Singer KK Death Reason: ప్రముఖ బాలీవుడ్ గాయకుడు కృష్ణకుమార్ కున్నాత్ అలియాస్ కేకే.. మంగళవారం హఠాన్మరణం చెందారు. కోల్‌కతాలో ఓ కార్యక్రమానికి హాజరై పలు బాలీవుడ్ గీతాలు ఆలపించారు. తర్వాత తాను బసచేసిన హోటల్‌కు వెళ్లగానే.. ఛాతీలో నొప్పి వచ్చినట్లు తెలుస్తోంది. అక్కడివారు హూటాహుటిన సమీప ఆస్పత్రికి తరలించారు. ఈలోపే ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. కేకేను పరీక్షించిన వైద్యులు గుండెపోటుతో మరణించినట్లు వెల్లడించారు. అయితే కేకే ముఖం, పెదవిపై గాయాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పోలీసులు అసహజ మరణంగా కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.హోటల్‌లో ఉన్న సీసీటీవీ దృశ్యాలను పరిశీలించడం సహా అక్కడి సిబ్బందిని విచారిస్తున్నారు.
రెండురోజుల కోల్‌కతా పర్యటనకు వెళ్లిన కేకే.. రెండు కళాశాలల్లో సంగీత కార్యక్రమాలకు హాజరయ్యారు. ఇందులో భాగంగా మంగళవారం రాత్రి నజ్‌రుల్ మంచా ఆడిటోరియంలో సంగీత కార్యక్రమాన్ని ముగించుకొని వెళ్లే సమయంలో అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. ఆడిటోరియం వందలాది మంది అభిమానులతో నిండిపోగా.. విపరీతమైన వేడికి ఆయన ఇబ్బంది పడినట్లు సమాచారం. ఆడిటోరియం నుంచి హోటల్‌కు వెళ్లగానే.. అక్కడికి పెద్దఎత్తున అభిమానులు చేరుకున్నారు. వారికి కొద్దిసేపు సెల్ఫీలు ఇచ్చిన కేకే.. తర్వాత నిరాకరించారు. అక్కడి నుంచి హోటల్ గదిలోకి వెళ్లే సమయంలో.. గుండెపోటుతో కిందపడిపోయినట్లు అధికారులు వివరించారు. ఆయన వెంట ఉన్నవారు హోటల్ సిబ్బందికి సమాచారం ఇవ్వగా వెంటనే.. ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు.. కేకే చనిపోయినట్లు నిర్ధరించారని తెలిపారు. కిందపడిపోవడం వల్ల కేకేకు నుదుటిపైన, పెదవిపైన గాయాలు అయి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
గుండెపోటు కారణంగానే కేకే చనిపోయి ఉండొచ్చని పోలీసు అధికారులు చెబుతున్నారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత కేకే మరణానికి అసలు కారణాలు తెలుస్తాయని పేర్కొన్నారు. మరోవైపు కేకే భార్య, ఇతర కుటుంబసభ్యులు ఆస్పత్రికి చేరుకున్నారు.
ప్రముఖుల నివాళి: కేకే హఠాన్మరణం పట్ల దేశంలో సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ.. కేకే మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కేకే పాడిన పాటలతో.. ఆయనను దేశం ఎప్పటికీ గుర్తించుకుంటుందని ప్రధాని ట్వీట్ చేశారు. పలువురు బాలీవుడ్ నటులు, గాయకులు కేకేతో తమ అనుబంధాన్ని గుర్తుచేసుకొని.. కన్నీటి పర్యంతమయ్యారు. ట్విట్టర్ ద్వారా కేకేకు నివాళులు అర్పించారు.
-
Heartbroken at the shocking demise of KK. Gone too soon! A fabulous singer and a great soul.He sang ‘Daayi Daayi Daama’ from ‘Indra’ for me. My heartfelt condolences to his family & near and dear ones. May his soul rest in peace! #RIPKK
— Chiranjeevi Konidela (@KChiruTweets) June 1, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">Heartbroken at the shocking demise of KK. Gone too soon! A fabulous singer and a great soul.He sang ‘Daayi Daayi Daama’ from ‘Indra’ for me. My heartfelt condolences to his family & near and dear ones. May his soul rest in peace! #RIPKK
— Chiranjeevi Konidela (@KChiruTweets) June 1, 2022Heartbroken at the shocking demise of KK. Gone too soon! A fabulous singer and a great soul.He sang ‘Daayi Daayi Daama’ from ‘Indra’ for me. My heartfelt condolences to his family & near and dear ones. May his soul rest in peace! #RIPKK
— Chiranjeevi Konidela (@KChiruTweets) June 1, 2022
కేకే మరణ వార్త తనను ఎంతో దిగ్భ్రాంతికి గురిచేసిందని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. చిత్ర పరిశ్రమ అద్భుతమైన గాయకుడ్ని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేసిన చిరంజీవి.. 'ఇంద్ర'లో 'దాయి దాయి దామా' పాట పాడారని గుర్తుచేశారు. కేకే ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. సంగీత ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక బాణిని ఏర్పర్చుకున్నారని పవన్ కల్యాణ్ అన్నారు. 'ఖుషి', 'గుడుంబా శంకర్', 'బాలు', 'జానీ' చిత్రాల్లో కృష్ణకుమార్ ఆలపించిన పాటలు యువతతో సహా పెద్దవాళ్లందరికి ఎంతో చేరువయ్యాయని పేర్కొన్నారు. కేకే కుటుంబానికి భగవంతుడు మనో ధైర్యం ఇవ్వాలని వేడుకుంటున్నట్లు పవన్ తెలిపారు.
-
His songs have been an integral part in every phase of life.
— Sai Dharam Tej (@IamSaiDharamTej) June 1, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
A Legend who has fans across generations and languages.
Terrible loss to the World of Music.
You'll be missed 💔.
You'll live in our hearts sir.#RIPKK https://t.co/32lxrA3Hyn
">His songs have been an integral part in every phase of life.
— Sai Dharam Tej (@IamSaiDharamTej) June 1, 2022
A Legend who has fans across generations and languages.
Terrible loss to the World of Music.
You'll be missed 💔.
You'll live in our hearts sir.#RIPKK https://t.co/32lxrA3HynHis songs have been an integral part in every phase of life.
— Sai Dharam Tej (@IamSaiDharamTej) June 1, 2022
A Legend who has fans across generations and languages.
Terrible loss to the World of Music.
You'll be missed 💔.
You'll live in our hearts sir.#RIPKK https://t.co/32lxrA3Hyn
-
Dear KK ..what’s the hurry buddy ..gifted singers and artists like you made this life more bearable..#RIPKK
— A.R.Rahman (@arrahman) June 1, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">Dear KK ..what’s the hurry buddy ..gifted singers and artists like you made this life more bearable..#RIPKK
— A.R.Rahman (@arrahman) June 1, 2022Dear KK ..what’s the hurry buddy ..gifted singers and artists like you made this life more bearable..#RIPKK
— A.R.Rahman (@arrahman) June 1, 2022
5 వందలకు పైగా పాటలు: కేకే.. తన కెరీర్‌లో 500కుపైగా మధురమైన పాటలు ఆలపించారు. హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మరాఠీ, బెంగాలీ, గుజరాతీ భాషల్లో ఎన్నో పాటలు పాడి లక్షలాది అభిమానుల్ని సంపాదించుకున్నారు. తెలుగు ఆయన పాడిన పాటలు సూపర్ హిట్ అయ్యాయి. అగ్రహీరోలు చిరంజీవి, వెంకటేష్, పవన్ కల్యాణ్, రామచరణ్ సహా అనేక హీరోలకు మంచి హిట్ సాంగ్స్ అందించారు. ఆయా హీరోల కెరీర్‌లోనే ఎప్పటికీ గుర్తుండిపోయే ఆణిముత్యాలయ్యాయి.