ETV Bharat / entertainment

సూర్యతో నటించబోయే సినిమాలో.. : కమల్​ హాసన్ క్రేజీ కామెంట్ - major movie cast

Kamal Haasan Suriya Movie: యూనివర్సల్​ హీరో కమల్ హాసన్ నటించిన 'విక్రమ్' సూపర్​హిట్​ టాక్​తో దూసుకుపోతోంది. లోకేశ్ కనకరాజ్​ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో చివర్లో సూర్య ఎంట్రీకి థియేటర్లు దద్దరిల్లిపోయాయి. సినిమా సక్సెస్​ సాధించిన నేపథ్యంలో ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపిన కమల్​.. తదుపరి సూర్యతో నటించబోయే చిత్రంపై ఆసక్తికర కామెంట్స్​ చేశారు.

kamal haasan suriya movie
vikram movie
author img

By

Published : Jun 7, 2022, 9:11 PM IST

Kamal Haasan Suriya Movie: అడివి శేష్‌ ప్రధాన పాత్ర పోషించిన 'మేజర్‌', కమల్‌ హాసన్‌ హీరోగా నటించిన 'విక్రమ్‌' చిత్రాలు జూన్‌ 3న విడుదలై, చక్కటి ఆదరణ పొందుతున్నాయి. ఈ సందర్భంగా ప్రేక్షకులు, చిత్ర బృందానికి కమల్‌ కృతజ్ఞతలు తెలియజేయగా 'మేజర్‌'గా మారేందుకు తానెంత కష్టపడిన అంశాన్ని శేష్‌ తెలిపారు. ఈ మేరకు ఇద్దరు సోషల్‌ మీడియా వేదికగా వీడియోలు విడుదల చేశారు.

'విక్రమ్'లో సూర్య కనిపించిందని కొద్దిసేపే అయినా థియేటర్ మొత్తం దద్దరిలిపోయిందని కమలహాసన్ ఆనందం వ్యక్తం చేశారు. ఇందుకు కృతజ్ఞతలు సూర్యతో తన తదుపరి చిత్రంలో చూపించనున్నట్లు తెలిపారు. 'విక్రమ్' విడుదలైన అన్నిచోట్ల నుంచి విశేష స్పందన రావడం, సినిమా ఘన విజయం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. మంచి సినిమాలు, నటులను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని కమల్ అన్నారు. 'విక్రమ్' విజయంలో ఆ చిత్రానికి పనిచేసిన ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఉందన్న కమల్.. పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు.

లోకేశ్​కు లగ్జరీ కారు: దర్శకుడు లోకేశ్‌ కనకరాజ్‌ తెరకెక్కించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ 'విక్రమ్‌'లో ఫహద్‌ ఫాజిల్‌, విజయ్‌ సేతుపతి ముఖ్య పాత్రల్లో ఆకట్టుకున్నారు. చిత్ర విజయోత్సాహంలో కమల్‌ హాసన్‌ దర్శకుడు లోకేశ్‌కు ఓ లగ్జరీ కారును బహుమతిగా అందించారు.

kamal haasan suriya movie
లోకేశ్​కు కారు గిఫ్ట్​ ఇచ్చిన కమల్

అందుకే ఈ వీడియో: "రెండున్నర గంటల మేజర్‌ సినిమా కోసం రెండున్నరేళ్లు శ్రమించాం. 'అందరూ బావుండాలి. ఆ తర్వాతే నా గురించి ఆలోచిస్తా' అనే వ్యక్తిత్వం మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ది. జంతువులంటే ఆయనకెంతో ప్రేమ. ఆయనది ప్రత్యేకమైన శైలి. సందీప్‌లా కనిపించేందుకు శారీరకంగా చాలా కష్టపడ్డా. వాస్తవ జీవితంలో నేను మేజర్‌ సందీప్‌ను కాకపోవచ్చు. కానీ, తన తల్లిదండ్రులకు రెండో కొడుకుగా ఉంటా. మేజర్‌ సందీప్‌ నన్నెలా మార్చారో తెలియజేసేందుకే ఈ వీడియో" అని శేష్‌ వివరించారు.

  • As I reflect on this journey... My greatest honor came from Major Sandeep's Mother. Watch this video for a few minutes to see what I mean. :) #Major From my heart. To yours. pic.twitter.com/fi390aCXri

    — Adivi Sesh (@AdiviSesh) June 7, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ముంబయి ఉగ్ర దాడుల్లో వీరమరణం పొందిన మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జీవితాధారంగా శశికిరణ్‌ తెరకెక్కించిన చిత్రమే 'మేజర్'. ప్రకాశ్‌రాజ్‌, శోభిత, సయీ మంజ్రేకర్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

major movie
సయీ మంజ్రేకర్‌

ఇదీ చూడండి: సమంత తగ్గట్లేదుగా.. మళ్లీ అలా - ​ కొత్త బాయ్​ఫ్రెండ్​తో అమీ జాక్సన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.