ETV Bharat / entertainment

'ధూమ్​ -4'లో షారుక్​? సూపర్ పోలీస్​గా చెర్రీ! ఇక ఫ్యాన్స్​కు పండగే! - రామ్​ చరణ్ బాలీవుడ్ మూవీ

Shahrukh Khan Dhoom 4 : రోమాంటిక్​ సినిమాలతో అమ్మాయిల మనసలు కొల్లగొట్టిన షారుక్​ ఖాన్​, యాక్షన్​ సినిమాలతోనూ ఆడియెన్స్​ను ఆకట్టుకుంటుంటారు. ఆయన నటించిన 'జవాన్​', 'పఠాన్​', 'డాన్' లాంటి సినిమాలు ఇందుకు పర్ఫెక్ట్​ ఉదాహరణ. అయితే తాజాగా ఆయన మరో యాక్షన్​ మూవీతో అలరించనున్నారట. ఆ విశేషాలు మీ కోసం

Shahrukh Khan Dhoom 4
Shahrukh Khan Dhoom 4
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 28, 2023, 4:28 PM IST

Shahrukh Khan Dhoom 4 : జానర్ ఏదైనా సరే తమ నటనతో అభిమానులను ఇట్టే ఆకట్టుకుంటారు కొందరు స్టార్స్​. అందులో బాలీవుడ్ బాద్​షా షారుక్ ఖాన్ ఒకరు. ఒకానొక కాలంలో రొమాంటిక్​ సినిమాల్లో నటించి డ్రీమ్​ బాయ్​గా సందడి చేసిన ఈ స్టార్ హీరో ఆ తర్వాత కొంత కాలానికి తన స్టైల్​ను మార్చుకుని యాక్షన్ ఫీల్డ్​లోకి ఎంట్రీ ఇచ్చారు. 'దిల్​ వాలే దుల్హనియా లే జాయేంగా'తో​ అమ్మాయిల మనసులు దోచిన ఈ సొట్టుబుగ్గల హీరో, 'డాన్', 'రావన్​', 'రాయిస్' ​లాంటి యాక్షన్​ సినిమాల్లో మెరిసి యూత్​ను ఆకట్టుకున్నారు. ముఖ్యంగా ఈయన నటించిన 'డాన్​' మూవీ యాక్షన్​ సినిమాల్లో సూపర్​ ఫేమస్​ అవ్వడమే కాకుండా ఓ నయా ట్రెండ్​ సెట్​ చేసింది. ఇప్పటికే ఇది మూడు పార్టులుగా విడుదలై సెన్సేషన్​గా నిలిచింది.

ఇక తాజాగా వచ్చిన 'జవాన్​' సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారీ అంచనాల నడుమ వచ్చిన ఈ మూవీ సూపర్ హిట్ టాక్ అందుకుని ఎన్నో బాక్సాఫీస్​ రికార్డులు బద్దలు కొట్టింది. ఆ తర్వాత షారుక్ 'డంకీ' సినిమాలో నటించారు. ఇది కూడా ప్రస్తుతం మంచి టాక్​ అందుకుని దూసుకెళ్తోంది. అయితే ఈ సినిమా తర్వాత ఆయన తదుపరి ప్రాజెక్ట్ అప్​డేట్​ గురించి అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

అయితే సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ బీటౌన్ బాద్​షా త్వరలో ధూమ్​ ఫ్రాంచైజీలో తెరకెక్కనున్న ధూమ్​-4 సినిమాలో మెరవనున్నారట. అంతే కాకుండా ఈ చిత్రంలో మెగా పవర్​ స్టార్ రామ్​ చరణ్​ పోలీసు పాత్ర చేయనున్నారని సమాచారం. అయితే ఈ విషయంపై ఇప్పటి వరకు ఎటువంటి అఫీషియల్ అనౌన్స్​మెంట్​ రాలేదు. కానీ ఫ్యాన్స్​ మాత్రం ఈ రూమర్​ను ట్రెండ్​ చేస్తూ నెట్టింట సంబరాలు చేసుకుంటున్నారు. ఆయన యాక్షన్ మూవీ క్లిప్పింగ్స్​ను ధూమ్ సాంగ్స్​, డైలాగ్స్​తో జత చేసి సోషల్ మీడియాలో వైరల్​ చేస్తున్నారు.

మరోవైపు గతంలో ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ నటిస్తున్నట్లు వార్తలొచ్చాయి. కానీ అవేం నిజం కాదంటూ మూవీటీమ్​ క్లారిటీ ఇచ్చింది. కానీ ఈ విషయంలో ఇప్పటి వరకు ఎటువంటి అనౌన్స్​మెంట్ రాలేదు. దీంతో మరికొందరు నెటిజన్లు అఫీషియల్ టాక్​ కోసం ఈగర్​గా ఎదురుచూస్తున్నారు.

'ఫోర్బ్స్' మ్యాగజైన్​పై స్టైలిష్​గా చెర్రీ, ఉప్సీ- టాలీవుడ్​ ఫస్ట్ కపుల్​గా ఘనత!

'PK లా అవుతుందనుకున్నాం- ఆ విషయంపై మేం ఫోకస్ చెయ్యలేదు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.