ETV Bharat / entertainment

Thalaivar 170 Update : 'జైలర్' సక్సెస్​ సెలబ్రేషన్స్​లో రజనీ.. 'జై భీమ్'​ దర్శకుడితో సినిమా షురూ! - jailer success party

Thalaivar 170 Update : సూపర్​ స్టార్ రజనీకాంత్-జ్ఞానవేల్ కాంబినేషన్​లో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. 'జై భీమ్' సినిమాతో భారీ విజయం అందుకున్న దర్శకుడు జ్ఞానవేల్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. అయితే ఈ సినిమా తాజాగా పూజా కార్యక్రమాలతో లాంఛ్ అయినట్లు తెలుస్తోంది.

Thalaivar 170 Update
Thalaivar 170 Update
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 26, 2023, 6:42 PM IST

Updated : Aug 26, 2023, 7:15 PM IST

Thalaivar 170 Update : తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ 'జైలర్' సక్సెస్​ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఇదే జోష్​లో రజనీ త్వరలోనే కొత్త చిత్రం ప్రారంభించనున్నారు. ఈ సినిమాను 'జై భీమ్' ఫేమ్​ దర్శకుడు టీజే జ్ఞానవేల్ తెరకెక్కించనున్నారు. 'తలైవార్ 170' వర్కింగ్​ టైటిల్​తో ఈ ప్రాజెక్ట్ తెరకెక్కనుంది.

అయితే తాజాగా రజనీ-జ్ఞానవేల్ సినిమా ప్రారంభమైనట్లు తెలిసింది. చెన్నైలోని ఓ ప్రముఖ హోటల్​లో పూజా కార్యక్రమాలతో శనివారం ప్రారంభమైనట్లు కోలీవుడ్​ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ కార్యక్రమానికి సూపర్ స్టార్ రజనీకాంత్ సహా.. సినిమాలో నటించే ప్రముఖ నటులు సైతం హాజరయ్యారని సమాచారం అందింది. ఈ పూజా కార్యక్రమానికి సంబంధించి ఫొటోలు, వీడియో క్లిప్పింగ్స్​ను మూవీమేకర్స్ అధికారికంగా పోస్ట్ చేయలేదు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్.. సెప్టెంబర్ మూడో వారంలో ప్రారంభంకానున్నట్లు తెలుస్తోంది.

Thalaivar 170 Cast : ఈ సినిమాలో రజనీ.. పోలీస్ పాత్రలో కనిపించనున్నారని టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బిగ్​ బి అమితాబ్​ బచ్చన్, టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ కీలక పాత్రల్లో నటించనున్నారని ప్రచారం సాగుతోంది. మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్ ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా కనిపించనున్నారట. మ్యూజిక్ సంచలనం అనిరుధ్ రవిచంద్రన్.. ఈ సినిమాకు సంగీతం అందించనున్నారు.

ఇకపోతే దర్శకుడు టీజే జ్ఞానవేల్ 'జై భీమ్' సినిమాతో అన్ని వర్గాల ప్రేక్షకుల మన్ననలు పొందారు. జస్టిస్ కే.చంద్రు జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో హీరో సూర్య కీలక పాత్రలో నటించారు. కొంతమంది పోలీసులు.. వెనకబడిన కులాల వారిపై ఎంతటి కర్కశత్వం ప్రదర్శిస్తారో.. జ్ఞానవేల్​ ఈ సినిమాలో చక్కగా చూపించారు. 2021లో ఈ సినిమా సెన్సేషనల్​​ హిట్​గా నిలిచింది.

Jailer Worldwide Collection : ఇకపోతే రజనీ 'జైలర్' సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ. 525 కోట్లు వసూల్ చేసింది. ఈ క్రమంలో శుక్రవారం ఈ సినిమా సక్సెస్​ సెలెబ్రేషన్స్​ జరిగాయి. ఈ వేడుకకు హీరో రజనీకాంత్, నటి రమ్యకృష్ణ, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్, సినిమా దర్శకుడు నెల్సన్ కుమార్ పాల్గొన్నారు.

Rajinikanth Yogi Feet : యోగి కాళ్లు మొక్కడంపై రజనీ రియాక్షన్​​.. అందుకే అలా చేశానంటూ..

Nani Rajinikanth : రజనీ-అమితాబ్​ సినిమా.. నాని నో చెప్పడానికి అసలు కారణమిదా?.. తెలిసిపోయిందిగా!

Last Updated : Aug 26, 2023, 7:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.