ETV Bharat / entertainment

Sreeleela Anil Ravipudi Relation : శ్రీలీల – అనిల్ రావిపూడి చుట్టాలంట.. సీక్రెట్​ రివీల్​ చేసిన దర్శకుడు - అనిల్ రావిపూడి శ్రీలీల రిలేషన్ షిప్​

Sreeleela Anil Ravipudi Relation : శ్రీలీల తనకు దగ్గరి బంధువని సీక్రెట్ రివీల్ చేశారు దర్శకుడు అనిల్​ రావిపూడి. ఆ వివరాలు..

Sreeleela Anil Ravipudi Relation : శ్రీలీల – అనిల్ రావిపూడి చుట్టాలంట.. సీక్రెట్​ రివీల్​ చేసిన దర్శకుడు

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 16, 2023, 3:40 PM IST

Sreeleela Anil Ravipudi Relation : హీరోయిన్‌ శ్రీలీల ప్రస్తుతం వరుసగా స్టార్‌ హీరోలతో నటించే అవకాశాలు దక్కించుకుంటూ కెరీర్​లో దూసుకెళ్తోంది. తన యాక్టింగ్​, డ్యాన్స్‌ స్కిల్స్​తో తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ఓ వైపు యంగ్‌ హీరోలతో ఆడిపాడుతూనే మరోవైపు సీనియర్ హీరోల సరసన నటిస్తోంది. మరో మూడు రోజుల్లో 'భగవంత్‌ కేసరి'లో బాలయ్యతో కలిసి సందడి చేయనుంది.

ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్స్​ జోరుగా సాగుతున్నాయి. దర్శకుడు అనిల్ రావిపూడి వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తాజాగా ఆయన శ్రీలీల గురించి ఓ ఆసక్తికరమైన విషయం చెప్పారు. తనకు శ్రీలీల దగ్గరి బంధువు అవుతుందని సీక్రెట్ రివీల్ చేశారు! శ్రీలీల తల్లి డాక్టర్ స్వర్ణ సొంతూరు ఒంగోలు దగ్గరలో ఉన్న పొంగులూరు అని చెప్పారు. అదే ఊరు తన అమ్మమ్మది కూడా అని అనిల్‌ పేర్కొన్నారు. శ్రీలీల తల్లి స్వర్ణ తనకు అక్క వరుస అవుతుందని ఆయన అన్నారు. ఆ లెక్కన అనిల్‌కు శ్రీలీల కోడలు అవుతుందనమాట.

భగవంత్ కేసరి సెట్స్‌లో అందరి ముందు డైరెక్టర్ గారు అని తనను శ్రీలీల పిలుస్తుందని, ఎవరూ లేనప్పుడు మాత్రం 'మామయ్య' అంటూ ఆట పట్టిస్తుందని కూడా చెప్పారు. శ్రీలీల పుట్టింది తెలుగు నేలపైనే అయినా... పెరిగింది, చదువుకున్నదంతా బెంగళూరు, అమెరికాలోనే. అయినా ఆమె తన అమ్మమ్మ ఊరు పొంగులూరుకు ప్రతీ ఏటా వస్తుందని అనిల్ రావిపూడి స్పష్టం చేశారు. ఇక ఈ విషయం తెలుసుకుంటున్న ఫ్యాన్స్​ తెగ ఎగ్జైత్ అవుతున్నారు. అక్క కూతురితో సినిమా తీశావా అనిల్​ అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు.

Bhagvant Kesari Release Date : ఇకపోతే.. భగవంత్ కేసరి సినిమాలో బాలయ్య కూతురిగా శ్రీలీల నటించింది. ఈ సినిమా ట్రైలర్, టీజర్, పాటలకు విశేష స్పందన వచ్చింది. సినిమాలో కాజల్ అగర్వాల్, శ్రీలీలతో పాటు అర్జున్ రాంపాల్​, శరత్ కుమార్ నటించారు. ఫాదర్ అండ్ డాటర్​ సెంటిమెంట్​తో మూవీ తెరకెక్కింది. షైన్ స్క్రీన్​ బ్యానర్​పై సాహో గారాపాటి నిర్మించారు. అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Bhagavanth Kesari Vs Tiger Nageswara Rao : బాక్సాఫీస్​ పోటీపై బాలయ్య అలా.. రవితేజ ఇలా.. కామెంట్స్​ వైరల్​

Tiger Nageswara Rao Openings : 'టైగర్​' ఓపెనింగ్స్ టార్గెట్​ ఇదే.. ఆ చిత్రాన్ని బ్రేక్ చేస్తుందా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.