ETV Bharat / entertainment

'డైరెక్టర్ చెప్పినట్టే చేశా.. కానీ కాలు విరగ్గొట్టుకున్నా!' - శిల్పాశెట్టి గాయం

బాలీవుడ్​ హీరోయిన్​ శిల్పాశెట్టి.. ఓ వెబ్​సిరీస్​ షూటింగ్​లో గాయపడ్డారు. డైరెక్టర్​​ చెప్పినట్టే చేశానని, కానీ ఆరు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చిందని ఆమె అన్నారు.

shilpa-shetty-injured-in-webseries-police-officer-shooting

author img

By

Published : Aug 10, 2022, 7:35 PM IST

Shilpa Shetty Injured: బాలీవుడ్‌ హీరోయిన్​ శిల్పాశెట్టి గాయపడ్డారు. ప్రస్తుతం ఆమె నటిస్తున్న ఓ వెబ్‌ సిరీస్‌లోని యాక్షన్‌ సన్నివేశాలు చేస్తుండగా ప్రమాదవశాత్తు కాలు విరిగింది. ఈ విషయాన్ని శిల్పా.. ఇన్​స్టా వేదికగా తెలిపారు. 'వాళ్లు రోల్‌ కెమెరా.. యాక్షన్‌.. బ్రేక్‌ లెగ్‌ అన్నారు. అక్షరాలా నేను అదే చేశాను. ఫలితంగా ఆరు వారాలపాటు షూటింగ్‌కు బ్రేక్‌ తీసుకోవాల్సి వచ్చింది. కానీ, తొందర్లోనే మరింత శక్తితో తిరిగి షూటింగ్‌లో పాల్గొంటాను. అప్పటి వరకు నన్ను గుర్తుచేసుకోండి. ప్రార్థనలు ఎప్పటికీ మంచి ఫలితాన్ని ఇస్తాయి. కృతజ్ఞతతో మీ శిల్పాశెట్టి కుంద్రా' అంటూ రాసుకొచ్చారు.

రోహిత్‌ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కుతున్న వెబ్​సిరీస్​ 'ఇండియన్‌ పోలీసు ఆఫీసర్‌'లో శిల్పాశెట్టి నటిస్తున్నారు. ఇందులో సిద్ధార్థ్‌ మల్హోత్రా లీడ్‌రోల్‌ పోషిస్తుండగా.. శిల్పా పోలీసు ఆఫీసర్‌గా కనిపించనున్నారు. ఇసుకలో పలు భారీ యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరిస్తున్న సమయంలో శిల్పా ఈ ప్రమాదానికి గురైనట్లు సమాచారం. అయతే గతంలో సిద్ధార్థ్‌ మల్హోత్రా సైతం గాయపడ్డారు.

ఇవీ చదవండి: విజయ్​ 'లైగర్'​ మేకింగ్ స్టిల్స్​.. సూపరహే!

ప్రముఖ కమెడియన్​కు గుండెపోటు.. వర్కౌట్స్​ చేస్తూ ఒక్కసారిగా..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.