ETV Bharat / entertainment

''ప్రిన్స్'​ పోస్ట్​పోన్ కాదు.. రిలీజ్ ఆలస్యమంతే' ​.. ఓటీటీలో 'విక్రమ్​' ఎప్పుడంటే? - drishyam 2 hindi cast

కొత్త సినిమాల అప్డేట్లు వచ్చేశాయి. అనుదీప్ కేవీ దర్శకత్వంలో శివకార్తికేయన్​ నటిస్తున్న 'ప్రిన్స్', కమల్​ హాసన్​ 'విక్రమ్', అజయ్ దేవ్​గణ్​ 'దృశ్యం 2' సహా పలు చిత్రాల విశేషాలు ఇందులో ఉన్నాయి.

sivakarthikeyan prince movie release date
vikram ott release date
author img

By

Published : Jun 21, 2022, 3:52 PM IST

'జాతిరత్నాలు' ఫేం అనుదీప్‌ దర్శకత్వంలో తమిళ నటుడు శివకార్తికేయన్‌ హీరోగా ఓ చిత్రం రూపొందుతోంది. 'ప్రిన్స్‌' పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రం విడుదల తేదీ వాయిదా పడింది. తొలుత ఈ సినిమాను ఆగస్టు 31న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు చిత్ర బృందం సోషల్‌ మీడియాలో ప్రకటించిన సంగతి తెలిసిందే. కార్తికేయన్‌ సరసన ఉక్రెయిన్‌ నటి మరియా నటిస్తోంది. ఇప్పుడు దీపావళి కానుకగా ఈ సినిమాను తీసుకురానున్నారు. ఈ సందర్భంగా సినిమా విడుదల విషయాన్ని తెలియజేస్తూ, శివ కార్తికేయన్‌, అనుదీప్‌, సత్యరాజ్‌, మరియాలు కలిసి మాట్లాడుకునే ఓ ఫన్నీ వీడియోను విడుదల చేశారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

'ప్రిన్స్‌' ఎందుకు ఆలస్యమవుతోందని సత్యరాజ్‌ అడగ్గా, అఫ్గానిస్థాన్‌, కజకిస్థాన్‌, ఉజ్బెకిస్థాన్‌, అంటార్కటికాలలో విడుదల చేద్దామనుకున్నామంటూ అనుదీప్‌ చెబుతున్న వీడియో నవ్వులు పూయిస్తోంది. సురేష్‌ ప్రొడక్షన్స్‌, శ్రీ వేంకటేశ్వర సినిమాస్‌, శాంతి టాకీస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్‌ సంగీతం అందిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా అనుదీప్‌ ఈమూవీని తీర్చిదిద్దారు. ‘డాక్టర్‌’, ‘డాన్‌’ తదితర అనువాద చిత్రాలతో తెలుగు వారికి బాగా దగ్గరయ్యారు శివ కార్తికేయన్‌.

ఓటీటీలో 'విక్రమ్' ఎప్పుడంటే?: కమల్‌హాసన్‌, విజయ్‌ సేతుపతి, ఫహద్‌ ఫాజిల్‌ కీలక పాత్రల్లో లోకేశ్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన మాస్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ 'విక్రమ్‌'. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసింది. కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. లోకేశ్‌ టేకింగ్‌, కమల్‌, విజయ్‌ సేతుపతి, ఫహద్‌ల నటన మరో స్థాయికి తీసుకెళ్లింది.

ఇప్పటికే థియేటర్‌లో సినిమా చూసిన ప్రేక్షకులు ఓటీటీకి ఎప్పుడు వస్తుందా? అని వేస్తున్నారు. ఈ చిత్ర ఓటీటీ రైట్స్‌ను డిస్నీ+హాట్‌స్టార్‌ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఓ వార్త సోషల్‌మీడియా వేదికగా చక్కర్లు కొడుతోంది. జులై 8వ తేదీ నుంచి 'విక్రమ్‌'ను ఓటీటీలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు సమాచారం. దీనిపైన త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.

kaduva release date
జూన్​ 30న థియేటర్లలో పృథ్వీరాజ్​ 'కడువా' విడుదల. సంయుక్తా మేనన్ హీరోయిన్.
drishyam 2 hindi release date
నవంబర్​ 18న అజయ్ దేవ్​గణ్​ 'దృశ్యం 2' విడుదల
chor bazar movie
'చోర్​ బజార్​' వర్కింగ్ స్టిల్
valli mayil movie vijay antony
పుట్టినరోజు సందర్భంగా 'వల్లి మయిల్'లో నటి ఫారియా అబ్దుల్లా లుక్​ రిలీజ్

ఇదీ చూడండి: నాగ చైతన్య-సమంత-శోభితా ధూళిపాల.. అసలేం జరుగుతోంది?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.