ETV Bharat / entertainment

Suriya Rolex Movie : 'రోలెక్స్‌' మళ్లీ వచ్చేస్తున్నాడు.. ఈ సారి అస్సలు ఊహించని రేంజ్​లో - సూర్య కంగువా మూవీ

Suriya Rolex Movie : హీరో సూర్య ఓ గుడ్ న్యూస్​ చెప్పారు. విక్రమ్​ సినిమాలోని రోలెక్ట్​ పాత్ర బేస్‌ చేసుకుని లోకేశ్​ కనగరాజ్​తో కలిసి సినిమా చేయబోతున్నట్లు తెలిపారు. ఆ వివరాలు..

Suriya Rolex
Suriya Rolex Movie : 'రోలెక్స్‌' మళ్లీ వచ్చేస్తున్నాడు.. ఈ సారి ఏకంగా..
author img

By

Published : Aug 13, 2023, 5:03 PM IST

Suriya Rolex Movie : లోకేశ్‌ కనగరాజ్‌ తెరకెక్కించిన 'విక్రమ్‌'లో రోలెక్స్‌ పాత్ర ఎంతటి సెన్సేషనల్​ సృష్టించిందో తెలిసిన విషయమే. డ్రగ్‌ మాఫియాను శాసించే ఈ పాత్ర సినిమాకే హైలైట్​గా నిలిచింది. ఇందులో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తన విలనిజంతో ప్రేక్షకుల్ని భయపెట్టేశారు. క్లైమాక్స్‌లో ఆయన కనిపించింది కాసేపే అయినా, థియేటర్‌ అంతా దద్దరిల్లిపోయింది. నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న ఈ పాత్రలో సూర్య.. కనిపించిన తీరు ఇండియావైడ్ మూవీలవర్స్​కు గూస్​బంప్స్​ తెప్పించింది. అయితే ఈ రోలెక్స్‌ పాత్రతో ఓ పూర్తి సినిమా వస్తే బాగుంటుందని చాలా మంది అభిమానులు కోరుకున్నారు.

అయితే దీనిపై ఓ క్లారిటీ ఇచ్చారు సూర్య. ఆదివారం ఫ్యాన్స్‌ మీట్‌లో పాల్గొన్న ఆయన.. తన కొత్త సినిమాలకు సంబంధించిన విశేషాలను పంచుకున్నారు. "ప్రస్తుతం నేను 'కంగువా' సినిమాతో బిజీగా ఉన్నాను. మేము ఊహించిన దానికన్నా వందరెట్లు ఎక్కువ అద్భుతంగా ఔట్​పుట్ వచ్చింది. ఈ ఏడాది అక్టోబర్‌ నుంచి నా 43వ సినిమాను ప్రారంభించాలనుకుంటున్నాను. ఆ సినిమా వివరాలను త్వరలో తెలియజేస్తాను. ప్రస్తుతం డైరెక్టర్​ వెట్రిమారన్‌ 'విడుదలై 2' సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ఆయన అది పూర్తి చేయగానే తర్వాత నాతో 'వాడి వసల్‌' మొదలుపెడతారు. అలాగే లోకేశ్‌ కనగరాజ్‌ కూడా రోలెక్స్‌ పాత్రకు సంబంధించి ఓ స్టోరీ వినిపించారు. అది నాకు ఎంతో బాగా నచ్చింది. దాన్ని కూడా త్వరలోనే ప్రారంభిస్తాం. రోలెక్స్‌ అయిపోగానే 'ఇరుంభుకై మాయావి' చేస్తాం" అని పేర్కొన్నారు. దీంతో ఆయన ఫ్యాన్స్​ సంతోషం వ్యక్తం చేస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా రోలెక్ట్​ గురించి సోషల్​మీడియాలో ఫుల్ ట్రెండ్ చేస్తున్నారు.

Lokesh Kanagaraj Leo Movie : కాగా, లోకేశ్ కనగరాజ్ ప్రస్తుతం దళపతి విజయ్​తో 'లియో' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఇది రిలీజ్ కానుంది. ఇందులో బాలీవుడ్ స్టార్ యాక్టర్ సంజయ్ దత్​ ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. ఇది కూడా లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్​లో భాగంగానే రూపొందుతోంది.

మరో క్యామియోలో 'రోలెక్స్​ సార్​'.. ఎందులో అంటే?

సూర్య.. మళ్లీ ఆ డైరెక్టర్​తోనే.. ఈ సారి ఎన్ని వందల కోట్లో!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.