సూపర్‌స్టార్ రజనీకాంత్, యూనివర్సల్ స్టార్ కమలహాసన్, సూర్య, విజయ్ దళపతి.. ఇలా చాలా మంది తమిళ హీరోలకు టాలీవుడ్లో సూపర్ క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. వారి చిత్రాలకు మంచి మార్కెట్ కూడా ఉంది. అందుకే వీరంతా తమ చిత్రాలను కోలీవుడ్‌తో పాటు ఇక్కడా విడుదల చేస్తుంటారు. మరిన్ని భిన్న కథలు చేస్తూ తమ క్రేజ్, మార్కెట్ పెంచుకుంటున్నారు. అయితే రీసెంట్గా దర్శకుడు వంశీ పైడిపల్లితో విజయ్ దళపతి, ఇక తాజాగా వెంకీ అట్లూరీతో ధనుశ్ తెలుగు ప్రేక్షకుల ముందు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే వీరిద్దరికి ఈ చిత్రాలు తొలి స్ట్రైట్ సినిమాలు కావడం విశేషం.
అయితే ధనుష్ నటించిన సార్ ఫిబ్రవరి 17న తెలుగు, తమిళ భాషలలో రిలీజైంది తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్ దక్కించుకున్న ఈ చిత్రం.. మంచి ఓపెనింగ్స్‌ను కూడా వసూలు చేసింది. ఏపీ తెలంగాణ కలిపి తొలి రోజు రూ. 2.65 కోట్ల షేర్ రూ.4.52 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. దీంతో ధనుష్‌కు తెలుగులో గ్రాండ్ వెల్కమ్ దక్కింది.
అయితే ధనుశ్‌తో పాటు పలు తమిళ హీరోలు కూడా ఇటీవలే తమ చిత్రాలతో సందడి చేశారు. వారి చిత్రాలు కూడా మంచి వసూళ్లను అందుకున్నాయి. అవేంటంటే.. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన విజయ్ వారసుడు సంక్రాంతికి రిలీజై రూ.3.19 కోట్లు వసూలుచేసింది. ఇక రొమాంటిక్ ఎంటర్ టైనర్ ప్రదీప్ రంగనాథన్ నటించిన లవ్ టూడే కూడా తొలి రోజే రూ. 1.15 కోట్లు సంపాదించింది. గట్టి కమ్ బ్యాక్ ఇచ్చిన కమల్‌హాసన్ విక్రమ్.. ఫస్ట్ డే రూ. 1.96 కోట్లు కలెక్ట్ చేశారు. ఇక పొన్నియిన్ సెల్వన్ కూడా తొలి రోజు రూ. 2.88 కోట్లు వసూలు చేసింది. ఇలా ఇటీవల కాలంలో రిలీజైన అన్ని చిత్రాలకు తొలి రోజు మంచి ఓపెనింగ్స్ దక్కాయి. అంతకుముందు కార్తీ సర్దార్ రూ.96 లక్షలు, శివ కార్తికేయన్ ప్రిన్స్ రూ.90 లక్షల వసూళ్లను అందుకున్నాయి.
ఇదీ చూడండి: భోళా శంకర్ ట్రీట్.. చిరు స్టైల్ అదిరిపోయింది!