Sharukh Khan Atlee movie first look: అట్లీ దర్శకత్వంలో షారుక్ ఖాన్, నయనతార జంటగా ఓ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రానికి 'జవాన్' అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు సమాచారం. త్వరలో విడుదల చేయనున్న టీజర్‌తో టైటిల్‌ను అధికారికంగా ప్రకటించనున్నారు. అయితే తాజాగా ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్ అంటూ ఓ ప్రచార చిత్రం ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో షారుక్.. తలకి టోపీ ధరించి, చేతిలో సిగార్ కాలుస్తూ.. స్టైలిష్ లుక్‌లో కనిపించారు. ఇది అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఫ్యాన్స్ నెట్టింట్లో దీన్ని ట్రెండ్ చేస్తూ సంబరాలు చేసుకుంటున్నారు.
కాగా, నయనతార ఇందులో ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ పాత్రలో నటిస్తుండగా షారుక్ ఒక పాత్రలో 'రా' అధికారిగా, మరో పాత్రలో గ్యాంగ్‌స్టర్‌గా ద్విపాత్రాభినయం చేయనున్నాడు. నాలుగేళ్ల నుంచి షారుక్ తెరపై కనపడకపోవడంతో ఈ సినిమా కోసం బాద్‌షా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక షారుక్ ఈ మూవీతో పాటు 'రాకెట్రీ', 'లాల్ సింగ్ చద్ధా', 'బ్రహ్మాస్త్ర', 'టైగర్ 3'లో అతిథి పాత్రలో మెరవగా.. 'డంకీ', 'పఠాన్' సినిమాల్లో నటిస్తున్నారు.
![Sharukh Khan Atlee movie first look](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/15459766_1.png)
ఇదీ చూడండి: పాటపై ప్రేమతో.. సింగర్ 'కేకే' హృదయాన్నే మరిచాడా?