ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ పేరు తెలియని వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. ఎన్నో సినిమాల్లో నటించి.. ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని ఆయన సంపాదించుకున్నారు. అటు వరుస సినిమాలు చేసుకుంటూ.. ఇటు బుల్లితెరపై కూడా సందడి చేస్తున్నారు. టీవీ రియాలిటీ షో హిందీ బిగ్‌బాస్‌కు గత కొన్ని సీజన్ల నుంచి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.
అయితే సల్మాన్.. కొన్నిరోజుల పాటు బిగ్‌బాస్ షోకు దూరంగా ఉండననున్నారని సమాచారం. ఇటీవలే ఆయన డెంగీ బారినపడినట్లు తెలిసింది. దీంతో శారీరకంగా విశ్రాంతి తీసుకోవాలని సల్మాన్‌కు వైద్యులు సూచించారట. అందుకే ఆయన బదులు బిగ్‌బాస్ షోకు హోస్ట్‌గా బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ వ్యవహరించనున్నారట.
ప్రస్తుతం సల్మాన్ తదుపరి చిత్రం 'కిసీ కా భాయ్ కిసీ కీ జాన్' షూటింగ్ జరుగుతోంది. అయితే జ్వరం కారణంగా ఆయన షూటింగ్‌కు కూడా దూరమయ్యారు.
ఇవీ చదవండి : ఓరి దేవుడా ఈ మరాఠీ మీఠీకి ఇంత టాలెంట్ ఉందా
'ముత్తు' నుంచి 'బాహుబలి' వరకు.. ఇండియన్ సినిమాలను మెచ్చిన హిడియో ఎవరంటే?