ETV Bharat / entertainment

ఓవర్సీస్​లో రమణగాడి ర్యాంపేజ్​ - ఫ్యాన్స్​తో కలిసి సినిమా చూసిన మహేశ్‌ - గుంటూరు కారం వసూళ్లు

Sudarshan Theatre 35mm Mahesh Babu : సంక్రాంతి కానుకగా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'గుంటూరు కారం' చిత్రాన్ని అభిమానులతో కలిసి వీక్షించారు మహేశ్​ బాబు. ఈ సినిమా ఓవర్సీస్​ యూఎస్​ఏ మార్కెట్​లో ప్రీమియర్స్​ ద్వారా అదిరిపోయే వసూళ్లను అందుకుంది.

ఓవర్సీస్​లో రమణగాడి ర్యాంపేజ్​ - ఫ్యాన్స్​తో కలిసి సినిమా చూసిన మహేశ్‌

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 12, 2024, 2:20 PM IST

Sudarshan Theatre 35mm Mahesh Babu : 'గుంటూరు కారం' చిత్రాన్ని అభిమానులతో కలిసి వీక్షించారు సూపర్ స్టార్ మహేశ్ బాబు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఆయన నటించిన ఈ హ్యాట్రిక్‌ మూవీ సంక్రాంతి కానుకగా నేడు(జనవరి 12) ప్రేక్షకుల ముందుకు గ్రాండ్​గా వచ్చింది. మంచి టాక్​తోనే ఆకట్టుకుంటోంది. అయితే మహేశ్ సినిమా రిలీజ్ అంటే థియేటర్స్​ దగ్గర సెలబ్రేషన్స్ ఎలా​ ఉంటాయో తెలిసిన విషయమే. ముఖ్యంగా మహేశ్​ ఫేవరెట్ థియేటర్ సుదర్శన్​లో అయితే ఓ రేంజ్ సెలబ్రేషన్స్ జరుగుతుంటాయి. ఆ వేడుకను చూడడానికి సూపర్ స్టార్​ ఫ్యామిలీతో కలిసి పలు మూవీ రిలీజ్‌లకు అక్కడికి వచ్చి ఫ్యాన్స్​తో సినిమా చూస్తూ ఎంజాయ్ చేస్తుంటారు.

అలానే తాజాగా హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌లోని సుదర్శన్‌ థియేటర్‌లో సూపర్ స్టార్ గుంటూరు కారం​ చిత్రాన్ని చూశారు. అభిమానులతో కలిసి ఎంజాయ్​ చేస్తూ సినిమాను వీక్షించారు. ఇక థియేటర్​లో తమ హీరోను చూసిన ఫ్యాన్స్​ ఆనందంతో సందడి చేశారు. థియేటర్లో ఈలలు వేస్తూ గోల చేస్తూ రచ్చ రచ్చ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి.

Guntur Kaaram Overseas Premieres Collections : ఓవర్సీస్​లో రికార్డ్​ - మహేశ్ బాబు సినిమాలు అంటే మాములుగానే ఓవర్సీస్​లో మంచి వసూళ్లను అందుకుంటుంటాయి. తాజాగా గుంటూరు కారం సినిమాకు అక్కడ కెరీర్ బెస్ట్ నంబర్ ఆఫ్ స్క్రీన్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడాయన కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్​ను అందుకున్నారు. యుఎస్ఏ మార్కెట్​లో ప్రీమియర్స్​ ద్వారా 1.4 మిలియన్ డాలర్స్​కు గ్రాస్​ను కలెక్ట్ చేశారు. ఇది మహేశ్​ కెరీర్​లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ చిత్రానికి భారీ ఓపెనింగ్ డే నెంబర్స్​ను అందుకునేలా కనిపిస్తోంది.

కాగా, 'అతడు', 'ఖలేజా' వంటి క్లాస్ చిత్రాల తర్వాత దర్శకుడు త్రివిక్రమ్​ - సూపర్ స్టార్​ మహేశ్ బాబు​ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా 'గుంటూరు కారం'. యంగ్ సెన్సేషనల్​ బ్యూటీస్​ శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటించారు. సీనియర్ నటులు జగపతి బాబు, రమ్యకృష్ణ కీలక పాత్రలు పోషించారు. రమణ పాత్రలో మహేశ్‌ మాస్‌ లుక్‌లో ఆకట్టుకున్నారు.

'హనుమాన్' రాంపేజ్​ - ప్రశాంత్ వర్మ ఈ రేంజ్​​ అస్సలు ఉహించలేదయ్యా!

రివ్యూ : గుంటూరు కారం - ఆ రెండే హైలైట్స్​ - సినిమా ఘాటుగా ఉన్నట్టేనా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.