బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇన్‌స్టాలో ఆమె షేర్ చేసిన ఫొటోలు వైరల్‌గా మారాయి. ఆ ఫొటోల కారణంగా సోనాక్షికి సీక్రెట్‌గా నిశ్చితార్థం అయ్యిందనే ప్రచారం జరుగుతోంది. డైమండ్ రింగ్ తొడిగినట్టు ఆ ఫొటోలు ఉండటం.. ఒక వ్యక్తి ఆమె చేతిని పట్టుకుని ఉండటం వల్ల.. నిశ్చిర్థం వార్తలకు మరింత ఊతమిచ్చింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
అంతేకాదు.. తన డ్రీమ్ నెరవేరబోతుందని ఈ సందర్భంగా ఇన్‌స్టాలో రాసుకొచ్చింది సోనాక్షి. 'ఈ రోజు నా లైఫ్‌లో బిగ్ డే. నా పెద్ద కలల్లో ఒకటి నెరవేరబోతుంది. మీతో ఆ విషయాన్ని పంచుకోవడానికి వేచి ఉండలేకపోతున్నా. దీన్ని నేనే నమ్మలేకపోతున్నా' అంటూ లవ్ ఎమోజీలను సైతం పంచుకుంది ఈ స్టార్ కిడ్. దీంతో కచ్చితంగా సోనాక్షి ఎంగేజ్‌మెంట్ అయ్యిందంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. అయితే దీనిపై సోనాక్షి ఏం స్పందిస్తో చూడాలి.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ఇదిలా ఉంటే.. ఇటీవల సల్మాన్ ఖాన్‌తో సోనాక్షి ఎంగేజ్‌మెంట్ అయినట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి. దీనిపై సోనాక్షి స్పందించి ఖండించింది. స్టార్ కిడ్‌గా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సోనాక్షి సల్మాన్ ఖాన్‌తో 'దబాంగ్' సినిమాతో హీరోయిన్‌గా తెరంగేట్రం చేసింది. బొద్దుగా ఉండే ఈ భామ తన అందాలతో కనివిందు చేస్తోంది.
ఇదీ చదవండి: విజువల్ వండర్ 'అవతార్-2' ట్రైలర్ వచ్చేసింది..