ETV Bharat / entertainment

Suriya 43 Movie Cast : ఇంట్రెస్టింగ్​గా 'సూర్య 43' గ్లింప్స్​.. టైటిల్​ విషయంలో ఆ సస్పెన్స్​ ఏంటో ? - dulquer in surya 43 movie

Suriya 43 Movie Cast : సౌత్​ స్టార్​ హీరో సూర్య - సుధా కొంగర కాంబినేషన్​లో తెరకెక్కుతున్న #Suriya43 సినిమాకు సంబంధించిన ఓ లేటెస్ట్ అప్​డేట్​ను మేకర్స్​ విడుదల చేశారు. సోషల్ మీడియా వేదికగా షేర్​ చేసిన ఆ గ్లింప్స్​లో ఏముందంటే ?

Suriya Upcoming Movie : సూర్య కొత్త సినిమాలో.. దుల్కర్ ఎంట్రీ..

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 26, 2023, 7:11 PM IST

Suriya 43 Movie Cast : తెలుగు, తమిళం​లోనూ మంచి క్రేజ్​ ఉన్న హీరో సూర్య.. ప్రస్తుతం పాన్​ ఇండియా లెవల్​లో తెరకెక్కుతున్న 'కంగువా' సినిమా షూటింగ్​లో బిజీగా ఉన్నారు. అయితే ఈ సినిమా తర్వాత 'ఆకాశమే నీ హద్దురా' ఫేమ్​ సుధా కొంగరతో కొత్త ప్రాజెక్టును మొదలు పెట్టనున్నారు. 'సూర్య 43' అనే వర్కింగ్​ టైటిల్​తో ఈ సినిమా తెరకెక్కనుంది. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ లేటెస్ట్​ వీడియోను మేకర్స్​ విడుదల చేశారు.

తమిళనాడులో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా గ్యాంగ్‌స్టర్‌ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కనున్నట్లు ఆ గ్లింప్స్​ చూస్తుంటే అర్ధమౌతోంది. అయితే గత కొంత కాలంగా ఈ చిత్రంలో 'సీతారామం' ఫేమ్ మలయాళ నటుడు​ దుల్కర్ సల్మాన్​​ నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఆ విషయాన్ని ఈ గ్లింప్స్​ ద్వారా కన్ఫామ్​ చేసింది. ఇక దుల్కర్​తో పాటు నజ్రియా ఫహాద్ ఫాజిల్​​, విజయ్​ వర్మ కూడా కీలక పాత్ర పోషించనున్నారు.

టైటిల్​ విషయంలో ఆ సస్పెన్స్​..
అయితే ఈ వీడియో చూస్తుంటే సినిమాకు టైటిల్​ను కూడా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. వీడియో చివరల్లో టైటిక్​ కనిపించకుండా పెట్టారు. దీని వెనుక ఏం సీక్రెట్​ ఉందో మేకర్స్ రివీల్​ చేస్తే కానీ అసలు విషయం తెలియదు.

'ఆకాశమే నీ హద్దురా'​ లాంటి బిగ్​ సక్సెస్​ తర్వాత ఈ కాంబినేషన్​లో వస్తున్న సినిమా కావటం వల్ల ఈ ప్రాజెక్టుపై అందరిలోనూ భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాను సూర్య తన సొంత బ్యానర్​ 2డీ ఎంటర్‌టైన్‌మెంట్​లో నిర్మిస్తున్నారు. అలానే ఈ సినిమాకు జీవి ప్రకాశ్​ సంగీతాన్ని అందిస్తున్నారు. ఆయనకు ఇది 100వ సినిమా కావటం వల్ల ఈ మూవీ అంచనాలు నిర్మించున్నారు. వచ్చే సంవత్సరం చివరికల్లా ఈ సినిమాను విడదుల చేసేలా చిత్రం బృందం ప్లాన్​ చేస్తున్నారు.

Suriya Kanguva Movie : మరోవైపు దర్శకుడు శివ కాంబినేషనల్​లో తెరకెక్కితున్న 'కంగువా' చిత్రంలో సూర్య ఓ యోధుడి పాత్రలో నటిస్తున్నారు. కథానాయికగా బాలీవుడ్ నటి దిశా పటానీ యువరాణి పాత్రలో నటించనుంది. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్​తో కలిసి యూవీ క్రియేషన్స్​ నిర్మిస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. 2024లో ఈ సినిమాను పాన్​ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయనున్నారు. చిత్రానికి సంబంధించిన పార్ట్​2, 3లు సిద్ధంగా ఉన్నాయి.

టాలీవుడ్​లో కోలీవుడ్ ధమాకా.. షాకింగ్​ బిజినెస్​.. ఈ సినిమాలు వసూళ్ల మోత మోగిస్తున్నాయిగా!

Suriya Rolex Movie : 'రోలెక్స్‌' మళ్లీ వచ్చేస్తున్నాడు.. ఈ సారి అస్సలు ఊహించని రేంజ్​లో

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.