బాలీవుడ్లో మళ్లీ మీటూ ఉద్యమం ముదురుతోంది. బిగ్‌బాస్ కంటెస్టెంట్, బాలీవుడ్ దర్శకుడు సాజిద్ ఖాన్‌ను షో నుంచి తొలగించాలని బాలీవుడ్ నటి షెర్లిన్ చోప్రా సల్మాన్ ఖాన్‌కు విజ్ఞప్తి చేశారు. ఆపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. "అందరూ సల్మాన్‌ను భాయిజాన్ అని పిలుస్తారు.. మా గురించి ఆయన ఎందుకు పట్టించుకోరు? మాకు కూడా పెద్దన్నలా ఎందుకు ఉండరు? లైంగిక వేధింపులకు పాల్పడ్డ వ్యక్తిని, అలవాటుగా తప్పులు చేసే వ్యక్తిని ఎందుకు షో నుంచి తప్పించకూడదు? మా పట్ల ఈ ఉదాసీనత ఎందుకు?" అని సల్మాన్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు.
సాజిద్ ఖాన్ 2018లో మీటూ వివాదంలో చిక్కుకున్నారు. అతడితో పని చేసిన 9 మంది మహిళలు.. సాజిద్ తమను లైంగికంగా వేధించేవారని ఆరోపించారు. అయితే దాదాపు రెండు వారాల క్రితం సాజిద్ ఖాన్‌పై ముంబయిలోని జుహూ పోలీస్ స్టేషన్లో నటి షెర్లిన్ చోప్రా ఫిర్యాదు చేశారు. తాజాగా ఈ విషయంలో లేడీ కానిస్టేబుల్ సమక్షంలో వాంగ్మూలం ఇచ్చారు. ఈ సందర్భంగా సల్మాన్‌పై పలు ప్రశ్నలు సంధించారు షెర్లిన్.
"నేను ఒక విషయంపై క్లారిటీ ఇవ్వదలచుకున్నాను. ఇది నా ఒక్కరి పోరాటం కాదు. సాజిద్ వల్ల వేధింపులకు గురైన ప్రతి మహిళ పోరాటం. లైంగిక వేధింపులు ఆమోదయోగ్యం కాదని నమ్మే ప్రతి వ్యక్తి పోరాటం. లైంగికంగా వేధించడం ఎవరికి పుట్టుకతో వచ్చిన హక్కు కాదు. కానీ ప్రస్తుతం మాతో పోల్చుకుంటే ఎవరు ఔట్‌సైడర్స్, ఖాన్ క్యాంప్‌నకు సంబంధించిన వారు ఎవరు అనే విషయం అర్థమౌతుంది. వాళ్లతో పోరాటం చేయాలంటే కొండంత ఓపిక, ధైర్యం కావాలి. ఈ పోరాటంలో ద్వంద్వ విధానాలు పాటిస్తున్న బాలీవుడ్‌పై, లైంగిక వేధింపులపై అందరూ తమ గళం ఎత్తాలని కోరుకుంటున్నా. మహిళలను వేధించిన తన స్నేహితుడి విషయం గురించి ఎప్పుడూ నోరు విప్పని సల్మాన్ ఖాన్‌కు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నా. మా తర్వాతి కార్యాచరణ సల్మాన్ ఖాన్ ఇంటిముందు నిరసన చేపట్టడమే." అంటూ షెర్లిన్ పలు వ్యాఖ్యలు చేశారు.
ఇవీ చదవండి:'నా చెల్లి కోసం యాక్టింగ్నైనా మానేస్తా.. తన సంతోషమే ముఖ్యం'
కత్రిన రేంజ్ మాములుగా లేదుగా.. ఒక్కో ఇన్‌స్టా పోస్ట్‌కు అంత రెమ్యునరేషనా ?