Sudheer Babu Son : టాలీవుడ్ హీరో సుధీర్ బాబుకు యూత్‌లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. తన సిక్స్ ప్యాక్స్ బాడీతో యువకులను ఇన్స్పిరేషన్గా నిలిచే ఈ స్టార్ హీరో.. సినిమాలో మంచి నటుడిగా గుర్తింపు పొందేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఆయనకు మంచి క్రేజే ఉంది. అయితే సుధీర్.. పలు సందర్భాల్లో సోషల్ మీడియాలో ఫ్యామిలీకి సంబంధించిన ఫొటోస్ను షేర్ చేస్తుంటారు. అలా ఆయనకు ఇద్దరు పిల్లలున్నారన్న విషయం ఈ మధ్యనే చాలా మందికి తెలిసింది.
సుధీర్‌కు 2006లో వివాహం జరగ్గా చరిత్ మానస్, దర్శన్ అనే ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. అయితే అందులో పెద్ద కుమారుడు చరిత్ మానస్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాడు. లేటెస్ట్గా తనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో చరిత్ చూసేందుకు అచ్చం తన మేనమామ మహేశ్ బాబు లుక్స్‌లో కనిపించాడు. దీంతో నెటిజన్లు అచ్చం మహేశ్‌లా ఉన్నాడే అని అభిప్రాయపడుతున్నారు. సేమ్ స్మైల్, సేమ్ మేనరిజం చూపిస్తున్నాడంటూ కామెంట్లు పెడుతున్నారు. కొంతమందేమో మహేశ్‌కు సంబంధించిన ఓ వీడియోను.. తాజా వీడియోకు జోడించి ఇద్దరూ సేమ్ టు సేమ్ అంటూ ట్రెండ్ చేస్తున్నారు.
ఇకపోతే రీసెంట్గా సూపర్ స్టార్ కృష్ణ నటించిన మోసగాళ్లకు మోసగాడు రీరిలీజ్ ఈవెంట్లోనూ ఈ కుర్రాడు సందడి చేశాడు. స్టేజీపైకి మాట్లాడేందుకు వచ్చిన సుధీర్ బాబు.. తన వెంట తన ఇద్దరు తనయులను తీసుకొచ్చారు. అప్పుడు కూడా మీడియా దృష్టంతా చరిత్ మానస్‌పై పడింది. మానస్ వాకింగ్ స్టైల్, మేనరిజం అచ్చం మహేశ్ బాబులా ఉందంటూ అందరూ చెప్పుకున్నారు.
Sudheer Babu Son Movies : చరిత్ మానస్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా పలు సినిమాల్లో మెరిశాడు. 'భలే మగాడివోయ్' సినిమాలో జూనియర్ నానిగా కనిపించిన ఈ చిన్నోడు.. తన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు. ఆ తర్వాత వచ్చిన విన్నర్ సినిమాలో జూనియర్ సాయిధరమ్ తేజ్‌గా కనిపించాడు. ఇప్పుడు యంగ్ ఏజ్‌లో మాత్రం తన లుక్స్‌తో ఓ రేంజ్లో ఆకట్టుకుని సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాడు.
-
Sudheer babu son is looking same to same at mahesh babu at the of 18 years 🤯🤯🤯 @urstrulyMahesh @isudheerbabu #GunturKaaram 🌶 pic.twitter.com/DMF2bi9aZS
— 𝐏𝐀𝐍𝐃𝐔 𝐆𝐀𝐃𝐔 𝟐.𝟎..... (@Iam___Mahesh_07) July 11, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Sudheer babu son is looking same to same at mahesh babu at the of 18 years 🤯🤯🤯 @urstrulyMahesh @isudheerbabu #GunturKaaram 🌶 pic.twitter.com/DMF2bi9aZS
— 𝐏𝐀𝐍𝐃𝐔 𝐆𝐀𝐃𝐔 𝟐.𝟎..... (@Iam___Mahesh_07) July 11, 2023Sudheer babu son is looking same to same at mahesh babu at the of 18 years 🤯🤯🤯 @urstrulyMahesh @isudheerbabu #GunturKaaram 🌶 pic.twitter.com/DMF2bi9aZS
— 𝐏𝐀𝐍𝐃𝐔 𝐆𝐀𝐃𝐔 𝟐.𝟎..... (@Iam___Mahesh_07) July 11, 2023