Ram Pothineni Skanda Movie : రామ్ పోతినేని-బోయపాటి శ్రీను దర్శకత్వంలో రానున్న హైవోల్టేజ్ పాన్ ఇండియా యాక్షన్ మూవీ 'స్కంద'. యంగ్ అండ్ సెన్సేషనల్ క్యూట్ బ్యూటీ శ్రీలీల రామ్ సరసన నటిస్తోంది. అఖండ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత బోయపాటి నుంచి వస్తున్న సినిమా అవ్వడం వల్ల భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో సెప్టెంబర్ 15న విడుదలకు సిద్ధంగా ఉంది.
Ram pothineni Boyapati Movie : ఈ క్రమంలోనే ఆఫ్‌లైన్ ప్రమోషన్స్‌లో జోరు పెంచుతున్న మూవీటీమ్.. ఓ గ్లింప్స్‌తో పాటు సాంగ్‌ను విడుదల చేసింది. గ్లింప్స్ పవర్‌ఫుల్‌గా ఆకట్టుకోగా.. పాట మాత్రం పెద్ద హైప్ ఏమీ క్రియేట్ చేయలదు. తాజాగా మరో రెండు కొత్త పోస్టర్లను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ రెండు పోస్టర్ల ద్వారా మూవీలో ఉండబోయే కంటెంట్ గురించి తెలియజేశారు. పక్కా లవ్ అండ్ యాక్షన్ ఉంటుందని వివరించారు.
Skanda Movie Poster : ఓ పోస్టర్లో రామ్.. పవర్ఫుల్ యాక్షన్ సీక్వెన్స్‌లో కనిపించారు. గుబురు గడ్డం, సీరియస్ లుక్‌లో విలన్లతో పోరాడుతూ వాటిని మట్టికరిపిస్తూ కనిపించారు. మాసీవ్‌గా ఉన్న ఈ పోస్టర్ దట్టమైన పొగతో హైలైట్‌గా ఉంది. మరో పోస్టర్లో రామ్-శ్రీలీల మధ్య లవ్ అండ్ రొమాంటిక్ కెమిస్ట్రీని ఫ్యామిలీ అండ్ యూత్ ఆడియెన్స్‌కు బాగా కనెక్ట్ అయ్యేలా చూపించారు. ఫుల్ రొమాంటిక్‌గా ఉన్న ఈ పోస్టర్ బాగా ఆకట్టుకుంటోంది. ఇందులో రామ్ తెల్ల పంచెకట్టులో, గోల్డ కలర్ చీరలో శ్రీలీల నవ్వులు చిందిస్తూ ఎంతో ప్లజెంట్‌గా, క్యూట్ పెయిర్‌గా కనిపించారు. మొత్తంగా ఈ రెండు పోస్టర్లు అటు మాస్ ఇటు ఫ్యామిలీ ఆడియెన్స్‌ను మెప్పించేలా ఉన్నాయి. సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచాయి.
-
#Skanda - The Attacker Offline promotions Kick-started❤️🔥
— Srinivasaa Silver Screen (@SS_Screens) August 12, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Theatre Standees are out & placed all over #SkandaOnSep15 #RAmPOthineni
Ustaad @ramsayz @sreeleela14 #BoyapatiSreenu @MusicThaman @srinivasaaoffl @SS_Screens @detakesantosh @StunShiva8 @ZeeStudios_ @lemonsprasad… pic.twitter.com/MTTkuvcz3y
">#Skanda - The Attacker Offline promotions Kick-started❤️🔥
— Srinivasaa Silver Screen (@SS_Screens) August 12, 2023
Theatre Standees are out & placed all over #SkandaOnSep15 #RAmPOthineni
Ustaad @ramsayz @sreeleela14 #BoyapatiSreenu @MusicThaman @srinivasaaoffl @SS_Screens @detakesantosh @StunShiva8 @ZeeStudios_ @lemonsprasad… pic.twitter.com/MTTkuvcz3y#Skanda - The Attacker Offline promotions Kick-started❤️🔥
— Srinivasaa Silver Screen (@SS_Screens) August 12, 2023
Theatre Standees are out & placed all over #SkandaOnSep15 #RAmPOthineni
Ustaad @ramsayz @sreeleela14 #BoyapatiSreenu @MusicThaman @srinivasaaoffl @SS_Screens @detakesantosh @StunShiva8 @ZeeStudios_ @lemonsprasad… pic.twitter.com/MTTkuvcz3y
Skanda Movie Release Date : రీసెంట్గా ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తైంది. చివరిగా ఓ పాటను చిత్రీకరించి పూర్తి సినిమా షూటింగ్‌ను కంప్లీట్ చేశారు. ఇకపోతే ఈ సినిమాకు తమన్ స్వరాలు సమకూర్చారు. రామ్ మునుపెన్నడూ చూడని పవర్ఫుల్ రోల్‌గా కనిపిస్తారని ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలతో అర్థమైపోయింది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి చిత్రాన్ని నిర్మిస్తుండగా. . డీఓపీని సంతోష్ డిటాకే అందిస్తున్నారు. తమ్మిరాజు ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. సెప్టెంబర్ 1న సినిమా రిలీజ్ కానుంది.
యాక్టింగ్‌లోనే కాదు.. డ్యాన్స్‌లోనూ తగ్గేదేలే.. రామ్- నితిన్‌తో శ్రీలీల స్టెప్పులు కేక!