ETV Bharat / entertainment

'పఠాన్​'.. మూడు రోజుల్లో రూ.300కోట్లు.. బాయ్​కాట్ గ్యాంగ్​ మైండ్ బ్లాక్​! - షారుక్ ఖాన్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్​

షారుక్ ఖాన్​ పఠాన్​ బాక్సాఫీస్​ను షేక్ చేస్తోంది. వరుసగా రికార్డులను తన ఖాతాలో వేసుకుంటోంది. ఏకంగా ముడు రోజుల్లో మూడు వందల కోట్లను వసూలు చేసింది. ఆ వివరాలు..

Sharukha Pathan movie collections 300 crores
'పఠాన్​'.. మూడు రోజుల్లో రూ.300కోట్లు
author img

By

Published : Jan 28, 2023, 1:08 PM IST

బాలీవుడ్ బాద్​ షా షారుక్​ ఖాన్ నటించిన 'పఠాన్' చిత్రం బాలీవుడ్​కి మళ్ళీ పూర్వ వైభవం తీసుకువస్తోంది. విడుదలకు మందే పలు రికార్డులు సాధించిన ఈ చిత్రం సెన్షేషనల్​ రికార్డులను తన ఖాతాలో వేసుకుంటోంది. రిలీజైన తొలి మూడు రోజుల్లోనే అటు ఇండియాలో ఇటు ఓవర్సీస్​లో కలిసి వరల్డ్ వైడ్​గా​ అత్యధిక స్థాయిలో కలెక్షన్లు అందుకుని రికార్డుకెక్కింది.

విడుదల ముందు దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో వివాదాలను ఎదుర్కొన్నా ఈ చిత్రం.. ఇప్పుడు వారి నోళ్లను మూయిస్తోంది. తమ కలెక్షన్లతో వారికి మైండ్​ బ్లాంక్​ అయ్యేలా చేస్తోంది. ముఖ్యంగా బాయ్​కాట్​ గ్యాంగ్​కు హడల్​ పుట్టిస్తోంది. తొలి రోజు మతిపోగొట్టే ఓపెనింగ్స్​ కలెక్షన్స్​ను అందుకున్న ఈ మూవీ.. మూడు రోజులు పూర్తయ్యే సరికి శుక్రవారం నాటికి అంతకుమించిన రేంజ్​లో వసూళ్లను సాధించింది. వరల్డ్ వైడ్​గా దాదాపు రూ.300 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఓవర్సీస్​లో రూ.100కోట్లకు పైగా గ్రాస్​ను సాధించింది. ఓవర్సీస్​లో షారుక్​ సినిమాలు రూ.100కోట్లకు పైగా వసూలు చేయడం ఇది పన్నెండో సారి. నాన్​ హాలీడేస్​లోనే ఈ రేంజ్​లో పఠాన్ ఇంత వసూలు చేస్తే ఇక ఈ రెండు రోజులు హాలిడేస్​ కాబట్టి మరో రూ.200 కోట్లు సాధించే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అంటే ఐదు రోజుల్లోనే రూ.500కోట్లు వస్తాయని చెబుతున్నారు.

కాగా, స్పై యాక్షన్ థ్రిల్లర్​గా రూపొందిన ఈ సినిమాలో షారుక్ ఖాన్ సరసన దీపికా పడుకొణె నటించారు. జాన్ అబ్రహం కీలక పాత్ర పోషించగా.. సల్మాన్ ఖాన్ అతిధి పాత్రలో మెరిశారు. సిద్దార్ధ్ ఆనంద్ దర్శకత్వం వహించారు. క‌థ కన్నా యాక్ష‌న్ అంశాల‌కే అధికంగా ప్రాముఖ్య‌త‌నిస్తూ ద‌ర్శ‌కుడు సిద్ధార్థ్ ఆనంద్ ఈ సినిమాను తెర‌కెక్కించారు.

ఇదీ చూడండి: 'బుట్ట బొమ్మ' ట్రైలర్​ వచ్చేసిందిగా.. అతడి నుంచి అనిఖా తప్పించుకుందా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.