ETV Bharat / entertainment

Siima Awards 2023 : దుబాయ్​లో గ్రాండ్​గా 'సైమా' సంబరాలు.. ఆ రెండు రోజులు సందడే సందడి - siima awards 2023 sponsors

Siima Awards 2023 : సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరుపుకునే ఈవెంట్ 'సైమా' అవార్డ్స్. అయితే 2023 'సైమా' అవార్డ్స్ సంబరాలు సెప్టెంబర్ 15,16 తేదీల్లో దుబాయ్​లో జరగనున్నాయి. ఈ మేరకు ఆదివారం హైదరాబాద్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి టాలీవుడ్ స్టార్ హీరో రానా దగ్గుబాటి, హీరోయిన్లు నిధి అగర్వాల్, మీనాక్షి చౌదరి పాల్గొన్నారు.

Siima Awards 2023
Siima Awards 2023
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 4, 2023, 7:32 AM IST

Updated : Sep 4, 2023, 8:05 AM IST

Siima Awards 2023 : దక్షిణాది సినీ ఇండస్ట్రీలో ప్రతిష్ఠాత్మకంగా భావించే 'సైమా' (సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్‌) ఈసారి సెప్టెంబర్ 15, 16 తేదీల్లో గ్రాండ్​గా జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఈవెంట్​కు దుబాయ్ వేదికకానుంది. ఈ క్రమంలో ఆదివారం హైదరాబాద్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి టాలీవుడ్ స్టార్ హీరో రానా దగ్గుబాటి, హీరోయిన్లు మీనాక్షి చౌదరి, నిధి అగర్వాల్‌, సైమా ఛైర్​పర్సన్​ బృందా ప్రసాద్‌, మారుతి సుజుకీ ఇండియా సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ శశాంక్‌ శ్రీవాస్తవ హాజరయ్యారు.

"సైమా అంటే సౌత్ ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీస్ అన్నీ కలిసి జరుపుకునే వేడుక. గత 11 ఏళ్లుగా నేను ఈ వేడుకల్లో భాగమవుతున్నాను. అయితే ప్రతీసారి కొత్తగా మొదలుపెట్టిన ఉత్సాహం, సంతోషం కలుగుతోంది. ఓ మంచి వేదికని ఏర్పాటు చేసి.. కళలపై ఒకే రకమైన అభిరుచి ఉన్న అందరినీ ఒకచోటకి చేర్చడంలో సైమా విజయవంతమైంది. అవార్డులు ఎవరికి వస్తే బాగుంటుందనే అంశం కంటే.. ఎంత ఎక్కువ మంది నటీనటులు ఈ వేడుకలో పాల్గొంటే అంత బాగుంటుందనేది నా అభిప్రాయం" అని రానా అన్నారు.

దక్షిణాది సినిమాల్లో నటిస్తున్నప్పటి నుంచీ 'సైమా' సంబరాల్లో పాల్గొంటున్నట్లు నటి నిధి నిధి అగర్వాల్‌ అన్నారు. గొప్ప నటులతో కలిసి వేదిక పంచుకోవడం ఆనందాన్నిస్తుందని ఆమె తెలిపారు. ఇక సమావేశంలో పాల్గొన్న హీరోయిన్ మీనాక్షి చౌదరి.. అన్ని ఫిల్మ్ ఇండస్ట్రీస్ కలిసి ఎంతో గొప్పగా ఓ పండగలా జరుపుకునే ఈ వేడుకకోసం తాను ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు.

Siima Awards 2023 Sponsors : అయితే 2023 సైమా అవార్డ్స్​కు స్పాన్సర్​గా ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ నెక్సా వ్యవహరించనుంది. ప్రతిసారీ సైమా వేడుకలు.. నటీనటుల డ్యాన్స్​లు, స్కిట్​లతో ఎంతో కోలాహలంగా జరుగుతాయి. అయితే ఈసారి కూడా ప్రేక్షకులకు అదే రేంజ్​లో ఎంటర్​టైన్​మెంట్ అందించేందుకు సైమా సిద్ధమైపోయింది. ఇక యంగ్ బ్యూటీ శ్రీలీల, సీతారామం ఫేమ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్.. సైమా వేదికపై స్టెప్పులేసేందుకు రెడీ అవుతున్నారు. వీరితోపాటు పలువురు నటీనటులు ఆడియెన్స్​ను ఆటపాటలతో అలరించనున్నారు.

లగ్జరీ బంగ్లా.. ఖరీదైన కార్లు.. 'రానా' లైఫ్ స్టైల్ చూస్తే అవాక్కవ్వాల్సిందే!

SIIMA Awards 2023 nominations : రాజమౌళికి పోటీగా నలుగురు యంగ్ డైరెక్టర్స్​

Last Updated : Sep 4, 2023, 8:05 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.