ETV Bharat / entertainment

Sunny Deol Villa Auction : 'గదర్ 2' హీరోకు షాక్​.. తన విల్లాను వేలం వేయనున్న బ్యాంక్! - బాలీవుడ్ నటుడి విల్లా వేలం

Sunny Deol Villa Auction : బాలీవుడ్ నటుడు సన్నీ దేఓల్​కు షాక్ తగిలింది. తమ బ్యాంక్ నుంచి తీసుకున్న అప్పు చెల్లించని కారణంగా.. ముంబయిలోని అతడి విల్లాను వేలం వేయనున్నట్లు బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రకటన చేసింది.

Sunny Deol Villa Auction
Sunny Deol Villa Auction
author img

By

Published : Aug 20, 2023, 6:39 PM IST

Updated : Aug 20, 2023, 7:25 PM IST

Sunny Deol Villa Auction : బాలీవుడ్ నటుడు సన్నీ దేఓల్​కు ఓ సమస్య వచ్చి పడింది. తమ వద్ద తీసుకున్న రుణం తిరిగి చెల్లించని కారణంగా.. ముంబయి జుహు ప్రాంతంలోని అతడి విల్లాను వేలంలో ఉంచనున్నట్లు బ్యాంక్ ఆఫ్ బరోడా తెలిపింది. కాగా ఈ వేలాన్ని సెప్టెంబర్ నెలలో నిర్వహించనున్నట్లు బ్యాంక్​ ఓ ప్రకటనలో పేర్కొంది.

నటుడు సన్నీ దేఓల్​కు ముంబయి జుహు ప్రాంతంలో ఖరీదైన విల్లా ఉంది. కొంత కాలం కిందట సన్నీ.. తన తండ్రి ధర్మేంద్ర, సోదరుడు బాబీ సహా ఈ విల్లాను గ్యారంటర్లుగా చూపి బ్యాంక్ ఆఫ్ బరోడాలో రూ.56 కోట్ల రుణం పొందారు. అయితే ఈ అప్పుకు సన్నీ వడ్డీ చెల్లించకపోగా.. బ్యాంకు వారికి స్పందించనట్లు తెలుస్తోంది. దీంతో సంబంధింత బ్యాంకు ఆదివారం అతడి విల్లాను వేలంలో ఉంచనున్నట్లు ప్రకటన చేసింది. ఈ క్రమంలో వేలంలో పాల్గొనాలనుకునే వారు డిపాజిట్​ రూపంలో రూ. 5.14 కోట్లు చెల్లించాలని బ్యాంకు పేర్కొంది. కాగా ఈ వేలాన్ని సెప్టెంబర్ 25న నిర్వహించనున్నట్లు బ్యాంక్ వర్గాలు ప్రకటనలో స్పష్టం చేశాయి.

Gadar 2 Cast : నటుడు సన్నీ దేఓల్​కు చాలా కాలంగా సరైన హిట్ సినిమా లేదు. ఈ క్రమంలో ఆయన లీడ్​ రోల్​లో నటించిన 'గదర్ 2' బాక్సాఫీస్​ వద్ద మంచి విజయం సొంతం చేసుకుంది. దర్శకుడు అనిల్ శర్మ.. 2001లో రిలీజైన 'గదర్ ఏక్ ప్రేమ్ కహానీ' సినిమాకు సీక్వెల్​గా ఈ సినిమాను తెరకెక్కించారు. అమీషా పటేల్, ఉత్కర్ష్ శర్మ కీలక పాత్రల్లో నటించారు. మిథున్, మోంటీ శర్మ ఇద్దరు సంగీతం అందిచగా.. నజీబ్ ఖాన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తించారు. కాగా కమల్ ముఖుత్​తో కలిసి అనిల్ శర్మ ఈ చిత్రాన్ని నిర్మించారు.

Gadar 2 World Collection Worldwide : ఆగస్టు 11న విడుదలైన 'గదర్ 2' హౌస్​ఫుల్​ షోస్​ తో కాసుల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా రూ.300 కోట్ల పైచిలుకు వసూళ్లు రాబట్టింది. ప్రస్తుతం సన్నీ ఈ సక్సెస్​ను ఎంజాయ్ చేస్తుండంగా ఈ ప్రకటన రావడం గమనార్హం.

ఇండిపెండెన్స్​ వీక్​లో కలెక్షన్లు పీక్స్​.. వెయ్యి కోట్ల పైనే మార్కెట్​.. 'జైలర్' వాటాయే రూ.500 కోట్లు!

Gadar 2 Movie Twitter Review in Telugu : గదర్ -2 మూవీ ట్విటర్ రివ్యూ.. సక్సెస్ రిపీట్ చేసిందా..?

Last Updated : Aug 20, 2023, 7:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.