సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'లాల్ సలామ్'. ఆయన కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. దీనిని లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది. 'జైలర్' సినిమా తర్వాత రజనీ నటిస్తున్న మూవీ అయినందున అభిమానుల్లో దీనిపై ఆసక్తి ఎక్కువైంది. ఈ క్రమంలో మూవీకి సంబంధించిన ఓ లేటెస్ట్ అప్డేట్ను అనౌన్స్ చేసింది మూవీ టీమ్.
ఈ మూవీలోని రజనీ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. "అందరికి ఇష్టమైన భాయ్ ముంబయికి తిరిగి వచ్చేశారు. మొయిదిన్ భాయ్‌గా రజనీ వచ్చేస్తున్నారు". అంటూ ఆ పోస్టర్‌ను షేర్ చేశారు. అందులో రజినీకాంత్ మునుపెన్నడూ చూడని విధంగా కనిపించారు. దీంతో అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. అయితే ఆయన్ను ఇలా సరికొత్త అవతారంలో చూసిన ఫ్యాన్స్ ఈ పోస్టర్‌ను నెట్టింట తెగ షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.
-
Everyone’s favourite BHAI is back in Mumbai 📍 Make way for #Thalaivar 😎 SuperStar 🌟 #Rajinikanth as #MoideenBhai in #LalSalaam 🫡
— Lyca Productions (@LycaProductions) May 7, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
இன்று முதல் #மொய்தீன்பாய் ஆட்டம் ஆரம்பம்…! 💥
🎬 @ash_rajinikanth
🎶 @arrahman
🌟 @rajinikanth @TheVishnuVishal & @vikranth_offl
🎥… pic.twitter.com/OE3iP4rezK
">Everyone’s favourite BHAI is back in Mumbai 📍 Make way for #Thalaivar 😎 SuperStar 🌟 #Rajinikanth as #MoideenBhai in #LalSalaam 🫡
— Lyca Productions (@LycaProductions) May 7, 2023
இன்று முதல் #மொய்தீன்பாய் ஆட்டம் ஆரம்பம்…! 💥
🎬 @ash_rajinikanth
🎶 @arrahman
🌟 @rajinikanth @TheVishnuVishal & @vikranth_offl
🎥… pic.twitter.com/OE3iP4rezKEveryone’s favourite BHAI is back in Mumbai 📍 Make way for #Thalaivar 😎 SuperStar 🌟 #Rajinikanth as #MoideenBhai in #LalSalaam 🫡
— Lyca Productions (@LycaProductions) May 7, 2023
இன்று முதல் #மொய்தீன்பாய் ஆட்டம் ஆரம்பம்…! 💥
🎬 @ash_rajinikanth
🎶 @arrahman
🌟 @rajinikanth @TheVishnuVishal & @vikranth_offl
🎥… pic.twitter.com/OE3iP4rezK
ఇక సినిమా విషయానికి వస్తే.. క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కుతుంది. ఇందులో రజనీతో పాటు యువ హీరోలు విష్ణు విశాల్, విక్రాంత్ హీరోలుగా నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ జీవిత రాజశేఖర్ కూడా కీలక పాత్ర చేస్తున్నారట. పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సినిమాకు ఏఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా కోసం ప్రస్తుతం రజనీ ముంబయిలో ఉన్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా.. ఈ ఏడాదికల్లా థియేటర్లలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
మరోవైపు ఈ సినిమాతో పాటు రజినీ మరో సినిమా చేస్తున్నారు. ప్రముఖ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కిస్తున్న 'జైలర్' అనే సినిమాలో లీడ్ రోల్లో నటిస్తున్నారు. ఇందులో రజనీతో పాటు మోహన్‌లాల్, జాకీష్రాఫ్, శివరాజ్ కుమార్, సునీల్, తమన్నా, రమ్యకృష్ణ, మీర్నా మీనన్ కీలక పాత్రలు పోషించారు. కళానిధి మారన్ సమర్పణలో సన్ పిక్చర్స్‌పై రూపొందిన ఈ సినిమా ఆగస్ట్ 10న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజయ్యేందుకు రెడీగా ఉంది. కాగా 'జైలర్'మూవీ నుంచి కూడా ఆదివారం ఓ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేసింది మూవీ టీమ్. అందులో స్టైల్‌గా కారులో కూర్చున్న రజనీ కసిపిస్తారు. ఇందులో ఆయన మాస్ లుక్ అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. అలాగే 'జై భీమ్' ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో ఓ సినిమాకు సైన్ చేశారు రజనీ. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలు కానుంది.