ETV Bharat / entertainment

'డంకీ' బడ్జెట్​పై ఫ్యాన్​ డౌట్​ - షారుక్​ స్ట్రాంగ్ రిప్లై - ఆస్క్​ ఎస్​ఆర్​కే

Shahrukh Khan Dunki Movie : బాలీవుడ్ బాద్​షా షారుక్ ఖాన్ ప్రస్తుతం 'డంకీ' సినిమా సక్సెస్​ను ఆస్వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తాజాగా ట్విట్టర్​ వేదికగా ఫ్యాన్స్​తో ముచ్చటించారు. 'డంకీ' సినిమా విశేషాలను పంచుకున్నారు. అయితే ఓ ఫ్యాన్ అడిగిన ప్రశ్నకు తనదైన స్టైల్​లో జవాబిచ్చారు. ఇంతకీ ఏం జరిగిదంటే?

Shahrukh Khan Dunki Movie
Shahrukh Khan Dunki Movie
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 27, 2023, 9:06 PM IST

Shahrukh Khan Dunki Movie : ఫ్యాన్స్​తో మాట్లాడే విషయంలో బాలీవుడ్ బాద్​షా షారుక్ ఖాన్​ స్టైలే వేరు. అది మన్నత్​ దగ్గరైనా సరే ఫ్యాన్స్​ మీట్​లోనేనా సరే. ఇక ట్విట్టర్​లో ఆయన ఫ్యాన్స్​తో ముచ్చటించే తీరును పలువురు సెలబ్రిటీలు ఫాలో అవుతున్నారు. #ASK SRK అంటూ ఫ్యాన్స్ అడిగే క్వశ్చన్స్​కు షారుక్​ ఎంతో కూల్​లా ఆన్సర్స్​ చెబుతుంటారు. ఏదైనా సినిమా రిలీజ్​కు ముందు అలాగే రిలీజ్​ తర్వాత ఇలా ఆయన సోషల్ మీడియా వేదికహగా ఫ్యాన్స్​తో మాట్లాడుతుంటారు. అలా తాజాగా 'డంకీ' సినిమా గురించి పలువురు అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఆయన సరదాగా బదులిచ్చారు.

'డంకీ'కి సంబంధించి మీకు బాగా నచ్చిన మూమెంట్స్? ఆ సినిమాలో మీకు ఇష్టమైన పాట?
షారుక్‌: మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఫన్నీ ఇంటర్వ్యూలు. అలాగే ఈ సినిమాలో 'ఓ మహీ' పాట నాకెంతో నచ్చింది.

'పఠాన్‌', 'జవాన్‌', 'డంకీ' ఈ మూడింటిలో ఏ సినిమా కోసం మీరు ఎక్కువగా శ్రమించారు?
షారుక్‌: వైవిధ్యమైన ఎమోషన్స్​ను పండించటం నటులకు కష్టమైన విషయం. ఆ విధంగా చూస్తే 'డంకీ' కోసం ఎక్కువగా కష్టపడ్డాను.

30 ఏళ్ల సినీ కెరీర్‌లో మీరు నేర్చుకున్న విషయం ఏమిటి?
షారుక్‌: ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేయడాని విలువైన బహుమతి మరొకటి లేదు.

ఈ రోజు సల్మాన్‌ ఖాన్‌ బర్త్‌డే. ఆయనకు విషెస్‌ చెప్పండి?
షారుక్‌: ఆ విషయం నాకు తెలుసు. నేను ఆయనకు విషెస్‌ కూడా చెప్పాను. అయితే నేను ఎప్పుడూ సోషల్‌మీడియాలో చెప్పను. ఎందుకంటే, ఇది పర్సెనల్ కదా.

'డంకీ' బడ్జెట్‌ గురించి ఎంతో ప్రచారం జరుగుతుంది. కొంతమంది రూ.85 కోట్లు అంటున్నారు. మరి కొంతమంది రూ.120 కోట్లు అంటున్నారు. ఇంతకీ ఏది నిజం?
షారుక్‌: బ్రదర్‌ ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్లు అనుకోనివ్వండి. ఇలాంటి వాటిపై కాకుండా వేరే విషయాలపై కాస్త దృష్టి పెట్టు.

'డంకీ', 'జవాన్‌' సినిమాలకు మార్కెటింగ్‌ సరిగ్గా చేయలేదు. కాబట్టి 'రెడ్‌ చిల్లీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌' టీమ్‌లోకి నైపుణ్యం కలిగిన వారిని తీసుకోండి?
షారుక్‌: నా సినిమాలకు నేనే మార్కెటింగ్‌ చేసుకున్నాను. కాబట్టి నన్ను నేనే ఉద్యోగం నుంచి ఎలా తొలగించుకుంటాను.

మీరు ఇంగ్లిష్‌ చాలా చక్కగా మాట్లాడతారు. అలాంటప్పుడు రాజ్‌కుమార్‌ హిరాణీ 'డంకీ'లోకి మిమ్మల్ని ఎందుకు ఎంచుకున్నారు?
షారుక్‌: రొమాంటిక్‌ సీన్స్‌లో నేను చక్కగా యాక్ట్‌ చేస్తాను. అలాంటి నన్ను'పఠాన్‌', 'జవాన్' లాంటి యాక్షన్‌ సినిమాల్లోకి ఎంచుకున్నారు కదా. అలాగే 'డంకీ'లోకి కూడా ఎంచుకున్నారు.

'ఇకపై వయసుకు తగ్గ పాత్రలు చేస్తా'- డంకీ రిలీజ్ తర్వాత షారుక్ షాకింగ్ డెసిషన్​!

'డంకీ'కి అరుదైన గౌరవం - ఆ ప్రతిష్టాత్మక భవనంలో స్పెషల్ స్క్రీనింగ్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.