Shobu Yarlagadda On Salaar Promotions : పాన్ఇండియా స్టార్ ప్రభాస్ 'సలార్' రీలీజ్‌కు ముందు ఇండస్ట్రీలో సినిమా ప్రమోషన్స్ గురించి విపరీతమైన చర్చ నడిచింది. విడుదల సమయం దగ్గర పడుతున్నప్పటకీ మూవీటీమ్ ఎలాంటి హడావుడి చేయలేదు. ప్రమోషన్స్ విషయంలో అటు ఫ్యాన్స్ కూడా కాస్త నిరాశ చెందారు. ఆఖర్లో దర్శకధీరుడు రాజమౌళి గెస్ట్‌గా చేసిని ఓ స్పెషల్ ఇంటర్వ్యూతో ఫ్యాన్స్ కాస్త హ్యాపీ ఫీలయ్యారు. ఈ ఇంటర్వ్యూకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ గురించి బాహుబలి నిర్మాతల్లో ఒకరైన శోభూ యార్లగడ్డ రీసెంట్గా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
నిర్మాత శోభూ యార్లగడ్డ రీసెంట్గా ఫిల్మ్ మేకర్స్ మీటింగ్‌లో పాల్గొన్నారు. ఈ మీటింగ్‌లో రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభాస్ సినిమాకు ఎలాంటి ప్రమోషన్స్ అవసరం లేదన్న ఆయన, బాలీవుడ్లో మాత్రం కాస్త ప్రమోట్ చేసి ఉంటే వసూళ్లు పెరిగేవని అభిప్రాయం వ్యక్త పరిచారు. రిలీజ్‌కు ముందే సినిమా ఎలా ఉండనుందోనని నార్త్‌లో పరియచం చేయాల్సిందని ఆయన అన్నారు.
Salaar Box Office Collection: తొలి వారం విజయవంతం చేసుకున్న సలార్ సెకండ్ వీక్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా డిసెంబర్ 30న రూ.12.50 కోట్లు వసూల్ చేసింది. దీంతో దేశవ్యాప్తంగా సలార్ ఇప్పటివరకు రూ.329.62 కోట్లు కలెక్షన్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక డిసెంబర్ 31, న్యూ ఇయర్ హాలీడే వీకెండ్లో ఈ వసూళ్లు మరింత పెరిగే ఛాన్స్ ఉంది.
Salaar Overseas Collection: భారత్‌లోనే కాకుండా ఓవర్సీస్లోనూ సలార్‌కు మంచి రెస్పాన్స్ లభిస్తోంది. ముఖ్యంగా నార్త్ అమెరికాలో రికార్డు స్థాయిలో సలార్ దూసుకుపోతోంది. ఇప్పుటికే ఈ సినిమా 8 మిలియన్ డాలర్లు వసూల్ చేసినట్లు మూవీటీమ్ తెలిపింది. మరోవైపు సలార్ వరల్డ్‌వైడ్‌గా రూ.550 కోట్ల మార్క్ అందుకుంది.
-
Vaaadi vidvamsaniki rules levemo…
— Prathyangira Cinemas (@PrathyangiraUS) December 30, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Unna follow avvademo 😉#SalaarCeaseFire charges beyond $8 Million in North America and going super strong 💥🤙🏾#Prabhas #Salaar #BlockbusterSalaar pic.twitter.com/ITFMIx8Emp
">Vaaadi vidvamsaniki rules levemo…
— Prathyangira Cinemas (@PrathyangiraUS) December 30, 2023
Unna follow avvademo 😉#SalaarCeaseFire charges beyond $8 Million in North America and going super strong 💥🤙🏾#Prabhas #Salaar #BlockbusterSalaar pic.twitter.com/ITFMIx8EmpVaaadi vidvamsaniki rules levemo…
— Prathyangira Cinemas (@PrathyangiraUS) December 30, 2023
Unna follow avvademo 😉#SalaarCeaseFire charges beyond $8 Million in North America and going super strong 💥🤙🏾#Prabhas #Salaar #BlockbusterSalaar pic.twitter.com/ITFMIx8Emp
Salaar Cast: ఈ సినిమాలో ప్రముఖ డైరెక్టర్, హీరో పృథ్వీరాజ్, స్టార్ హీరోయిన్ శ్రుతిహాసన్, సీనియర్ నటుడు జగపతిబాబు, శ్రియా రెడ్డి, ఝూన్సీ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. కేజీఎఫ్ ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించగా, హోంబలే ఫిల్మ్స్ నిర్మాణ సంస్థ ఈ సినిమాను రూపొందించింది.
'సినిమాలు క్రికెట్ మ్యాచులా ? - 'సలార్' సోలోగా రిలీజ్ అయ్యుంటే ఇలాంటివి వచ్చేది కాదు'
'కల్కి 2898 ఏడీ' ట్రైలర్ డేట్ ఫిక్స్ - సరిగ్గా అలా ఎలా చెప్పారు సారూ!