ETV Bharat / entertainment

యంగ్ బ్యూటీల జనరేషన్​లోనూ, సీనియర్ భామలు తగ్గేదేలే! - త్రిష లేటెస్ట్ సినిమాలు

South Industry Senior Actress : సౌత్​ సినీఇండస్ట్రీలో కొత్త తరం హీరోయిన్లు వస్తున్నా.. సీనియర్ భామల హవా ఏ మాత్రం తగ్గట్లేదు. తమ అందం, అనుభవంతో ఇప్పటికీ సినిమా ఛాన్స్​లు దక్కించుకుంటున్నారు. ఈ జాబితాలో టాప్​లో ఉన్న హీరోయిన్లు వీరే!

South Industry Senior Actress
South Industry Senior Actress
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 27, 2023, 7:38 AM IST

Updated : Nov 27, 2023, 8:23 AM IST

South Industry Senior Actress : సౌత్​ సినీఇండస్ట్రీ ఎప్పటికప్పుడు కొత్త భామలకు స్వాగతం పలుకుతూ ఉంటుంది. ఈ క్రమంలో సీనియర్ హీరోయిన్​లకు ప్రాధాన్యం తగ్గుతుంది. కానీ, ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు సౌత్​లో కొత్త హీరోయిన్ల హవా నడుస్తున్నా.. సీనియర్ భామల క్రేజ్​ ఏ మాత్రం తగ్గట్లేదు. ఇదివరకు హీరోయిన్​లు పెళ్లి చేసుకోగానే.. సినిమాలకు దూరంగా ఉండేవారు. ఇప్పుడు అలా కాదు. యంగ్​ బ్యూటీలు వస్తున్నా.. సీనియర్లకు ఆకర్షణ ఓ మాత్రం తగ్గట్లేదు. ఈ జాబితాలో ఉన్న సీనియర్లు ఎవరంటే?

నయనతార.. సౌత్​ లేడీ సూపర్‌స్టార్‌ నయనతార.. పెళ్లి తర్వాత కూడా కెరీర్​లో జెట్ స్పీడ్​లో దూసుకెళ్తోంది. ఇటి హీరోయిన్​గా అటు లేడీ ఓరియెంటేటెడ్​ సినిమాల్లోనూ రాణిస్తు.. ఛాన్స్​లు పట్టేస్తోంది. అలా 2021లో రజనీకాంత్ 'పెద్దన్న', 2022లో చిరంజీవి 'గాడ్​ఫాదర్', రీసెంట్​గా 'జవాన్' సినిమాల్లో నటించి తన పాపులారిటీ ఏ మాత్రం తగ్గలేదని నిరూపించుకుంది. ప్రస్తుతం నయన్​ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి.

అనుష్క శెట్టి.. దాదాపు 5 ఏళ్ల తర్వాత 'మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి' సినిమాతో వెండి తెరపై మెరిసింది.. అనుష్క శెట్టి. ఈ సినిమాతో మళ్లీ సక్సెస్ బాట పట్టిన అనుష్క.. మరిన్ని ప్రాజెక్ట్​లకు సైన్ చేసినట్లు తెలుస్తోంది. తెలుగులో చిరంజీవి 156వ చిత్రంలో అనుష్క కీలక పాత్రలో నటించనుందట.

త్రిష.. సినీ ఇండస్ట్రీలో 20 ఏళ్లకుపైగా కెరీర్​ను కొనసాగిస్తోంది నటి త్రిష. ఇదే ఏడాది 'పొన్నియిన్‌ సెల్వన్‌ - 2', 'లియో' సినిమాలతో ప్రేక్షకుల్ని పలకరించిందీ ముద్దుగుమ్మ. ఇక తెలుగులో చిరంజీవి సినిమాలో హీరోయిన్​గా త్రిష ఓకే అయినట్లు టాక్ వినిపిస్తోంది. అటు తమిళంలో కూడా ఆఫర్లు వస్తున్నాయట.

కాజల్‌ అగర్వాల్.. రీసెంట్​గా తెలుగులో 'భగవంత్‌ కేసరి' సినిమాతో బ్లాక్​బస్టర్​ అందుకుంది కాజల్. పెళ్లి తర్వాత సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చిన ఈ అమ్మడు.. రీ ఎంట్రీతోనే హిట్​ తన ఖాతాలో వేసుకుంది. కాజల్ ప్రస్తుతం 'సత్యభామ', 'భారతీయుడు - 2' సినిమాల్లోనూ నటిస్తు కెరీర్​లో దూసుకుపోతోంది.

మరోవైపు తమన్నా, ప్రియమణి, శ్రియ, శ్రుతి హాసన్‌.. కూడా యువతరం హీరోయిన్​లతో పోటీగా అవకాశాలు దక్కించుకుంటున్నారు. తమన్నా ఇటీవల రజనీకాంత్ 'జైలర్'​, ప్రియమణి 'జవాన్' సినిమాల్లో అతిథి పాత్రల్లో మెరవగా.. ప్రస్తుతం ప్రభాస్ పాన్ ఇండియా ఫిల్మ్​లో శ్రుతి హాసన్ లీడ్​ రోల్​ చేయనున్న సంగతి తెలిసిందే.

ఎర్ర డ్రెస్సులో యాపిల్ పండులా శ్రద్ధా దాస్​- అందాలను ఆరబోసిన హాట్ బ్యూటీ!

గజినీతో లైఫ్​ టర్న్​- పేరు మార్చేసిన డైరెక్టర్​- నయన్​ ఫస్ట్​ సినిమా ఏంటో తెలుసా?

Last Updated : Nov 27, 2023, 8:23 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.