ETV Bharat / entertainment

'సినిమా బాలేదంటే నష్టపరిహారం చెల్లించిన రోజులున్నాయి - నేను చేసినంతగా ఏ హీరో చేయలేరు' - సుధీర్ బాబు లేటెస్ట్ మూవీ

Sudheer Babu Haromhara Movie : టాలీవుడ్ స్టార్ హీరో సుధీర్‌ బాబు లీడ్​ రోల్​లో తెరకెక్కుతోన్న లేటెస్ట్ మూవీ 'హరోం హర'. తాజాగా విడుదలైన ఈ మూవీ టీజర్‌కు విశేష ఆదరణ లభించింది. దీంతో మూవీ టీమ్​ తాజాగా ఓ ప్రెస్‌మీట్​లో పాల్గొని సందడి చేసింది. ఆ విశేషాలు మీ కోసం..

Sudheer Babu Haromhara Movie
Sudheer Babu Haromhara Movie
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 5, 2023, 7:04 AM IST

Sudheer Babu Haromhara Movie : టాలీవుడ్ స్టార్ హీరో సుధీర్‌ బాబు లీడ్​ రోల్​లో జ్ఞానసాగర్‌ తెరకెక్కిస్తోన్న తాజా చిత్రం 'హరోం హర'. కుప్పం నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా పాన్‌ ఇండియాలో స్థాయిలో విడుదల కానుంది. ఈ క్రమంలో ఇటీవలే విడుదల చేసిన 'హరోంహర' టీజర్‌కు అంతటా విశేష ఆదరణ లభించింది. దీంతో మూవీ టీమ్​ తాజాగా ఓ ప్రెస్‌మీట్​ను నిర్వహించి ఆసక్తికర విషయాలు పంచుకుంది.

'హరోం హర' అనే టైటిల్‌ పెట్టడానికి గల కారణం ?
సాగర్‌ : సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తున్న సమయంలో ఎక్కువగా 'హరోం హర' అనే పదాన్ని ఉపయోగిస్తుంటారు. ట్యాగ్‌లైన్‌లో తెలిపినట్లుగానే ఈ చిత్రంలో తిరుగుబాటు అనేది ఉంటుంది. చిత్తూరు జిల్లా కుప్పం నేపథ్యంలో ఈ మూవీని తీర్చిదిద్దుతున్నాం. స్టోరీకి అనుగుణంగానే ఈ సినిమాకు 'హరోం హర' అనే టైటిల్​ను ఖరారు చేశాం. అంతే కాకుండా ఇందులో కుప్పం యాసను కూడా ఉపయోగించాం.

యాక్షన్‌ హీరోగానే ఉండాలని మీరు అనుకుంటున్నారా?
సుధీర్‌: ఇండస్ట్రీలోకి వచ్చిన టైమ్​లో గొప్ప నటుడిగా నిరూపించుకోవాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ కెరీర్‌లో రాణించే సమయంలో ఒక జానర్‌కు ఫిక్స్‌ అవుతాం. అలా, యాక్షన్‌ తరహా కథలు నాకు బాగా సెట్‌ అవుతాయనే భావన నాకు కలిగింది. మంచి కథ ఉంటే తప్పకుండా యాక్షన్‌ సినిమాల్లో నటిస్తాను.

'హరోం హర' స్టోరీ ఓకే చేయడానికి ప్రధానం ఏమిటి?
సుధీర్‌: ఈ స్టోరీ చాలా కొత్తగా ఉంటుంది. ఇప్పటివరకూ నేను ఇలాంటి కథలో నటించలేదు. కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ కూడా చక్కగానే కుదిరాయి. కథ, నటీనటుల పాత్రల చిత్రీకరణ, సినిమాలోని ప్రతి రంగంపై డైరెక్టర్​కు ఉన్న అభిరుచిని చూసి ఈ సినిమాకు ఓకే చెప్పాను.

వాస్తవ సంఘటనలు ఆధారంగా చేసుకుని ఈ కథను రాశారా?
సాగర్‌: ఇదొక ఫిక్షనల్‌ స్టోరీ. పీరియాడికల్‌ మూవీ. 1989-90 సంవత్సరాల మధ్యలో ఈ కథ జరిగినట్టుగా చూపించాం. అయితే నిజ జీవితంలో స్ఫూర్తి పొందిన పలు పాత్రలను ఆధారంగా చేసుకుని ఇందులో పాత్రలు క్రియేట్‌ చేశాను.

ఈ సినిమా మీ కెరీర్‌కు ఎంతవరకూ ఉపయోగపడుతుంది?
సుధీర్‌: తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పటివరకూ ఘన విజయాన్ని అందుకున్న పెద్ద చిత్రాల స్థాయిలో ఈ సినిమా క్వాలిటీ ఉండనుంది. ఇప్పటికే మేము 90 శాతం షూట్‌ పూర్తి చేశాం. కీలక సన్నివేశాలు చూశా. చాలా బాగా వచ్చాయి. ఆ నమ్మకంతోనే చెబుతున్నా. తప్పకుండా ఇది ప్రేక్షకులకు మంచి అనుభూతిని అందిస్తుంది.

ఏదైనా స్టోరీకి ఓకే చెప్పేటప్పుడు మీరు ఏ విషయాలను పరిగణనలోకి తీసుకుంటారు?
సుధీర్‌: కథ ఏదైనా సరే నేనొక ప్రేక్షకుడిగా వింటాను. వాళ్లు దీన్ని ఎంజాయ్‌ చేస్తారా? అనేది చూస్తాను. అలాగే, నా కెరీర్‌కు ఇది ఎంతవరకూ ఉపయోగపడుతుంది? అనే విషయాలను పరిగణనలోకి తీసుకుంటాను. ఇందులో ఏ ఒక్కటి ఓకే అనిపించకపోయినా కూడా వెంటనే నో చెప్పేస్తాను.

మీరు నటించిన 'ప్రేమకథా చిత్రం' అప్పట్లో మంచి సక్సెస్​ను అందుకుంది. మీ గత చిత్రాలు వరుస పరాజయాలు అందుకున్నాయి. 'ప్రేమకథా చిత్రం' లాంటివే చేయొచ్చు కదా..?
సుధీర్‌: నా దృష్టిలో 'హంట్‌' అనేది ఓ డీసెంట్‌ సినిమా. అయితే అది కొంతమందికి నచ్చలేదు. పలు కారణాల వల్ల మేము అనుకున్న స్థాయిలో ఆ సినిమాను ప్రమోట్‌ చేయలేకపోయాం. 'హంట్‌', 'మామా మశ్చీంద్ర' సినిమాలకు మరింత ఆదరణ రావాల్సిందనే అనే భావన నాకు ఉంది. ఇక 'ప్రేమకథా చిత్రమ్‌' విషయానికి వస్తే ఆ సమయంలో మారుతి నాకు నాలుగు కథలను చెప్పారు. అయితే అందులో నేను 'ప్రేమకథా చిత్రమ్‌' స్టోరీని ఎంపిక చేసుకున్నాను. ఆయన చెప్పిన మిగతా కథలు కూడా నచ్చినప్పటికీ అప్పుడు నాకున్న మార్కెట్‌, బడ్జెట్‌ను ప్రామాణికంగా తీసుకున్నాను. ఇప్పుడు నా మార్కెట్‌ కాస్త పెద్దదైంది. బడ్జెట్‌ ఎక్కువైనా సరే డబ్బులు పెట్టేందుకు నిర్మాతలు కూడా ఉన్నారు. అందుకే ఈ సినిమా ఇంత పెద్ద స్కేల్‌లో చేస్తున్నాను. ఈ సినిమాతో పాటు 'మా నాన్న సూపర్‌హీరో' అనే ఫ్యామిలీ, ఎమోషనల్‌ డ్రామాలో నటిస్తున్నాను.

మీ చిత్రాలు వరుస పరాజయాలు అందుకుంటున్నాయి కదా. కాస్త బ్రేక్‌ తీసుకుని ఎక్కడ తప్పు జరుగుతుందా అని ఆలోచన చేయొచ్చు కదా?
సుధీర్‌: నేనేమీ హడావుడిగా సినిమాలు చేయడం లేదు. ఫోకస్‌గా ఆలోచించే చేస్తున్నాను. సంతకం చేసిన సినిమాలు పట్టాలెక్కిన తర్వాత బాలేదంటే నష్టపరిహారం చెల్లించి పక్కకు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇటీవలే నా సినిమాలు వరుసగా విడుదల కావడం వల్లే మీరు అలా అనుకుని ఉండొచ్చు. 'శ్రీదేవి సోడా సెంటర్‌' రిలీజ్​కు రెండు నెలల ముందే 'మామా మశ్చీంద్ర'ని ఓకే చేశాను. ఎన్నో కారణాల వల్ల అది వాయిదా పడుతూ వచ్చింది.

ఈ చిత్రాన్ని పాన్‌ ఇండియా స్థాయిలో తీసుకురావడానికి గల కారణం ఏమిటి?
సుధీర్‌: ఇది పాన్‌ ఇండియాలో స్థాయిలో చెప్పాల్సిన స్టోరీ. 'మామా మశ్చీంద్ర' కథ విన్నప్పుడు దాన్ని కూడా నేను పాన్‌ ఇండియా రిలీజ్‌ చేస్తే బాగుంటుందని అనుకున్నాను. కానీ పలు కారణాల వల్ల అది పాన్‌ ఇండియాకు సెట్‌ కాదని ఫిక్స్‌ అయ్యాను. అయితే ఇది మాత్రం తప్పకుండా పాన్‌ ఇండియా రిలీజ్‌కు సరిపోయే కథ.

యాక్షన్‌ పరంగా ఈ చిత్రానికి మీరు న్యాయం చేయగలిగారని అనుకుంటున్నారా?
సుధీర్‌: యాక్షన్‌ హీరో అంటే ఎలాంటి లక్షణాలు ఉండాలని మీరు అనుకుంటున్నారు?. నా వరకూ నేను చేసిన యాక్షన్‌ ఏ హీరో చేయలేరు. కథ సపోర్ట్‌ చేస్తే సీజీ లేకుండానే ఎలాంటి యాక్షన్‌ అయినా నేను చేసినంతగా ఏ హీరో చేయలేరు. అది అయితే తప్పకుండా చెప్పగలను. జాకీచాన్‌కు నేను వీరాభిమానిని. నేను సినిమాల్లోకి రాకముందు.. మా ఇంటి పక్కన థియేటర్‌లో జాకీచాన్‌ సినిమాలు విడుదలైనప్పుడు రోలింగ్‌ టైటిల్స్‌లో వచ్చే యాక్షన్‌ సీన్స్‌ చూడటం కోసమే నేను వెళ్లేవాడిని.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

'మా ఇద్దరికి దిష్టి పెట్టేశారు.. భవిష్యత్తులో డైరెక్టర్​ అవుతానేమో!'

Sudheer Babu Latest Interview : 'ఆయన మాట్లాడేంతవరకు ఎవరి కాల్స్ అటెండ్ చేయను'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.