ETV Bharat / entertainment

SIIMA 2023 Nominations : 'సీతారామం'కు 10 నామినేషన్లు.. మరి RRR? - సైమా అవార్డులు 2023 ఆర్​ఆర్​ఆర్​

SIIMA 2023 Nominations: సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌ (సైమా) - 2023లో పోటీపడే చిత్రాల జాబితా విడుదలైంది. ఉత్తమ చిత్రం సహా పలు కేటగిరిల్లో ఏయే సినిమాలు పోటీ పడుతున్నాయో తెలుసుకోండి మరి.

SIIMA 2023 Nominations
SIIMA 2023 Nominations
author img

By

Published : Aug 2, 2023, 7:09 AM IST

Updated : Aug 2, 2023, 7:17 AM IST

SIIMA 2023 Nominations: సినీ ఇండస్ట్రీలో దక్షిణాదిలో ప్రతిష్ఠాత్మక అవార్డుల వేడుకకు సర్వం సిద్ధమైంది. సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌ (సైమా)- 2023లో పోటీపడే చిత్రాల జాబితా రిలీజ్‌ అయింది. అయితే అవార్డుల నామినేషన్స్‌లో టాలీవుడ్ బ్లాక్‌ బస్టర్, ఆస్కార్ అవార్డ్ దక్కించుకున్న ఆర్ఆర్ఆర్ మూవీ ఏకంగా 11 విభాగాల్లో స్థానం దక్కించుకుంది. ఆ తర్వాత స్థానంలో 10 విభాగాల్లో నామినేషన్స్‌తో సీతారామం చిత్రం నిలిచింది.

సెప్టెంబర్​ 15, 16 తేదీల్లో అట్టహాసంగా..
SIIMA Awards 2023 Telugu Nominations : ఉత్తమ చిత్రం కేటగిరీలో టాలీవుడ్​ స్టార్​ హీరోలు ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కథానాయకులుగా దర్శకధీరుడు ఎస్​ఎస్​ రాజమౌళి తెరకెక్కించిన RRR, యంగ్​ హీరో సిద్ధు జొన్నలగడ్డ నటించిన డీజే టిల్లు, యంగ్​ హీరోలు నిఖిల్‌ మిస్టరీ అడ్వెంచర్‌ ఫిల్మ్‌ కార్తికేయ2, అడవి శేష్‌ మేజర్‌లతో పాటు డీసెంట్‌ బ్లాక్‌బస్టర్‌ సీతారామం పోటీ పడుతున్నాయి. ఈ ఏడాది సెప్టెంబరు 15, 16 తేదీల్లో.. దుబాయ్‌లోని డీడబ్ల్యూటీసీలో సైమా వేడుకలు.. అట్టహాసంగా జరగనున్నాయి.

  • #SIIMA2023 Nominations. In Tamil Mani Ratnam’s Ponniyin Selvan:1 Starring Vikram, Trisha & Aishwarya Rai leads with 10 nominations while Lokesh Kanagaraj’s Vikram Starring Kamal Haasan, Vijay Sethupathi & Fahadh Faasil with 9 Nominations is close Second. #NEXASIIMApic.twitter.com/sXAxDz7cuk

    — SIIMA (@siima) August 1, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

పొన్నియన్​ సెల్వన్​@10..
SIIMA Awards 2023 Tamil : ఇకపోతే.. తమిళంలో అత్యధికంగా 10 నామినేషన్స్‌ పొన్నియిన్‌ సెల్వన్‌-1 చిత్రం దక్కించుకుంది. స్టార్​ దర్శకుడు మణిరత్నం కలల ప్రాజెక్ట్​ అయిన ఈ చిత్రంలో విక్రమ్‌, ఐశ్వర్యరాయ్‌, త్రిష తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఆ తర్వాత విలక్షణ నటుడు కమల్‌హాసన్‌- లోకేశ్​ కనగరాజ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కించిన విక్రమ్‌ నామినేషన్స్‌ను దక్కించుకుంది. కన్నడలో చిన్న చిత్రంగా విడుదలై బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షాన్ని కురిపించిన రిషబ్‌శెట్టి కాంతార, యశ్‌, ప్రశాంత్‌ నీల్‌ కాంబోలో వచ్చిన మాస్‌, యాక్షన్‌ మూవీ కేజీయఫ్‌2లకు 11 కేటగిరిల్లో నామినేషన్స్‌ దక్కాయి.

మలయాళంలో ఆరు చిత్రాలు..
SIIMA Awards 2023 Malayalam : మలయాళంలో ఈసారి ఆరు చిత్రాలు ఉత్తమ చిత్రం కేటగిరిలో పోటీపడుతున్నాయి. అమల్‌ నీరద్‌ దర్శకత్వంలో మమ్ముటి నటించిన భీష్మ పర్వం చిత్రానికి 8 నామినేషన్స్‌ రాగా, టోవినో థామస్‌ థల్లుమాలకు ఏడు నామినేషన్స్‌ వచ్చాయి.

Last Updated : Aug 2, 2023, 7:17 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.