బాలీవుడ్ నటి, బిగ్ బాస్ కంటెస్టెంట్ షెహ్నాజ్ గిల్ తండ్రి సంతోఖ్ సింగ్‌ను చంపేస్తామని బెదిరించారు దుండగులు. ఫోన్ చేసి దీపావళి లోపు చంపేస్తామన్నారు. దీంతో సంతోఖ్ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అసలేం జరిగిందంటే.. షెహ్నాజ్ గిల్ తండ్రి పంజాబ్‌లోని బియాస్ నుంచి తారంటన్ వెళ్తున్నారు. మార్గమధ్యలో అతడికి ఓ ఫోన్ కాల్ వచ్చింది. కాల్ లిఫ్ట్ చేయగానే తిట్ల పురాణం మొదలుపెట్టారు కొందరు గుర్తుతెలియని దుండగులు. కొద్దిసేపటి తర్వాత.. 'మీ ఇంట్లోకి వచ్చి.. దీపావళి లోపు ముందే చంపేస్తాం' అని బెదిరించారు. దీంతో సంతోఖ్ సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
అయితే సంతోఖ్ను చంపడానికి 2021లో ఇలాంటి ప్రయత్నం జరిగింది. సంతోఖ్ భారతీయ జనతా పార్టీ(భాజపా)లో చేరిన తర్వాత.. 2021 డిసెంబర్ 25న అతడిపై ఇద్దరు దుండగులు దాడికి పాల్పడ్డారు. సంతోఖ్పై కాల్పులకు తెగబడి.. నాలుగు రౌండ్లు కాల్చారు. అనంతరం అతడి గన్‌మెన్ రావడంతో ఆ దుండగులు పారిపోయారు.
ఇవీ చదవండి: నవమీ గాయక్.. అందమైన 'పంచ్లు' విసిరే పద్ధతైన పిల్ల!
కొత్త వెబ్‌సిరీస్ కోసం సామ్ 'స్పెషల్' ట్రైనింగ్.. షూటింగ్ అప్పుడే!