Sridevi Drama Company Latest Promo: 'శ్రీదేవి డ్రామా కంపెనీ' కొత్త ప్రోమో వచ్చేసింది. ఈ వారం షోకు 'మా నాన్నకు పెళ్లి' ట్యాగ్‌లైన్ ఇచ్చారు. ఈ ప్రోమోలో బుల్లెట్ భాస్కర్ నాన్న పంచులతో ఆకట్టుకున్నారు. ఆయనకు హైపర్ ఆది, ఆటో రామ్‌ప్రసాద్ తోడవడం వల్ల కామెడీ మరో లెవక్కి వెళ్లింది.
యాంకర్ శ్యామల డ్యాన్స్ ఆకట్టుకుంది. ఉద్యోగ రిత్యా దురంగా ఉంటున్న రోహిణి తండ్రి.. షోకు వచ్చారు. ఆమెకు చెప్పకుండా సర్ప్రైజ్గా రావడం వల్ల ఆమె ఉద్వేగానికి లోనయ్యింది. ఈ సందర్భంగా రోహిణికి అమె తండ్రి ఓ గిఫ్ట్ ఇస్తాడు. ఈ సన్నివేశం.. షో వాతావరణాన్ని కాసేపు ఉద్విగ్నంగా మారుస్తుంది.
'శ్రీదేవి డ్రామా కంపెనీ' షోలో సుధీర్ వేసిన 'హరిహర వీరమల్లు' గెటప్ అదిరిపోయింది. అనంతరం బుల్లెట్ భాస్కర్ నాన్న.. పెళ్లి ప్రసావన తీసుకురాగా.. ఎవరిని చేసుకుంటాడో చెప్పే ప్రయత్నం చేశారు. ఈ లోపు ప్రోమో అయిపోయింది. అసలు విషయం తెలియాలంటే.. వచ్చే అదివారం ప్రసారం అయ్యే.. పూర్తి షో చూడాల్సిందే..
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇవీ చదవండి: