనీ ఎమోషనల్​ అయ్యారు.

Prithviraj Sukumaran Rajinikanth Movie : మరోవైపు 'తలైవర్ 171'గా తెరకెక్కనున్న లోకేశ్​ సినిమా విషయంలోనూ ఈ మల్టీ స్టారర్‌ ఫార్ములాను రిపీట్ చేసే ఆలోచనలో ఉన్నారట రజనీకాంత్‌. అందులో భాగంగా ఈ సినిమాలో కీలక పాత్ర కోసం మాలీవుడ్ స్టార్ హీరో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ను తీసుకునేందుకు ప్లాన్​ చేశారట. అయితే ఈ విషయంపై ఇంకా అఫీషియల్​ అనౌన్స్​మెంట్ రానప్పటికీ.. ఈ చిత్రంలో రజనీతో పాటు పృథ్వీరాజ్‌ నటించే ఛాన్స్​ దాదాపు ఖాయమైనట్లే అని సినీ వర్గాల టాక్​.అయితే ఇతర భాషల్లో పృథ్వీరాజ్‌ గెస్ట్ రోల్స్ ప్లే చేసిన సినిమాలన్నీ బ్లాక్​బస్టర్‌ సాధించాయి. దీంతో ఆ సెంటిమెంట్​ను కూడా ఈ సినిమాకు ఉపయోగించుకోవాలని మూవీ టీమ్ భావిస్తోందట.

Thalaivar 170 Update : రజనీ ఫ్యాన్స్​కు కిక్కిచ్చే న్యూస్.. 'తలైవా 170' షూటింగ్ షురూ!

Thalaivar 170 Cast : మూవీ లవర్స్​కు డబుల్​ ట్రీట్​.. సూపర్ స్టార్​ సినిమాలోకి ఆ ఇద్దరి ఎంట్రీ..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.