ETV Bharat / entertainment

జోరు పెంచిన తెలుగు స్టార్స్.. ఒకేసారి రెండేసి సినిమా షూటింగ్​లకు సై! - నాగచైతన్య కొత్త సినిమాలు

Telugu Heroes Parallel Movies Shootings : మన టాలీవుడ్​ హీరోలు జోరు పెంచుతున్నారు. షూటింగ్​లతో బిజీగా గడుపుతూ.. వరుస సినిమాలు చేస్తున్నారు. అయితే ఇది వరకు టాలీవుడ్​లో మాస్ మహారాజ రవితేజ ఒక్కరే.. ఈ ఫార్ములా అనుసరించేవారు. కానీ ఇప్పుడు మరి కొందరు స్టార్లు ఈ విధానాన్ని ఫాలో అవుతున్నారు. మరి వారెవరంటే?

Telugu Heroes Parallel Movies Shootings
జోరు పెంచిన తెలుగు స్టార్స్
author img

By

Published : Jul 17, 2023, 8:24 PM IST

Telugu Heroes Parallel Movies Shootings : తెలుగు స్టార్లందరూ ఇదివరకు ఒకసారి ఒకే సినిమా చేసేవారు. కానీ ప్రస్తుతం ట్రెండ్ మారింది. ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ సినిమాలను ఓకే చేసేస్తున్నారు. టాలీవుడ్​లో ప్రస్తుతం ఒకటి అంతకంటే ఎక్కువ సినిమా షూటింగుల్లో తీరిక లేకుండా గడుపుతున్న హీరోలెవరో.. ఆ సినిమా ప్రాజెక్టులేంటో ఓ సారి తెలుసుకుందాం.

1. ప్రభాస్..
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ వరల్డ్ సినిమా 'ప్రాజెక్ట్​ కే'లో నటిస్తున్నారు. ఈ సినిమాతో పాటు డైరెక్టర్ మారుతి సినిమాను కూడా ఓకే చేసినట్టు తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభం అయ్యి.. కీలక సన్నివేశాలను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా వీరిద్దరి కాంబినేషన్​లో రానున్న ఈ సినిమాకు 'రాజా డిలక్స్' అనే టైటిల్​ను అనుకుంటున్నట్లు సమాచారం. ఆ మధ్య యాక్షన్ రోల్స్​లోనే కనిపిస్తున్న ప్రభాస్.. మారుతి సినిమాలో కామెడీ చేయనున్నారట.

2.విజయ్ దేవరకొండ..
అర్జున్​ రెడ్డితో తనకంటూ ఓ స్టార్​డమ్​ను క్రియేట్ చేసుకున్నారు విజయ్ దేవరకొండ. సమంతతో 'ఖుషీ' సినిమా పూర్తి చేసుకున్న విజయ్.. ప్రస్తుతం రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 'జెర్సీ' ఫేమ్​ గౌతమ్​ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్, శ్రీ లీలతో కలిసి ఆడిపాడనున్నారు. ఈ సినిమాతో పాటు విజయ్ తాజాగా మరో సినిమా ప్రారంభించారు. ఈ సినిమాలో సీతారామం హీరోయిన్ మృణాల్ ఠాకూర్​ లీడ్​రోల్​లో నటించనున్నట్లు టాక్. ఈ సినిమాను గీతాగోవిందం డైరెక్టర్ పరశురామ్ తెరకెక్కిస్తున్నారు. కాగా ఈ చిత్రానికి దిల్​రాజు నిర్మాతగా వ్యవహరించనున్నారు.

3. నితిన్​..
తెలుగు సినిమా ఇండస్ట్రీతో యూత్​ ఫాలోయింగ్​ ఉన్న హీరో నితిన్.. వక్కంతం వంశీ కాంబినేషన్​లో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో నితిన్ సరసన యుంగ్ బ్యూటీ శ్రీలీల నటిస్తున్నారు. ఈ మూవీ చిత్రీకరణ జరుగుతుండగానే.. నితిన్ మరో సినిమా ఓకే చేశారు. దీనికి నితిన్ VNR Trio అనే వర్కింగ్ టైటిల్​ను కన్ఫార్మ్​ చేశారు. వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నితిన్​కు జోడీగా రష్మిక మందన్నా నటిస్తున్నారు. కాగా ఈ సినిమా చిత్రీకరణ పనులు ప్రారంభమయ్యాయి. ఇటీవలె మ్యూజిక్ వర్క్స్​ కూడా షురూ అయినట్లు మూవీ టీమ్ ప్రకటించింది.

4. అక్కినేని నాగచైతన్య..
యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య.. ప్రస్తుతం డైరెక్టర్లు చందూ మొండేటి, శివ నిర్వాణలతో సినిమాలకు సైన్​ చేశారు. కాగా చందూ మొండేటితో నాగచైతన్యకు ఇది మూడో సినిమా. మరోవైపు శివ నిర్వాణ సినిమా.. విడాకుల నేపథ్యంలో సాగనుందని తెలుస్తోంది. అయితే ఈ కథ చైతన్యకు నచ్చిందని ఇండస్ట్రీలో టాక్. స్ట్రిప్ట్ పనులు పూర్తయిుతే త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనుందని సమాచారం. అయితే చాలా రోజుల నుంచి అక్కినేని అభిమానులు సరైన హిట్​ కోసం ఎదురుచూస్తున్నారు.

ఇలా ఆయా హీరోలు ఒకేసారి రెండేసి సినిమాలతో రావడం పట్ల వారి ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ సినిమాలు షూటింగ్​లు పూర్తి చేసుకొని ఎప్పుడు థియేటర్లలో సందడి చేస్తాయో వేచి చూడాలి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.