ETV Bharat / entertainment

కథలు సిద్ధం, సినిమాలు పట్టాలెక్కేది ఎప్పుడో - సాయి పల్లవి కొత్త చిత్రాలు

ఒకప్పుడైతే కథానాయికలు ఆడిపాడటానికే పరిమితమా అన్నట్టుగా కనిపించేవారు. వాళ్లను గ్లామర్‌ డాల్స్‌గానే పరిగణిస్తూ ఆ కోణంలోనే చూస్తూ ఎంపిక చేసుకొనేవారు. అందుకు తగ్గట్టుగానే ఒకట్రెండు రొమాంటిక్‌ సన్నివేశాల్లోనూ పాటల్లోనూ కనిపించి ఆ వెంటనే కనుమరుగైపోయేవారు. క్రమంగా ఆ పరిస్థితుల్లో మార్పు జరిగింది. కథానాయికల కోసం బలమైన వ్యక్తిత్వంతో కూడిన పాత్రల్ని సిద్ధం చేయడం, వాళ్ల చుట్టూనే తిరిగే కథల్ని రాయడం మొదలైంది. అప్పుడప్పుడూ అగ్ర హీరోలూ వాళ్ల కథల్లో భాగం అవుతున్నారు. కొన్నేళ్లుగా చిత్రసీమలో క్రమం తప్పకుండా నాయికా ప్రధానమైన సినిమాలు రూపొందుతూనే ఉన్నాయి. ఇప్పుడూ కొన్ని చిత్రీకరణ దశలో ఉండగా మరికొన్ని కథలు వాళ్ల కోసమై వేచి చూస్తున్నట్టు స్పష్టమవుతోంది.

herione-oriented-stories-get-ready-for-movies

author img

By

Published : Aug 28, 2022, 6:45 AM IST

Updated : Aug 28, 2022, 7:21 AM IST

అగ్ర కథానాయికలు మొదలుకొని కొత్త భామల వరకూ అందరూ నాయికా ప్రధానమైన కథల్లో నటించడం కోసం ఆసక్తి ప్రదర్శిస్తుంటారు. ఆ అవకాశాల్ని సొంతం చేసుకుంటే లభించే మైలేజీ వేరు. నటిగా పేరు, కథని మోయగలదనే ఓ నమ్మకం ఆ సినిమాలతో సంపాదించే అవకాశం ఉంటుంది. అందుకే ఆ అవకాశాల కోసం ఎదురు చూస్తుంటారు. ప్రస్తుతం సమంత 'యశోద', 'శాకుంతలం' సినిమాలు చేస్తున్నారు. త్వరలోనే రెజీనా కసాండ్రా, నివేదా థామస్‌ 'శాకిని డాకిని' అంటూ సందడి చేయనున్నారు. అనుపమ పరమేశ్వరన్‌, రెజీనా తదితర భామల చేతుల్లోనూ కొన్ని సినిమాలు ఉన్నాయి. ఇలా అమ్మాయిల కథలు తెలుగులో విరివిగా సిద్ధమవుతున్నాయి. తాజాగా ఆ తరహా కథలతో మరికొంత కథానాయికల పేర్లు ప్రచారంలో ఉన్నాయి.

herione-oriented-stories-get-ready-for-movies
.

పూజా హెగ్డే, రకుల్‌ప్రీత్‌ సింగ్‌ బాలీవుడ్‌ సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నారు. పూజా క్రమం తప్పకుండా తెలుగులో నటిస్తున్నా, రకుల్‌ మాత్రం తన దృష్టంతా హిందీ చిత్రాలపైనే పెట్టింది. అయితే ఓ ప్రముఖ దర్శకుడు వీరిద్దరినీ దృష్టిలో ఉంచుకుని ఓ కథని సిద్ధం చేశారు. ఈమధ్య తాను తీసిన చిత్రం విడుదలైన తర్వాత ఈ కథతో వాళ్లని సంప్రదించే ఆలోచనలో ఉన్నారు. పూజా హెగ్డే 'మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌' సినిమాలో బలమైన పాత్ర చేసి నటిగా తనలో ఎంత సమర్థత ఉందో చాటి చెప్పింది.

రకుల్‌ కూడా అవసరమైతే డీ గ్లామర్‌గా నటించగలనని 'కొండపొలం'తో నిరూపించింది. సాయిపల్లవి బలమైన పాత్రలకి కేరాఫ్‌గా నిలుస్తోంది. ఈమధ్య 'విరాటపర్వం', 'గార్గి' చిత్రాలతో మరోసారి తన సత్తాని చాటి చెప్పింది. సాయిపల్లవి కోసం అనిల్‌ రావిపూడి చాలా రోజుల కిందటే ఓ కథని సిద్ధం చేశారు. ఈమె తమిళంలో మరో నాయికా ప్రధానమైన సినిమా చేయనున్నట్టు సమాచారం. కీర్తిసురేష్‌ కూడా తమిళంలో పోలీస్‌ పాత్రతో కూడిన ఓ నాయికా ప్రధానమైన కథలో నటించడానికి పచ్చజెండా ఊపింది. కీర్తి సినిమా అంటే తెలుగులోనూ విడుదలవడం ఖాయం.

నవతరం భామ కృతిశెట్టి కోసం ఓ కథ సిద్ధమైంది. యువ దర్శకుడు విరించి వర్మ ఆ కథని రూపొందిస్తున్నట్టు తెలిసింది. 'సీతారామం'తో దక్షిణాది ప్రేక్షకులకి ఎంతగానో నచ్చేసిన కథానాయిక మృణాల్‌ ఠాకూర్‌. ఆమె కోసం ఓ మహిళా దర్శకురాలు హీరోయిన్‌ ఒరియెంటెడ్‌ కథని సిద్ధం చేశారని, త్వరలోనే ఈ కలయికలో సినిమా పట్టాలెక్కుతుందని టాలీవుడ్‌ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. ఇలా భామల కోసం విరివిగా కథలైతే సిద్ధమవుతున్నాయి మరి.. ఆయా సినిమాలు ఎప్పుడు పట్టాలెక్కుతాయనేది చూడాలి. అభిమానులూ ఈ విషయంలో ఉత్సాహంగా ఉన్నారు.

ఇవీ చదవండి: అంత ఖర్చు పెట్టి సినిమాలకు ఎవరు వస్తారన్న నరేశ్

లైగర్ గురించి మైక్ టైసన్ అప్పుడే మర్చిపోయారా, వైరల్ అవుతున్న వీడియో

Last Updated : Aug 28, 2022, 7:21 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.