''సినీతారల జీవితం అనుకున్నంత సౌకర్యవంతంగా ఉండదు. ఈ పరిశ్రమలోకి ఎంట్రీ ఇవ్వొద్దు అని మా అమ్మ శ్రీదేవి ఓసారి నాతో చెప్పారు' అని నటి జాన్వీ కపూర్ చెప్పింది. 'గుడ్‌లక్ జెర్రీ'తో నటిగా మంచి మార్కులు కొట్టేసిన ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన తల్లిని గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురైంది. ''ప్రతి క్షణం అమ్మను ఎంతగానో మిస్ అవుతున్నా. ప్రతిరోజూ ఉదయాన్నే నిద్రలేపేది. ఆమె ముఖాన్ని చూడకుండా నా రోజువారీ పనులు మొదలుపెట్టేదాన్ని కాదు. అలాంటిది ఇప్పుడు ఆమె లేకుండా జీవితాన్ని కొనసాగించడం ఎంతో కష్టంగా అనిపిస్తుంది.'' అని జాన్వీ అంది.
ఇండస్ట్రీలోకి నటిగా ఎంట్రీ ఇస్తానన్నప్పుడు మీ అమ్మ ఏం అన్నారు?'' అని ప్రశ్నించగా.. ''మొదట్లో అమ్మ ఒప్పుకోలేదు. సినీ పరిశ్రమలోకి మాత్రం అడుగుపెట్టొద్దు అని చెప్పింది. 'నా జీవితం మొత్తం పరిశ్రమలోనే గడిచిపోయింది. ఎన్నో ఏళ్లు కష్టపడి మీకిప్పుడు ప్రశాంతమైన జీవితాన్ని ఇచ్చాను. మీరు అనుకున్నట్లు స్టార్ జీవితం అంత సౌకర్యవంతంగా ఉండదు. అలాంటి రంగంలోకి నువ్వు వెళ్లాల్సిన అవసరం ఏముంది?' అని ఆమె ప్రశ్నించింది. కానీ నేను దానికి ఒప్పుకోలేదు. ఏది ఏమైనా నేను నటిగా కొనసాగాలి అనుకుంటున్నా అంటూ నా ఇష్టాన్ని తెలియచేయడంతో ఆమె ఓకే చెప్పింది. నా ఇష్టానికి అంగీకారం తెలిపినప్పటికీ.. 'నువ్వు సున్నిత మనస్కురాలివి. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాక కొంతమంది వ్యాఖ్యలకు నొచ్చుకోక తప్పదు. ఇక్కడ నెగ్గుకు రావాలంటే మరింత కఠినంగా మారాల్సి ఉంటుంది. అది నాకిష్టం లేదు. నీ ప్రతి చిత్రాన్ని నా 300 సినిమాలతో పోల్చి చూస్తారు. అలాంటివి నువ్వు ఎలా తట్టుకోగలవు?' అని అమ్మ ఎప్పుడూ కంగారుపడుతుండేది.'' అంటూ ఆనాటి రోజుల్ని గుర్తు చేసుకుంది బాలీవుడ్ బ్యూటీ.
ఇవీ చూడండి: 'బింబిసార' చిన్నారి గురించి ఈ విషయాలు తెలుసా?
రాజమౌళి చెప్పడం వల్లే ఎన్టీఆర్‌తో అలా చేశా.. లేదంటే: రాజీవ్ కనకాల