ETV Bharat / entertainment

'సలార్' వాయిదా! ఆదే డేట్​ను ఫిక్స్ చేసుకున్న మరో రెండు సినిమాలు.. ఎన్ని రిలీజ్ కానున్నాయంటే.. - పెదకాపు 1 విడుదల తేదీ

September 28 Movie Release : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా 'సలార్'. అయితే ముందుగా ప్రకటించినట్లు ఈ సినిమా సెప్టెంబర్ 28న విడుదలయ్యే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో ఆయా సినిమాల నిర్మాణ సంస్థలు సెప్టెంబర్ 28 తేదీని లాక్ చేసుకుంటున్నాయి. మరి ఈ రోజు ఏయే సినిమాలు రానున్నాయంటే..

September 28 Movie Release
September 28 Movie Release
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 8, 2023, 8:18 PM IST

September 28 Movie Release : రెబల్ స్టార్ ప్రభాస్-కేజీఎఫ్ సినిమాల డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్​లో తెరకెక్కితున్న చిత్రం 'సలార్ సీజ్ ఫైర్'. అయితే ఈ సినిమా సెప్టెంబర్ 28న థియేటర్లలోకి వస్తుందని.. గతంలో మూవీయూనిట్ ప్రకటించింది. కానీ కొన్ని రోజులుగా ఈ సినిమా రిలీజ్ వాయిదా పడనుందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే చిత్రబృందం నుంచి.. వాయిదాకు సంబంధించి ఇప్పటికీ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

అయితే ఈ సినిమా పోస్ట్​పోన్ దాదాపు ఖాయమైనట్లే అని కర్ణాటక డిస్ట్రిబ్యూటర్లు చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో టాలీవుడ్​లో కొన్ని సినిమాలు సెప్టెంబర్ 28 తేదీని లాక్ చేసుకుంటున్నాయి. అందులో కొన్ని ఇదివరకే రిలీజ్ డేట్ ప్రకటించగా.. తాజాగా ఈ తేదీలను రద్దు చేసుకుంటున్నాయి. మరి ఆ తేదీలో రానున్న సినిమాలేంటో చూద్దాం.

రూల్స్ రంజన్.. కిరణ్ అబ్బవరం-నేహాశెట్టి జంటగా నటించిన సినిమా 'రూల్స్ రంజన్'. అయితే ఈ సినిమాను సెప్టెంబర్ రెండో వారంలో విడుదల చేయాలనుకుంది చిత్రబృందం. కానీ సలార్ పోస్ట్​పోన్​ వల్ల ఇప్పుడు సెప్టెంబర్ 28 న సినిమా ప్రేక్షకున ముందుకు రానున్నట్లు మూవీయునిట్ స్పష్టతనిచ్చింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

స్కంద.. రామ్​ పోతినేని-శ్రీలీల జంటగా నటించిన 'స్కంద'.. సెప్టెంబర్ 15న రానున్నట్లు మూవీయూనిట్ ఇదివరకే ప్రకటించింది. కానీ సలార్ వాయిదాను దృష్టిలో ఉంచుకొని స్కంద రిలీజ్​ డేట్​ను సెప్టెంబర్ 28కి మార్చారు.

చంద్రముఖి 2.. రాఘవా లారెన్స్ కీలక పాత్రలో తెరకెక్కుతున్న సినిమా 'చంద్రముఖి 2'. ముందుగా ఈ సినిమా విడుదలకు సెప్టెంబర్ 15ను ఫిక్స్​ చేశారు. కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనుల కారణంగా ఈ సినిమాను సెప్టెంబర్ 28న విడుదల చేయనున్నట్లు.. చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్​ తాజాగా స్పష్టం చేసింది.

మ్యాడ్‌.. నార్నే నితిన్‌, సంగీత్‌ శోభన్‌, రామ్‌ నితిన్‌ కీ రోల్స్​లో నటిస్తున్న సినిమా మ్యాడ్. కల్యాణ్‌ శంకర్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ సినిమా కూడా సెప్టెంబరు 28నే థియేటర్లలో రిలీజ్ కానుంది.

పెదకాపు.. టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల.. రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిస్తున్న సినిమా పెదకాపు. రెండు పార్ట్​లుగా రూపొందుతున్న ఈ సినిమా తొలి భాగాన్ని.. ఆగస్టు 18 విడుదల చేస్తున్నట్లు చిత్ర నిర్మాత రవీందర్‌ రెడ్డి అనౌన్స్​ చేశారు. కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమాను సెప్టెంబర్ 29కి వాయిదా వేశారు.

టిల్లు స్క్వేర్‌.. డీజే టిల్లుతో యూత్​ను అట్రాక్ట్ చేసిన సిద్ధు జొన్నలగడ్డ.. టిల్లు స్క్వేర్‌తో సెప్టెంబర్ 15న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సినిమా యూనిట్ తెలిపింది. కానీ పోస్ట్‌ ప్రొడక్షన్స్‌ పనుల ఆలస్యం కారణంగా.. ఈ సినిమా రిలీజ్​ను వాయిదా వేస్తున్నట్లు ఇదివరకే ప్రకటించారు. ఇక కొత్త విడుదల తేదీని ఇంకా చెప్పలేదు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.