ETV Bharat / entertainment

కమల్ సాంగ్‌కు శ్రుతి హాసన్ డ్యాన్స్​.. జంప్​సూట్​లో అదరగొట్టిన బ్యూటీ - శ్రుతి హాసన్​ సినిమాలు

స్టార్ హీరోయిన్ శ్రుతి హాసన్​కు సంబంధించిన ఓ డ్యాన్స్​ వీడియో సోషల్ మీడియాలో వైరల్​​ అవుతోంది. అది చూసిన అభిమానులు 'వావ్​ సూపర్​ శ్రుతి' అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇంతకీ ఆ వీడియో మీరు చూశారా?

Shruthi Haasan Stepped Kamal Song
Shruthi Haasan Stepped Kamal Song
author img

By

Published : Sep 4, 2022, 11:13 AM IST

Shruthi Haasan Danced Kamal Song: 'అనగనగా ఓ ధీరుడు' చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమలోకి అరంగేట్రం చేసింది కమల్​ హాసన్​ కుమార్తె శ్రుతి హాసన్​. తన అందంతో పాటు అభినయంతో ఆకట్టుకుంటూ వరుసగా ఆఫర్లు చేజిక్కించుకుంటోంది. ఇతర భాషలతో పోలిస్తే తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేసిన శ్రుతి.. వీలు చిక్కినప్పుడల్లా కోలీవుడ్, బాలీవుడ్‌లోనూ సినిమాలు చేస్తోంది. తాజాగా అదిరిపోయే ఓ డ్యాన్స్​ వీడియోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది.

శ్రుతి హాసన్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ.. తనకు సంబంధించిన విశేషాలను అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ.. బోల్డ్ మేకప్​లో బ్లాక్ జంప్ సూట్‌తో డ్యాన్స్​ చేసిన వీడియో షేర్​ చేసింది. తన తండ్రి కమల్ హాసన్​ నటించిన రాజా కాయ వేచ్చ.. అనే సూపర్ హిట్ సాంగ్‌కు స్టెప్పులేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో​ ఆమె అభిమానులు 'వావ్',​ 'సూపర్'​, 'కేక', 'చాలా బాగుంది' అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ప్రస్తుతం గోపిచంద్ మలినేని-బాలకృష్ణ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న 'NBK 107' సినిమాలో శ్రుతిహాసన్​ హీరోయిన్​గా నటిస్తోంది. ఇది కాకుండా ప్రభాస్ పాన్ ఇండియా చిత్రం 'సలార్‌'లో కీలక పాత్ర పోషిస్తోంది.

ఇవీ చదవండి: అమ్మలైనా చక్కనమ్మలే.. మాతృత్వపు మాధుర్యాన్ని అస్వాదిస్తూ.. కెరీర్​లో దూసుకెళ్తూ..

ప్రేక్షకులకు బంఫర్​ ఆఫర్​.. మల్టీప్లెక్స్‌లో రూ.75కే సినిమా.. ఆఫర్‌ ఆ ఒక్క రోజే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.