ETV Bharat / entertainment

'బాహుబలి' రికార్డును బ్రేక్​ చేసిన 'పఠాన్'​.. తొలి ఇండియన్​ మూవీగా ఘనత! - పఠాన్​ బాహుబలి రికార్డు

షారుక్​ 'పఠాన్'​ విడుదలై నెల రోజులు కావొస్తున్నా బాక్సాఫీస్​ను ఇంకా షేక్ చేస్తూనే ఉంది. తాజాగా మరో అరుదైన ఫీట్​ను అందుకుంది. బాలీవుడ్​లో అత్యధిక వసూళ్లు రాబట్టిన బాహుబలి సినిమా రికార్డును బ్రేక్​ చేసింది.

sharukh khan pathaan movie surpassed bahubali2 hindi lifetime collections

author img

By

Published : Mar 3, 2023, 10:26 PM IST

బాలీవుడ్ బాద్​షా​ షారుక్​ ఖాన్​ నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్​ మూవీ 'పఠాన్' విడుదలైనప్పటి నుంచి బాక్సాఫీస్​ను షేక్ చేస్తూనే ఉంది. అదిరిపోయే రికార్డులను తిరగరాస్తోంది. విడుదలకు ముందు ఎన్నో విమర్శలు అందుకున్నప్పటికీ.. రిలీజ్ తర్వాత తొలి రోజు నుంచే అద్భుతమైన టాక్​తో కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. విడుదలై నెల రోజులు అవుతున్నా బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల జోరు ఏమాత్రం తగ్గలేదు. తొలి వారం రోజుల్లో అయితే ఏకంగా వంద కోట్ల రూపాయల వసూళ్లను ఖాతాలో వేసుకుంది.

తాజాగా ఈ సినిమా బాలీవుడ్‌ బాక్సాఫీస్‌పై సరికొత్త రికార్డు నెలకొల్పింది. బాలీవుడ్‌లో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా సంచలనం సృష్టించింది. ఇన్నాళ్లు బాహుబలి-2 పేరిట ఉన్న ఈ రికార్డును పఠాన్‌ బ్రేక్‌ చేసింది. పోటీగా షెహజాదా, సెల్ఫీ వంటి సినిమాలున్నా పఠాన్‌ భారీ కలెక్షన్‌లతో దూసుకపోతుందంటే విశేషం అనే చెప్పాలి.

కాగా, పఠాన్​ మూవీ స్త్పై యాక్షన్​ థ్రిల్లర్ సినిమాగా రూపొందింది. ఈ చిత్రంలో షారుక్​ సరసన బాలీవుడ్​ బ్యూటీ దీపికా పదుకొణె నటించింది. జాన్​ అబ్రహం కీలక పాత్రలో నటించారు. బాలీవుడ్​ భాయ్​ కండల వీరుడు సల్మాన్​ ఖాన్​ కెమియో​ రోల్​లో కనిపించి ఆకట్టుకున్నారు. ఆయనకు షారుక్​ మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకే హైలైట్​గా నిలిచాయి. ఈ సినిమాకు సిద్ధార్థ్​ ఆనంద్​ దర్శకత్వం వహించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.