ETV Bharat / entertainment

'శభాష్​ మిథు' ట్రైలర్​ ఆగయా.. మిథాలీగా అదరగొట్టిన తాప్సీ - తాప్సీ మిథాలీ రాజ్​ బయోపిక్​

Tapsee Mithali raj trailer: భారత మహిళా క్రికెట్‌కు అసాధారణమైన సేవలు అందించి, ఇటీవల రిటైర్మెంట్‌ ప్రకటించిన ప్రముఖ క్రికెటర్‌ మిథాలీరాజ్‌ జీవిత ఆధారంగా తెరకెక్కిన సినిమా 'శభాష్‌ మిథు'. తాప్సీ టైటిల్​ రోల్​ పోషించింది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్​ విడుదలై ఆకట్టుకుంటోంది.

Tapsee mithali raj trailer
శభాష్​ మిథు ట్రైలర్​ ఆగయా
author img

By

Published : Jun 20, 2022, 11:03 AM IST

Tapsee Mithali raj trailer: హీరోయిన్​ తాప్సీ.. టైటిల్ రోల్​ పోషించిన బయోపిక్​ 'శభాష్‌ మిథు'.​ దాదాపు రెండు దశాబ్దాల పాటు భారత మహిళా క్రికెట్‌కు అసాధారణమైన సేవలు అందించి, ఇటీవల రిటైర్మెంట్‌ ప్రకటించిన మిథాలీరాజ్‌ నిజజీవిత ఆధారంగా తెరకెక్కిన సినిమా ఇది. శ్రీజిత్‌ ముఖర్జీ దర్శకుడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌విడుదలై ఆకట్టుకుంటోంది. చిన్నతనం నుంచి క్రికెటర్‌ కావాలని మిథాలీ ఎంతగా ఆరాటపడింది.. క్రికెటర్‌గా ఎదిగే సమయంలో ఎన్ని అవమానాలు ఎదుర్కొంది.. మహిళల క్రికెట్‌కు గుర్తింపు తీసుకురావడం కోసం ఆమె ఎంతలా శ్రమించింది.. ఇలా ప్రతి విషయాన్నీ ఈ సినిమాలో చూపించినట్లు ప్రచార చిత్రం చూస్తే అర్థమవుతోంది.

"మెన్‌ ఇన్‌ బ్లూ మాదిరిగానే మనకి కూడా ఉమెన్‌ ఇన్‌ బ్లూ అనే ఓ టీమ్‌ ఉంటే బాగుంటుందని ఎనిమిదేళ్ల వయసు నుంచి కలలు కంటున్నాను" అని తాప్సీ చెప్పే డైలాగ్‌తో ప్రారంభమైన ఈ ట్రైలర్‌ ఆద్యంతం మనసుని హత్తుకునేలా ఉంది. ఇక, మిథాలీ రాజ్‌గా తాప్సీ నటన అదరగొట్టేసింది. కొన్ని సన్నివేశాల్లో ఆమె పలికించిన హావభావాలు ప్రేక్షకుల్ని భావోద్వేగానికి గురి చేసేలా ఉన్నాయి. వయాకామ్‌ 18 స్టూడియోస్‌ పతాకంపై ఈ సినిమా నిర్మితమైంది. జులై 15న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: గ్యాంగ్​స్టర్​ లారెన్స్ ముఠా​ హిట్​లిస్ట్​లో కరణ్​జోహార్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.