ETV Bharat / entertainment

తెరపైకి శ్రద్ధా వాకర్​ హత్య కేసు.. లవ్​జిహాదే టార్గెట్​గా.. ప్రీ ప్రొడక్షన్​ వర్క్స్​ షురూ

దేశం మొత్తాన్ని ఉలిక్కిపడేలా చేసిన దిల్లీలోని శ్రద్ధా వాకర్​ ఉదంతం సినిమాగా రూపొందనుంది. బాలీవుడ్​ దర్శకుడు మనీశ్​ సింగ్​.. శ్రద్ధ హత్య కేసును సినిమాగా తెరకెక్కించనున్నట్లు ప్రకటించారు. అందుకు సంబంధించిన పనులను కూడా ప్రారంభించినట్లు తెలిపారు.

Shraddha Walker murder case cinema
Shraddha Walker murder case movie
author img

By

Published : Nov 19, 2022, 12:15 PM IST

Shraddha Walker Case Movie: దేశవ్యాప్తంగా శ్రద్ధా వాకర్ హత్యకేసు సంచలనం సృష్టించింది. పెద్ద ఎత్తున దర్యాప్తు కొనసాగుతుండడం వల్ల షాకింగ్​ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కానీ ఈ హత్య కేసులో ఆధారాల సేకరణ దర్యాప్తు అధికారులకు క్లిష్టంగా మారింది. 35 శరీర భాగాల్లో ఇప్పటికే 13 వరకు దొరికాయి. వాటికి డీఎన్​ఏ పరీక్ష నిర్వహించి అవి శ్రద్ధావో కాదో తేల్చాలి. ఇక మిగతా భాగాలు కనిపిస్తే తెలియజేయండంటూ.. పోలీసు ఉన్నతాధికారులు వివిధ పోలీస్ స్టేషన్లకు ఆదేశాలు జారీ చేశారు. కాగా, శ్రద్ధా వాకర్​ హత్య కేసు సినిమాగా తెరకెక్కనుంది.

బాలీవుడ్​ నిర్మాత, దర్శకుడు మనీష్ సింగ్.. శ్రద్ధా వాకర్ హత్య కేసుపై సినిమా తెరకెక్కించనున్నట్లు ప్రకటించారు. ఈ సినిమాకు సంబంధించి పనులను కూడా ఆయన ప్రారంభించినట్లు తెలిపారు. లవ్‌జిహాద్‌ నేపథ్యంలో ఈ సినిమా రూపొందనుందని వెల్లడించారు. పెళ్లి చేసుకుంటామని నమ్మిస్తూ అమ్మాయిల జీవితాలను నాశనం చేస్తున్న ప్రేమ పిశాచీల గురించి సినిమాలో చూపించనున్నట్లు స్పష్టం చేశారు.

బృందావన్ ఫిల్మ్స్​ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు మనీశ్​ సింగ్​. ఈ సినిమా టైటిల్​ను 'హూ కిల్డ్ శ్రద్ధా వాకర్'గా ఆయన ఫిక్స్​ చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దిల్లీ చుట్టుపక్కల అడవుల వీడియో క్లిప్‌లపై పరిశోధన బృందాన్ని ఆయన ఏర్పాటు చేశారు. దీంతో పాటు షూటింగ్ లొకేషన్స్​ కోసం ఆయన పలు ప్రాంతాలను పరిశీలిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.