ETV Bharat / entertainment

కియారా వెడ్స్ సిద్ధార్థ్​.. పెళ్లి డేట్​ ఇదేనా? - సిద్ధార్థ్ కియారా పెళ్లిపై ఫిల్మ్​ఫేర్​ ట్వీట్​

బాలీవుడ్​ నటులు​ కియారా అడ్వాణీ, సిద్ధార్థ్​ మల్హోత్రాకు సంబంధించి తాజాగా ఓ వార్త సోషల్​ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వీరిద్దరు త్వరలో పెళ్లి బంధంతో ఒకటి కాబోతున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు వార్తలు వస్తున్నాయి.

Kiara Advani, Siddhaarth Malhotra Marriage Date
Kiara Advani, Siddhaarth Malhotra
author img

By

Published : Dec 31, 2022, 10:56 PM IST

బాలీవుడ్​ భామ కియారా అడ్వాణీ.. నటుడు సిద్ధార్థ్​ మల్హోత్రాతో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. కాగా ఈ జంట గురించి తాజాగా మరో వార్త వైరల్​ అవుతోంది. ఈ జంట వచ్చే ఏడాది ఫిబ్రవరి 6న వివాహం చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. రాజస్థాన్‌ జైసల్మేర్‌లోని ఓ ప్యాలెస్​ హోటల్​.. వీరి పెళ్లికి వేదిక కానుందని సమాచారం. ఈ వివాహానికి ముందు జరిగే మెహందీ, హల్దీ, సంగీత కార్యక్రమాలు ఫిబ్రవరి 4, 5 తేదీల్లో జరగనున్నాయని వార్తలు వస్తున్నాయి. ఈ పెళ్లి అత్యంత భారీ భద్రత నడుమ అంగరంగ వైభవంగా.. అతిథులు, కుటుంబ సభ్యుల సమక్షంలో జరగనుందని సమాచారం.

Kiara Advani, Siddharth Malhotra Marriage Date Out
కియారా అడ్వాణీ, సిద్దార్థ్ మల్హోత్రా

అప్పుడే చిగురించిన ప్రేమ..
కియారా, సిద్ధార్థ్​ ప్రేమాయణం 2020 నుంచి సాగుతోందని బాలీవుడ్​ కోడై కూస్తోంది. 2021లో విడుదలైన 'షేర్షా' అనే హిందీ చిత్రంలో.. కియారా, సిద్ధార్థ్​ కలిసి నటించారు. ఆ సినిమా షూటింగ్​ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని టాక్​ నడిచింది. వీరిద్దరి లవ్​ ట్రాక్​కు సంబంధించి కొన్ని రోజుల పాటు సస్పెన్స్​ కొనసాగింది. అయితే కరణ్ జోహార్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన కాఫీ విత్ కరణ్ షోలో.. సిద్ధార్థ్​తో ఉన్న సంబంధం గురించి కరణ్​.. కియారకు ప్రశ్నలు సంధించారు. అందులో భాగంగా 'సిద్ధార్థ్‌తో మీకున్న సంబంధాన్ని మీరు తిరస్కరిస్తున్నారా' అని అడిగిన ప్రశ్నకు.. 'నేను తిరస్కరించడం లేదు.. అలా అని అంగీకరించడం లేదు' అని కియారా బదులిచ్చింది. అలాగే 'మీరు స్నేహితులా' అని అడిగినప్పుడు 'స్నేహితుల కంటే ఎక్కువ' అని కియారా ఆన్సర్ ఇచ్చింది.
ఆ తర్వాత అనేక వేదికలపై వీరి పెళ్లి ప్రస్తావన వచ్చినా పూర్తి క్లారిటీ మాత్రం రాలేదు. కాగా, కియారా ప్ర‌స్తుతం తెలుగులో రామ్‌చ‌ర‌ణ్‌తో శంక‌ర్ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఆర్​సీ15'లో న‌టిస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.