ETV Bharat / entertainment

క్యాన్సర్​తో 'షాపింగ్ మాల్' నటి సింధు మృతి.. వైద్యానికి డబ్బుల్లేక ఇంట్లోనే.. - Actress Sindhu cancer news

Shopping Mall Actress Sindhu : షాపింగ్ మాల్ సినిమా సహాయనటి సింధు (44) కన్నుమూశారు. కొంతకాలంగా రొమ్ము క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆమె.. సోమవారం తుది శ్వాస విడిచారు.

Shopping Mall Actress Sindhu
షాపింగ్ మాల్ సహాయనటి సింధు మృతి
author img

By

Published : Aug 7, 2023, 3:12 PM IST

Updated : Aug 7, 2023, 3:47 PM IST

Shopping Mall Actress Sindhu Passed Away : ఫీల్ గుడ్​లవ్​ స్టోరీ 'షాపింగ్ మాల్' సినిమా సహాయనటి సింధు (44) కన్నుమూశారు. సోమవారం ఉదయం 2.15 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. 2020 నుంచి రొమ్ము క్యాన్సర్​ వ్యాధితో బాధపడుతున్న ఈమె.. చెన్నై వలసరవక్కమ్​లోని నివాసంలో లోకాన్ని విడిచారు. ఆర్థిక పరిస్థితులతో సతమతమౌతున్న నటి సింధు.. గత కొద్ది రోజులుగా ఇంటి వద్దే చికిత్స తీసుకున్నారు. ​సింధు మృతి పట్ల ఆమె తోటి నటీనటులు ఆమెకు సంతాపం ప్రకటిస్తున్నారు. చిన్న వయసులోనే ఆమె మరణించడం బాధకారమన్నారు.

సింధు చిన్న వయసు నుంచే జీవితంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు. బాల నటిగా కెరీర్​ ప్రారంభించిన ఆమె.. 2010లో షాపింగ్ మాల్ సినిమాతో గుర్తింపు పొందారు. ఆ తర్వాత కూడా సింధు పలు సినిమాల్లో సహాయనటిగా పనిచేశారు. కాగా ఆమెకు 14 సంవత్సరాల వయసులోనే పెళ్లి జరిగింది. అదే ఏడాది ఓ బిడ్డకు జన్మనిచ్చారు సింధు. కాగా కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువుల సమక్షంలో సోమవారం సింధు అంత్యక్రియలు జరగనున్నాయి.

్
సింధు (పాత చిత్రం)

కన్నడ నటుడు సతీమణి కన్నుమూత
Actor Vijay Raghavendra Wife Passes Away : మరోవైపు, సోమవారమే కన్నడ నటుడు విజయ్‌ రాఘవేంద్ర సతీమణి స్పందన హఠాన్మరణం చెందారు. మూడు రోజుల క్రితం బ్యాంకాక్‌ వెళ్లిన ఆమె సోమవారం ఉదయం గుండెపోటుతో కన్నుమూశారు. ఆమె మరణవార్తతో విజయ్‌ ఇంట విషాదఛాయలు అలుముకున్నాయి. ఆమె మరణం తమను తీవ్రంగా కలచివేస్తోందంటూ విజయ్‌ సన్నిహితులు సోషల్‌మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి సైతం విజయ్‌ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

బెంగళూరుకు చెందిన పోలీస్‌ అధికారి బీకే శివరామ్‌ కుమార్తే స్పందన. 2007లో ఆమెకు నటుడు విజయ్‌ రాఘవేంద్రతో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. 2016లో విడుదలైన అపూర్వ అనే కన్నడ సినిమాలోనూ స్పందన నటించారు. మరో 19 రోజుల్లో స్పందన-విజయ్‌ల వివాహ వార్షికోత్సవం జరగనుంది. ఇంతలోనే ఆమె మృతి చెందడం బాధాకరం.

Last Updated : Aug 7, 2023, 3:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.