ETV Bharat / entertainment

చిరంజీవి కోసం పోలీసు లాఠీ దెబ్బలు తిన్న శ్రీకాంత్​ - శ్రీకాంత్ చిరంజీవి సినిమాలు

మెగాస్టార్ చిరంజీవి కోసం తాను ఓ సారి పోలీసుల లాఠీ దెబ్బలు తిన్నట్లు తెలిపారు సీనియర్​ నటుడు శ్రీకాంత్​. అసలేం జరిగిందంటే.

chiranjeevi srikanth
మెగాస్టార్​ చిరు కోసం లాఠీ దెబ్బలు తిన్న శ్రీకాంత్​
author img

By

Published : Sep 1, 2022, 7:29 AM IST

మెగాస్టార్​ చిరంజీవి శ్రీకాంత్​ మధ్య మంచి అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిద్దరు కలిసి పలు సినిమాల్లో కూడా నటించారు. ఇక శ్రీకాంత్.. పలు సందర్భాల్లో చిరుపై తనకున్న అభిమానాన్ని చాటుకుంటుంటారు. ఆయన్ను ప్రేమగా అన్నయ్య అని పిలుస్తూ ఉంటారు. అయితే తాజాగా మారోసారి చిరుపై తనకున్న ప్రేమను తెలియజేశారు. ఓ సందర్భంగా చిరు కోసం పోలీసు దెబ్బలు తిన్న సంఘటనను గుర్తుచేసుకున్నారు. ఫస్ట్ డే ఫస్ట్ షో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్​కు చిరంజీవితో పాటు శ్రీకాంత్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిరుతో తనకున్న అనుబంధం గురించి మాట్లాడారు.

"మొదటి నుంచి నేను చిరంజీవికి పెద్ద ఫ్యాన్. ఆయన సినిమా వచ్చిందంటే ఫస్ట్ డే ఫస్ట్ షో చూడకుండా ఉండలేను. ముఖ్యంగా వేట సినిమా సమయంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అప్పట్లో ఎక్కువ రష్ ఉండేది. ఇప్పుడిలా ఆన్ లైన్​లో టికెట్స్ లేవు. దీంతో 5 గంటలకు షో అయితే.. 3 గంటలకే సైకిల్ వేసుకొని థియేటర్ వద్ద ఎదురుచూసేవాళ్లం. ఆ సమయంలో పోలీసులు వచ్చేశారు. ఇక లాఠీఛార్జ్ మొదలు.. అలా చిరంజీవి అన్న సినిమా కోసం దెబ్బలు కూడా తిన్నాను. బాగా గట్టిగా కొట్టారు. అయినా టికెట్ తీసుకొని సినిమా చూశాను. అలా చాలా సార్లు జరిగింది. ఇప్పుడు ఈ విషయాలను అన్నయ్య ముందు పంచుకోవడం ఎంతో ఆనందంగా ఉంది" అని చెప్పుకొచ్చారు.

ఇదీ చూడండి: ఆ విషయంలో నేనూ బాధితుడినే: చిరంజీవి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.