ETV Bharat / entertainment

త్వరలోనే 'స్క్విడ్​ గేమ్'​ సీజన్​ 2.. ఈ సారి మరింత ఉత్కంఠగా

Squid game season 2: 'స్క్విడ్​ గేమ్'​.. ఎలాంటి అంచనాలు లేకుండా నెట్​ఫ్లిక్స్​లో విడుదలైన ఈ సిరీస్​ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇప్పడీ సిరీస్​కు సీజన్​ 2 ఉండనుందని అధికారికంగా ప్రకటించారు.

squid game season 2
స్క్విడ్ గేమ్​ సీజన్​ 2
author img

By

Published : Jun 13, 2022, 12:04 PM IST

Squid game season 2: 'స్క్విడ్‌ గేమ్‌'.. ప్రతిక్షణం ఉత్కంఠకు గురిచేసిన ఈ సిరీస్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎలాంటి అంచనాలు లేకుండా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌లో గతేడాది విడుదలైన ఈ కొరియన్‌ సిరీస్‌.. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కొన్ని రోజుల్లోనే 111 మిలియన్ల వ్యూస్‌తో విశేష ఆదరణ సొంతం చేసుకుంది. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే కొంతమందిని సెలక్ట్‌ చేసుకుని, డబ్బు ఆశ చూపి వారందరి ప్రాణాలతో ఓ వ్యక్తి ఆడే ఆటగా దీన్ని రూపొందించిన విధానం ప్రతి ఒక్కరిలో చూడాలనే ఉత్సుకత రేకెత్తించేలా చేసింది.

తాజాగా ఇప్పుడిదే సిరీస్‌కు కొనసాగింపుగా 'స్క్విడ్‌ గేమ్‌-2' రూపొందిస్తున్నట్లు ఆ సిరీస్‌ దర్శకుడు అధికారికంగా ప్రకటించారు. ఇందులో రౌండ్స్‌ మరింత కొత్తగా.. ప్రతి క్షణం ఉత్కంఠకు గురి చేసేలా ఉండనున్నాయని తెలిపారు. "స్క్విడ్‌ గేమ్‌కి ప్రాణం పోసి ఓ సిరీస్‌గా గతేడాది మీ ముందుకు తీసుకురావడానికి 12 ఏళ్లు పట్టింది. కానీ, ఎన్నడూ లేని విధంగా నెట్‌ఫ్లిక్స్‌లో మోస్ట్‌ పాపులర్‌ షోగా 'స్క్విడ్‌ గేమ్‌' పేరు తెచ్చుకోవడానికి కేవలం 12 రోజులు మాత్రమే సమయం పట్టింది. 'స్క్విడ్‌ గేమ్‌'కు ఇంతటి ఘన విజయాన్ని అందించినందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరికీ నా ధన్యవాదాలు. ఇక, ఇప్పుడు జి-హన్‌ రిట్నర్స్‌.. ది ఫ్రెంట్‌ మేన్‌ రిట్నర్స్‌.. సీజన్‌-2 వచ్చేస్తోంది. ఆ సూట్‌ ధరించి గేమ్‌ ప్రారంభించే డీడాగ్జి మళ్లీ తిరిగి రావొచ్చు. CHEOL-SU (మరబొమ్మ) బాయ్‌ఫ్రెండ్‌ యోంగ్‌ హి ఈసారి మీ ముందుకు రానున్నాడు. మరో సరికొత్త గేమ్‌ కోసం మాతో జట్టు కట్టండి" అని ఆయన రాసుకొచ్చారు. అయితే ఈ సిరీస్‌ ఎప్పుడు విడుదల కానుందనేది తెలియాల్సి ఉంది.

ఇదీ చూడండి: 'నాకు అమ్మ లేదు.. అన్నీ ఇంద్రజ గారే.. నా కార్​ కోసం ఆమె...'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.