ETV Bharat / entertainment

'కాఫీ విత్​ కరణ్​ షో'పై తాప్సీ షాకింగ్​ కామెంట్స్!.. 'నా సెక్స్​ లైఫ్..' - కాఫీ విత్​ కరణ్​ షోపై తాప్సీ షాకింగ్​ కామెంట్స్

'కాఫీ విత్​ కరణ్​షో'పై షాకింగ్​ కామెంట్స్​ చేసింది హీరోయిన్​ తాప్సీ. ప్రస్తుతం అవి వైరల్​గా మారాయి. ఇంతకీ తాప్సీ ఏమందంటే?

తాప్సీ
తాప్సీ
author img

By

Published : Aug 7, 2022, 8:54 PM IST

Tapsee Koffee With Karan Show: తాప్సీ పన్ను.. టాలీవుడ్​తో కెరీర్​ ప్రారంభించి, ప్రస్తుతం బాలీవుడ్‌ బిజీ హీరోయిన్లలో ఒకరిగా మారిపోయింది. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో దాదాపు 40 చిత్రాలకు పైగా నటించిన ఈ ముద్దుగుమ్మ లేడీ ఓరియెంటెడ్, కమర్షియల్​, బయోపిక్​లు అంటూ కెరీర్​లో దూసుకెళ్తోంది. 'పింక్', 'తప్పడ్', 'రష్మీ రాకెట్' వంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించింది. మిథాలీ రాజ్ బయోపిక్ 'శభాష్ మిథు'లో చివరగా కనిపించింది. ఆమె తాజాగా నటించిన మరో చిత్రం 'దోబారా'. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 19న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాప్సీ ప్రమోషన్స్‌ను వేగవంతం చేసింది.

అందులో భాగంగా మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తోంది. అయితే ఈ క్రమంలో 'సెలబ్రిటీ టాక్​ షో 'కాఫీ విత్ కరణ్'కు కరణ్ మిమ్మల్ని ఎందుకు ఆహ్వానించడం లేదు?' అని ఓ మీడియా ప్రతినిధి తాప్సీని అడగారు. అందుకు ఆమె ఆసక్తికరమైన సమాధానం ఇచ్చింది. 'కాఫీ విత్ కరణ్'కు ఆహ్వానించేంత ఆసక్తికరంగా తన సెక్స్ లైఫ్ లేదని సరదాగా చెప్పింది.

తాప్సీ
తాప్సీ

'దోబారా' వైవిధ్య కథతో, టైమ్ ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కింది. ఈ సినిమాకు అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించారు. బాలాజీ టెలీ ఫిలిమ్స్ పతాకంపై శోభా కపూర్, ఏక్తా కపూర్ సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే అనేక ఫిల్మ్​ ఫెస్టివల్స్‌లో ఈ చిత్రం ప్రదర్శితమైంది. అనురాగ్, తాప్సీ గతంలో 'మన్మర్జియాన్' చిత్రానికి కలసి పనిచేశారు.

ఇవీ చదవండి: 'అందుకు నేను పదేళ్లు కష్టపడ్డా.. తనకు మాత్రం 'ఊ అంటావా'తో ఫుల్​ క్రేజ్​'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.