Shah Rukh Khan Son School Fee : బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ ఇండియన్ సినిమా హిస్టరీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమాలతో పాటు ఫ్యామిలీకి కూడా సమయం కేటాయించి కెరీర్‌ను బ్యాలెన్స్ చేస్తుంటారు షారుక్. సెప్టెంబర్‌లో ముంబయి లాల్బాగ్చా వినాయక ఆలయానికి, రిసెంట్‌గా షిర్డీ సాయిబాబా మందిరానికి షారుక్ తన ఫ్యామిలీతోనే వెళ్లారు. అంటే సినిమాల నుంచి బ్రేక్ దొరికితే ఆయన కుటుంబానికి ఎంత ప్రియారిటీ ఇస్తారో ఇది చూస్తే తెలుస్తోంది.
అయితే సాధారణంగా సెలబ్రెటీలు లైఫ్ స్టైల్ తెలుసుకోవాలని చాలా మంది అనుకుంటారు. అంతేకాకుండా వారి ఫ్యామిలీ ఏంటి? పిల్లల గురించి పలు విషయాలు తెలుసుకోడానికి ప్రయత్నిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఆయన చిన్న కుమారుడు అబ్రమ్ ఖాన్ ఎక్కడ చదువుకుంటున్నాడు? అబ్రమ్ కోసం షారుక్ చెల్లిస్తున్న ఫీజు ఎంత? అనే విషయాలు మీకు తెలుసా?
షారుక్ ఖాన్ 1991లో గౌరీఖాన్‌ను పెళ్లి చేసుకున్నారు. వీరికి ఆర్యన్ ఖాన్, సుహానాతోపాటు మూడో సంతానంలో అబ్రమ్ జన్మించాడు. షారుక్ దంపతులకు అబ్రమ్ గారాల తనయుడు. ఇంట్లో అందరికంటే చిన్నవాడైన అబ్రమ్ ముంబయి ధీరుబాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ ఎల్కేజీ (LKG) చదువుతున్నాడు. అయితే ఈ ఇంటర్నేషనల్ స్కూల్లో ఎక్కువ మంది సెలబ్రెటీల పిల్లలే చదువుతుంటారు. అలనాటి అందాల నటి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్, ఖుషీ కపూర్, సారా అలీఖాన్, ఇబ్రహీం అలీ ఖాన్, క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ పిల్లలు సారా టెందూల్కర్, అర్జున్ టెందూల్కర్ ఈ స్కూల్లో చదుకున్నవారే. కాగా, ప్రస్తుతం ఐశ్వర్యరాయ్- అభిషేక్ కుమార్తె ఆరాధ్య కూడా ఇదే స్కూల్లో చదువుతోంది.
-
SRK with Gauri & Suhana at annual function of Dhirubhai ambani International school in Mumbai. @iamsrk #SRK #ShahRukhKhan pic.twitter.com/ggt8jgdu0g
— SRK Hyderabad Fans (@SRKHydFans) December 15, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">SRK with Gauri & Suhana at annual function of Dhirubhai ambani International school in Mumbai. @iamsrk #SRK #ShahRukhKhan pic.twitter.com/ggt8jgdu0g
— SRK Hyderabad Fans (@SRKHydFans) December 15, 2023SRK with Gauri & Suhana at annual function of Dhirubhai ambani International school in Mumbai. @iamsrk #SRK #ShahRukhKhan pic.twitter.com/ggt8jgdu0g
— SRK Hyderabad Fans (@SRKHydFans) December 15, 2023
-
Our own littlest Prince Khan is looking ultra cute while imitating the priceless @iamsrk signature pose at Dhirubhai Ambani International School annual day ♥️😍🥹#shahrukhkhan #AbRamKhan #SRK #KingKhan #Mumbai pic.twitter.com/8JFXjtyOhX
— News Limitless (@News_Limitless) December 17, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Our own littlest Prince Khan is looking ultra cute while imitating the priceless @iamsrk signature pose at Dhirubhai Ambani International School annual day ♥️😍🥹#shahrukhkhan #AbRamKhan #SRK #KingKhan #Mumbai pic.twitter.com/8JFXjtyOhX
— News Limitless (@News_Limitless) December 17, 2023Our own littlest Prince Khan is looking ultra cute while imitating the priceless @iamsrk signature pose at Dhirubhai Ambani International School annual day ♥️😍🥹#shahrukhkhan #AbRamKhan #SRK #KingKhan #Mumbai pic.twitter.com/8JFXjtyOhX
— News Limitless (@News_Limitless) December 17, 2023
అయితే ప్రపంచంలోనే టాప్ క్లాస్ స్కూళ్లలో ఒకటైన ధీరుబాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లో ఎల్కేజీ నుంచి 7వ తరగతి వరకు నెలకు రూ.1.70లక్షల ఫీజు, 8వ తరగతి నుంచి 10 తరగతి వరకు నెలకు రూ.4.48లక్షల ఫీజు, 11వ 12వ తరగతులకు రూ.9.56లక్షల ఉందట. ఈ లెక్కన అబ్రమ్ స్కూల్ ఫీజు నెలకు రూ.1.70లక్షలు. అంటే షారుక్ ఖాన్ సంవత్సరానికి రూ.20.40లక్షలు అబ్రమ్ ఫీజుగా చెల్లిస్తున్నారన్నమాట.
'డంకీ' రివ్యూ- బాద్షా నటన అద్భుతం- షారుక్ ఖాతాలో రూ.1000 కోట్ల సినిమా!
'డంకీ సూపర్ హిట్ అయ్యేలా చూడు సాయి!'- షిర్డీ బాబాకు షారుక్ స్పెషల్ పూజలు