ETV Bharat / entertainment

OTTలో అదరగొడుతున్న 'ధమాకా' బ్యూటీ కొత్త మూవీ.. స్ట్రీమింగ్​ ఎక్కడంటే? - ఆహాలో శ్రీ లీల తొలి మూవీ

కన్నడ నటి శ్రీలీల ప్రస్తుతం టాలీవుడ్​లో వరుస ఆఫర్లతో దూసుకెళ్తున్నారు. అయితే ఇటీవలే తన సినిమా ఒకటి ఓటీటీ ప్లాట్​ఫామ్​లో సందడి చేస్తోంది. ఇంతకీ ఆ మూవీ ఏంటంటే?

sree leela movie in aha
sree leela
author img

By

Published : Apr 7, 2023, 9:55 PM IST

Updated : Apr 7, 2023, 10:00 PM IST

'పెళ్లి సందD'తో టాలీవుడ్​లోకి అరంగేట్రం చేసిన కన్నడ బ్యూటీ శ్రీలీల ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో వరుస ఆఫర్లతో దూసుకెళ్తున్నారు. మాస్​ మహారాజా రవితేజతో 'ధమాకా'లో నటించిన ఈ బుల్లితెర భామ ఇప్పుడు చేతి నిండా ఆఫర్లతో బిజీగా ఉంటున్నారు. అంతే కాకుండా ఆమె నటించిన సినిమాలు కూడా టాలీవుడ్​లో కమర్షియల్‌గా మంచి సక్సెస్ సాధించడం వల్ల ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు తెలుగమ్మాయి అయిపోయింది!

అయితే ఇటీవలే ఆహా ఓటీటీ సంస్థ.. శ్రీలీల నటించిన తొలి సినిమా డబ్బింగ్​ వెర్షన్​ను తన స్ట్రీమింగ్​ ప్లాట్​ఫామ్​లో అప్​లోడ్​ చేసింది. భవానీ మీడియా సంస్థ ద్వారా ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. కన్నడలో 'కిస్'​ అనే టైటిల్​తో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పుడు ఆహాలో 'ఐ లవ్‌ యూ ఇడియట్‌' అంటూ సందడి చేస్తోంది. ఇక ఈ సినిమా ఆహాలోనూ అందరినీ ఆకర్షిస్తోంది.

ఇక సినిమా విషయానికి వస్తే.. గతేడాది డిసెంబరు 17న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా అప్పట్లో మంచి టాక్ సొంతం చేసుకుంది. కన్నడ నటుడు విరాట్, శ్రీలీల నటీనటులుగా తెరకెక్కిన ఈ సినిమాకు పూర్ణాచారి పాటలు రాయగా.. హరికృష్ణ బాణీలు కట్టారు. అర్జున్ శెట్టి సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించగా.. ఎడిటింగ్ బాధ్యతలను దీపు ఎస్ కుమార్ నిర్వర్తించారు. అవిరుద్ర క్రియేషన్స్‌ బ్యానర్​పై బత్తుల వసంత తెరకెక్కించిన ఈ సినిమాకు సాయి కిరణ్‌ బత్తుల, సుదర్శన్‌ గౌడ్‌ బత్తుల, ఏపి అర్జున్‌ నిర్మాతలుగా వ్యవహరించారు. అంతే కాకుండా నిర్మాతగా ఉన్న ఏపీ అర్జున్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.

ఇక టాలీవుడ్​లో శ్రీలీల అప్​కమింగ్​ మూవీస్​ విషయాలకు వస్తే.. ఇటీవలే నందమూరి నట సింహం బాలకృష్ణ-అనిల్​ రావిపుడి కాంబినేషన్​లో తెరకెక్కుతున్న 'ఎన్​బీకే 108'లో ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు శ్రీలీల. ఈ సినిమాలో బాలయ్య ఈమెకు బాబాయ్​గా కనిపించనున్నారట. ఇప్పటికే ఓ భారీ సాంగ్​ను చిత్రీకరించిన మూవీ టీమ్​ ప్రస్తుతం షూటింగ్​ను శరవేగంగా కొనసాగిస్తోంది. మరోవైపు హరీశ్ శంకర్​ దర్శకత్వంలో తెరకెక్కతున్న పవన్​ కల్యాణ్​ ఉస్తాద్​ భగత్​ సింగ్​ మూవీలో కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ​అంతే కాకుండా ఈ నాయిక ఇప్పుడు రామ్‌- బోయపాటి శ్రీను కాంబోలో వస్తున్న పాన్‌ ఇండియా సినిమాలోనూ హీరోయిన్​గా నటిస్తున్నారు. మరోవైపు నితిన్​, మహేశ్​ బాబు లాంటి అగ్రతారలతోనూ సినిమాలకు సైన్ చేసింది. ఇలా ఇప్పుడు ఈ కన్నడ బ్యూటీ చేతి నిండా ప్రాజెక్టులతో టాలీవుడ్​లో మంచి క్రేజ్​తో పాటు నేమ్​ను కూడా సంపాదించుకున్నారు.

Last Updated : Apr 7, 2023, 10:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.