ETV Bharat / entertainment

Sithara Entertainments Movies List : ఒకే బ్యానర్​ నుంచి 100 రోజుల్లో 5 సినిమాలు.. ఇదీ రికార్డే! - 3 నెలల్లో సితార బ్యానర్​పై రిలీజ్​కానున్నమూవీస్​

Sithara Entertainments Movies List : సాధారణంగా పేరున్న బ్యానర్లు ఎంత వేగంగా సినిమాలు తెరకెక్కించినా సంవత్సరానికి రెండు లేదా మూడు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తెస్తుంటాయి. కానీ, ఒకేసారి మొత్తం 5 సినిమాలను, అది కూడా 100 రోజుల వ్యవధిలోనే వాటిని రిలీజ్​ చేయనుందంటే కాస్త స్పెషలే కదా మరి. మరి ఈ సాహసం చేయనున్న ఆ బడా బ్యానర్​ ఏదంటే..

Sithara Entertainments Movies List in Coming 100 Days
Sithara Entertainments Movies List In 3 Months
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 19, 2023, 9:46 PM IST

Sithara Entertainments Movies List : ఎంత పెద్ద సినిమా బ్యానరైనా ఏడాదికి రెండు లేదా మూడు సినిమాలను రిలీజ్​ చేస్తుంటాయి. అలాంటిది 100 రోజుల్లోనే మొత్తం 5 సినిమాలను విడుదల చేయడం అంటే కాస్త అరుదైన విషయమే. ఈ సాహసమే చేయబోతోంది ప్రముఖ సినీ బ్యానర్​ 'సితార ఎంటర్​టైన్​మెంట్స్​'. రానున్న మూడు లేదా నాలుగు నెలల్లో మీడియం రేంజ్​తో పాటు మంచి హైప్​ ఉన్న సినిమాలను ప్రేక్షకుల ముందుకు తేనుంది తెలుగులో పెద్ద బ్యానర్​లలో ఒకటైన సితార బ్యానర్​. రానున్న మూడు నెలల్లో విడుదల కానున్న ఈ ఐదు సినిమాల్లో ఒకటి డబ్బింగ్​ చిత్రం కాగా.. మరొకటి సితార ఫ్యామిలీ బ్యానర్​ భాగస్వామ్యంలోనే తీస్తోంది.

ఆ 5 సినిమాలివే..!
లియో : ఇది ఒక డబ్బింగ్​ మూవీ. అయినా దీనిపై మంచి హైప్​ను క్రియేట్​ చేశారు మేకర్స్​. కోలీవుడ్‌ డైరెక్టర్​ లోకేశ్‌ కనగరాజ్‌ - హీరో దళపతి విజయ్‌ కాంబోలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని తెలుగులో సితార బ్యానర్​పై దసరా కానుకగా విడుదల చేయనున్నారు. ఇక ఇదే సమయంలో బాలకృష్ణ భగవంత్ కేసరి, రవితేజ టైగర్ నాగేశ్వరరావులతో పాటు ఈ చిత్రం(లియో) బాక్సాఫీస్ ముందు పోటీ పడనుంది. కాగా, ఇప్పటికే రిలీజైన ఈ సినిమా ప్రచార చిత్రాలు ఆడియెన్స్​ను బాగానే ఆకట్టుకుంటున్నాయి. ఇది సినిమాపై మరిన్ని అంచనాలను పెంచుతున్నాయి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఆదికేశవ :
మెగా అప్​కమింగ్​ హీరో వైష్ణవ్ తేజ్‌, శ్రీలీల జోడీగా రానున్న సినిమా 'ఆదికేశవ'. మిడ్ రేంజ్ సినిమాగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని కూడా సితార ఎంటర్​టైన్​మెంట్స్ నిర్మించింది. దీనిని దీపావళి కానుకగా నవంబరు 10న రిలీజ్​ చేయనున్నారు.

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి :
మాస్​ కా దాస్​ ఫేమ్​ విశ్వక్సేన్ 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'తో డిసెంబర్​ 8న ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. తెలుగు దర్శకుడు కృష్ణచైతన్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.

గుంటూరు కారం :
తన బాబాయి మూవీ బ్యానర్​ హారిక హాసిని క్రియేషన్స్​ భాగస్వామ్యంతో సితార అధినేత నాగవంశీ నిర్మిస్తున్న మూవీ 'గుంటూరు కారం'. ఈ సినిమాలో సూపర్​స్టార్​ మహేశ్​బాబు హీరోగా నటిస్తున్నారు. కాగా, దీనిని జనవరిలో సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదల చేయనున్నారు.

టిల్లు స్క్వేర్ : నేహా శెట్టి, సిద్ధు జొన్నలగడ్డ కాంబినేషన్​లో వచ్చిన DJ టిల్లు ఎంతటి హిట్​ సాధించిందో స్పెషల్​గా చెప్పనక్కర్లేదు. దీనికి సీక్వెల్​గానే రూపొందుతున్న చిత్రం 'టిల్లు స్క్వేర్'. ఈ సినిమా రిలీజ్​ డేట్​ను ఇంకా అనౌన్స్​ చేయనప్పటికీ.. రానున్న మూడున్నర నెలల్లోనే దీనిని విడుదల చేసేందుకు ప్లాన్​ చేస్తున్నారట మేకర్స్. వాస్తవానికి ఈ మూవీని ఈ ఏడాదే విడుదల చేద్దామని అనుకున్నా.. పోస్ట్ ప్రొడక్షన్స్​ పనుల్లో ఆలస్యం కారణంగా అది కాస్త డిసెంబరు చివర్లో లేదా జనవరిలో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.

మొత్తంగా ఒకే బ్యానర్​ నుంచి దాదాపు మూడు లేదా నాలుగు నెలల్లో విడుదలకు రెడీగా ఉన్న ఈ 5 సినిమాలు ఏ మేర విజయాలు సాధిస్తాయో చూడాలి.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.