ETV Bharat / entertainment

వర్షతో మనస్పర్థలు.. హార్ట్​ టచింగ్​ సాంగ్స్​తో చెక్​ పెట్టిన ఇమ్మూ.. పెర్​ఫార్మెన్స్​ సూపర్​ - వర్ష ఇమ్మాన్యుయెల్ లవ్​ సాంగ్స్​

బుల్లితెర పాపులర్​ జోడీల్లో ఇమ్మాన్యుయెల్​-వర్ష ఒకరు. అయితే తామిద్దరి మధ్య దూరం పెరిగినట్లు వస్తున్న వార్తలకు క్లారిటీ ఇచ్చాడు ఇమ్ము. అది నిజమేనని చెబుతూ పాట రూపంలో తన బాధను తెలియజేశాడు. అయితే దీనికి వర్ష కూడా స్పందించారు? తామిద్దరి మధ్య ఎందుకు మనస్పర్థలు వచ్చాయో తెలియజేశారు. దీనికి సంబంధించిన క్లిప్​ సోషల్​మీడియాలో వైరల్​ అవుతోంది. ఇందులో ముఖ్యంగా ఇమ్మూ పాడిన విధానం ప్రేక్షకుల హృదయాల్ని హత్తుకుంటోంది. ఓ సారి మీరు చూసేయండి..

Varsha Immanuel love story
వర్ష ఇమ్యాన్యుయెల్ లవ్​ సాంగ్స్​
author img

By

Published : Nov 7, 2022, 4:13 PM IST

'జబర్దస్త్' ఇమ్మాన్యుయెల్​-వర్ష జోడీ ఎంత పాపులర్​తో తెలిసిన విషయమే. ఇద్దరు కలిసి స్కిట్లు చేస్తూ నవ్వులు పూయిస్తుంటారు. చాలా సార్లు వీరిద్దరు తమ మధ్య ఉన్న ప్రేమను కూడా బయటపెట్టారు. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు పరోక్షంగా చెప్పారు. అయితే వీరిద్దరి మధ్య దూరం పెరిగినట్లు గత కొద్ది రోజులుగా వార్తలు విపరీతంగా వచ్చాయి. అయిన ఇదంతా నిజమేనని చెబుతూ.. పాట రూపంలో తన బాధను వ్యక్తం చేశాడు ఇమ్మాన్యుయెల్​. వర్ష తనకు దూరమైందంటూ.. శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో స్యాడ్​ లవ్​ సాంగ్స్​ పాడి తనలోని బాధను బయటపెట్టాడు. ఇటీవలే దీనికి సంబంధించిన ప్రోమో విడుదల కాగా తాజాగా పూర్తి ఎపిసోడ్​ టెలికాస్ట్ అయింది.

ఇందులో ఇమ్యాన్యుయెల్​ హార్ట్​ఫీల్​ పెర్​ఫార్మెన్స్ అదిరిపోయింది. నాలుగు ప్రేమ విషాద గీతాలు ఆలపించాడు. ఘర్షణలోని 'చెలియా చెలియా', నా ఆటోగ్రాఫ్​లోని 'నువ్వంటే ప్రాణమని' అంటూ వర్షను ఉద్దేశించి విషాద పాటలను పాడాడు. ఇమ్మూ పాట పాడుతున్నంత సేపు వర్ష కూడా ఎంతో బాధతో కనిపించింది. ఇమ్మూ పాడటం, వర్ష బాధపడటం సన్నివేశాలు హృదయాన్ని హత్తుకున్నాయి.

అనంతరం ఎందుకు ఇలా పాడాల్సి వచ్చిందో తెలిపాడు ఇమ్మాన్యుయెల్‌. 'ఏమైందని.. మళ్లీ ఏమైనా అయిందా' అంటూ ఇంద్రజ, యాంకర్ రష్మి అడగగా... తామిద్దరి మధ్య దూరం బాగా పెరిగిపోయినట్లు చెప్పాడు ఇమ్మూ. బాగా ఫ్రెండ్లీగా ఉండే విధానం నుంచి హై,బాయ్​ చెప్పుకునే స్థితికి వచ్చిందని అన్నాడు. అందుకే తన ప్రేమను తెలియజేయడం కోసం ఇలా పాడినట్లు చెప్పాడు.

దీంతో 'ఏమైంది వర్ష' అని ఇంద్రజ అడగ్గా స్టేజ్‌ మీదున్న వర్ష.. తలదించుకుని కాసేపు ఏమీ స్పందించలేదు. ఆ తర్వాత వర్ష మాట్లాడుతూ.. ఇంతకముందులా మేము ఉండలేకపోతున్నాం. ఎందుకో తెలీదు అంటూ కన్నీరుపెట్టుకుంది. అలా కాసేపు ఒకరినొకరి మధ్య కాసేపు సంభాషణలు జరిగాక చివరికి ఇద్దరు కలిశారు. వర్ష కూడా చివరికి 'నా లైఫ్​లో నువ్వే స్పెషల్​'​ అంటూ తన మనసులో మాటను చెప్పి తమమధ్య జరిగిన వివాదానికి ముగింపు పలికారు. చివరికి షో అంతా ఆనందంతో ముగిసింది. దీనికి సంబంధించిన క్లిప్​ ప్రస్తుతం సోషల్​మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: చిక్కుల్లో షారుక్​ 'జవాన్​' మూవీ.. దర్శకుడు అట్లీపై ఫిర్యాదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.