ETV Bharat / entertainment

ఇప్పటికీ.. ఎప్పటికీ.. ఆ పాత్రలంటే గుర్తొచ్చేది ఎన్టీఆరే! - NTR krishna role movies

ఇష్టదైవాలు ఎలా ఉంటారు? ఎవరికీ తెలియదు. శతాబ్దాల శిల్పాలో, రాజారవివర్మ గీసిన చిత్రాల్లోనో దేవుళ్లు ఇలా ఉంటారని పోల్చుకుంటాం. రాజా రవివర్మ వర్ణచిత్రాల్లో చూసుకుంటాం. కానీ అశేష ప్రేక్షకలోకం శ్రీకృష్ణుణ్ణి, శ్రీరాముణ్ణి ఎన్టీరామారావులో చూసుకుంది ఇది అతిశయోక్తి కాదు. నూరుశాతం నిజం. అనేక పౌరాణిక పాత్రల్లో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన రామారావు, అచ్చం ఆ పాత్రలకోసమే పుట్టి వుంటారని జనవాక్యం. ఈ నేపథ్యంలో ఆయన దేవుడు పాత్రలు చేసిన సినిమాపై ఓ లుక్కేద్దాం. దీంతోపాటే ఆయన ఓ సినిమాలో త్రిపాత్రాభినయం పోషించడం సహా దానికి దర్శకత్వం, నిర్మాణ బాధ్యతలు అన్నీ తానై చూసుకున్నారు. ఇక ఈ చిత్రం షూటింగ్​ను 43రోజుల్లోనే పూర్తి చేయడం కూడా విశేషం. ఆ విశేషాలను తెలుసుకుందాం...

NTR As krishna
సీనియర్ ఎన్టీఆర్​
author img

By

Published : May 28, 2022, 12:38 PM IST

Senior NTR Krishna and Rama role movies: ఒక్కడే చంద్రుడు. ఒక్కడే సూర్యుడు. ఎందరు కృష్ణులు వచ్చినా, ఎందరు శ్రీ రాముళ్లు వచ్చినా ప్రేక్షకులకు ఆయా పౌరాణిక పాత్రల్లో ఆరాధ్యుడు ఒక్క నటరత్న నందమూరి తారకరామారావు మాత్రమే. పౌరాణిక పాత్రల కోసమే ఆయన్ని ఇలవేల్పులు తమ ప్రతినిధిగా పంపించారేమో! నిజంగా ఇష్టదైవాలు కూడా ఇలాగే వుండాలని అభిమానులు కోరుకున్నారు. పురాణ పురుషుల పాత్రలు ధరించడానికి పుట్టిన కారణ జన్ముడని తెలుగ జాతి భావించింది. దక్షయజ్ఞంలో శివుడుగా ఎన్టీఆర్ చేసిన నటన మరపురానిది. శివతాండవం అద్భుతం అన్పిస్తుంది. ఎన్టీవోడు అంటూ చనువుగా, తమ ఇంటి మనిషిగా, ప్రేమగా ఆదరించారు. అభిమానించారు. ఆరాధించారు. పటం కట్టి పూజలు చేసి, హారతి ఇచ్చి మరీ మనసుల్లోకి స్వాగతించారు. ఆహార్యం నుంచి అభినయం దాకా శ్రీకృష్ణుని పాత్రలో ఒక శైలి. ఒరవడి. కృష్ణుడి వయ్యారి నడక, సమ్మోహన దరహాసం, కనులతోనే కోటి భావాలు, శాంత స్వభావం.. వెరసి వెండితెర కృష్ణుడు గా మెప్పించారు ఎన్టీరామారావు.

తొలిసారి కృష్ణుడి పాత్రలో... 1953 లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'ఇద్దరు పెళ్లాలు' సినిమాలోఎన్టీఆర్ తొలిసారి శ్రీకృష్ణుడి వేషంలో ఒక ఊహాలోకపు గీతంలో దర్శనమిచ్చారు. పూర్తి స్థాయిలో పాత్ర పోషించిన చిత్రం మాత్రం 'మాయాబజార్'. తర్వాత 'దీపావళి', 'భక్త రఘునాథ్', 'శ్రీకృష్ణార్జున యుద్ధం', తమిళ అనువాద చిత్రం కర్ణ, వీరాభిమన్యు’,‘శ్రీకృష్ణపాండవీయం’,‘శ్రీకృష్ణతులాభారం’, ‘శ్రీకృష్ణావతారం’,‘శ్రీకృష్ణవిజయం’, ‘శ్రీకృష్ణసత్య’,‘శ్రీకృష్ణాంజనేయ యుద్ధం’, ‘దాన వీర శూర కర్ణ’, శ్రీ మద్విరాట పర్వం’తదితర పౌరాణిక సినిమాల్లో ఎన్టీరామారావు శ్రీకృష్ణుని పాత్రలో మెప్పించారు.

ఇక తెలుగువారి ఏడుకొండల బంగారం శ్రీవేంకటేశ్వరుడు. ఆపద మొక్కుల వాడు. వడ్డీకాసులవాడు. ప్రపంచమంతా ప్రణమిల్లే శ్రీవేంకటేశ్వరుణ్ణి వెండితెరమీద ఎన్టీరాముడిలో చూసుకున్నారు. 1960లో శ్రీ వెంకటేశ్వర మహత్యం లో తనను శపించబోయిన భృగు మహర్షిని ప్రసన్నం చేసుకునే పాత్రలో ఎన్టీఆర్ నటన పాత్రోచితంగా ఉంది.

NTR As krishna
కృష్ణుడి పాత్రలో ఎన్టీఆర్​

తొలిసారి రాముడి పాత్రలో.. దేశానికి రాముడంటే అయోధ్య రాముడు. దక్షిణాదిన భద్రాద్రి కోదండ రాయ ప్రభువు. వైదేహి రామ ప్రభువు. తెలుగువారికి మాత్రం రాముడంటే ముందుగా కళ్లముందు నిలిచేది ఆ పాత్రలో జీవించిన ఎన్టీరామారావు దివ్యమంగళరూపం. విష్ణు పురాణంలో ఏడో అవతరం శ్రీరాముడు. రాముడిది ‘ఒకే మాట. ఒకే బాణం’ అని విశ్వసిస్తారు. అలాగే తెలుగు వారు శ్రీరాముణ్ణి, రఘుకుల ఉత్తముడిని, ఆజానుబాహుణ్ణి, అరవిందాక్షుణ్ణి, ఆ నీలమేఘశ్యాముణ్ణి వెండితెరమీద నటసార్వభౌమ ఎన్టీఆర్ లో చూసుకున్నారు.

ఎన్టీరామారావు పూర్తి నిడివిలో తొలిసారి తమిళ చిత్రం 'సంబూర్ణ రామాయణం' లో శ్రీరాముని పాత్ర వేశారు. ఇదే తొలిసారిగా ఎన్టీ రామారావు రాముని ఆహార్యంతో నటించిన సినిమా. ఈ సినిమాలో శివాజీ గణేశన్ నటించారు. మూడు పదుల వయసులో తొమ్మిదిపదుల భీష్ముడుగా నటించటం ఎవరితరం? ఎన్టీఆర్ కే సాధ్యమైంది. కురువృద్ధుడి పాత్రలో ఎన్టీఆర్ అద్భుత అభినయం తెలుగువారిని అమితంగా ఆకట్టుకుంది. ఎన్టీరామారావు అంటే పౌరాణిక పాత్రలు ధరించటానికే పుట్టి వుండవచ్చని తెలుగువారు తమ అంతరంగంలో అనుకుంటారు. పౌరాణిక పాత్రల విశ్వరూపం. ధరించిన ప్రతి పౌరాణిక పాత్రా ఎంతో అపురూపం. నటనకే కాదు. పౌరాణిక పాత్రలకూ నిఘంటువు. వేలి వుంగరం నుంచి కిరీటం దాకా, ఏఏ పాత్రల్లో ఏఏ ఆభరణాలు ధరించాలి? ఏఏ దుస్తులు వేసుకోవాలి? రాముడైనా, శ్రీవేంకటేశ్వరుడైనా విష్ణురూపాలే కానీ. ఆహార్యం విభిన్నంగా ఉంటుంది.

దేవుడి పాత్రలకు ప్రాణప్రతిష్ఠ చేసిన ఎన్టీఆర్.. పురాణాల్లోని ప్రతినాయక పాత్రలకు కూడా అదే స్థాయిలో ఇమేజ్ తీసుకొచ్చారు. ప్రతినాయక పాత్రల స్వభావాన్ని ఆకళింపు చేసుకొన్నారు. వారికీ ఏదో కోణంలో ఉన ప్రత్యేకతను తను ధరించిన వేషం తాలూకు ఆహార్యంలో చూపారు. ముఖభావాలలో ఆయా విశిష్టతలను ప్రతిఫలింపజేశారు. దుర్యోధనుణ్ణి సుయోధనుడిగా చూశారు. స్వయంగా ఆ పాత్ర ధరించి రారాజు రాజసాన్ని వెండితెర మీద ఆవిష్కరించారు. రావణుడు శివభక్తుడు. రాజనీతిజ్ఞుడు. దశగ్రీవుడు. దశకంఠుడు. ఎంత గొప్పవాడైనా ధర్మాన్ని పాటించక పతనమయ్యడు. 1959 లో ఎవిఎం ప్రొడక్షన్స్ వారి 'భూకైలాస్‌' లో రావణ బ్రహ్మ పాత్రకు ప్రాణ ప్రతిష్ఠచేశారు. ఇక్కడ ఆత్మ లింగాన్ని దేవతలు పశువుల కాపరి రూపంలో పంపించిన వినాయకుడు రావణ బ్రహ్మ సాధించిన ఆత్మలింగాన్ని నేల మీద ఉంచి రావణుడికి తపస్సు వృధా చేస్తాడు. ఈ సన్నివేశంలో ఎన్టీ నటన నభూతో నభవిష్యతి.

NTR As krishna
రాముడు, శ్రీకృష్ణుడిగా ఎన్టీఆర్​

భీముడిగా... గొప్ప యుద్ధకళను ప్రదర్శించే వాడు దుర్యోధనుడు. యోధుడే. సుయోధనుడు. రాజసంలో రారాజు. రాముడి పాత్రయినా, భీముడి పాత్రయినా, మరే పాత్రలో అయినా జీవించిన నవరస నటుడు. పాండవ వనవాసంలో ఎన్టీరామారావు భీముడి పాత్ర పోషించారు. భుజబలం, గదాయుద్ధంలో,మల్ల యుద్ధంలో భీముడు నిపుణుడు. పౌరాణిక పాత్రలకు నిఘంటువు. రావణ బ్రహ్మ గా భూకైలాస్ లో, తన సొంత చిత్రం సీతారామ కల్యాణంలో రావణుని ఆత్మను ఆవిష్కరించారు. దుర్యోధనుడు సుయోధనుడయ్యాడు. రావణ బ్రహ్మ, సుయోధనుడు, కర్ణుడు హీరోల్లా కనపడతారు. రామారావు అధ్యయనం చేసి పాత్రల మూలాలను కళ్లకు కట్టినట్టు చూపటం ఆయన ప్రత్యేకత.రావణాసురుడిగా, కర్ణుడిగా, సుయోధనుడిగా, కీచకుడిగా ప్రేక్షకులను మెప్పించారు. వారిలోని మంచి గుణాలను వెలుగులోకి తీసుకురావడం ద్వారా.. వారిని హీరోలుగా మార్చాడు. దానవీరశూర కర్ణలో కర్ణుడు, సుయోధనుడి పాత్రలను మలచిన విధానమే ఇందుకు నిదర్శనం. ఆ సినిమాలో ఈ పాత్రలు అంతిమఘడియల్లో కళ్లు చెమ్మగిల్లని ప్రేక్షకుడు ఉండడు. ఆ స్థాయిలో ఆ పాత్రలకు జీవం పోశారాయన. గుండె గిల్లి ఏదో మనసు పొరల్లో ఉన్న కన్నీటిని తెప్పిస్తారు.

శ్రీ సీతారాముల కల్యాణము చూతము రారండీ అనే అజరామర కల్యాణగీతం ఇంటింటికీ పరిచితం. 1961లో వచ్చిన ' సీతారామకల్యాణం' సినిమాకు ఎన్టీరామారావు దర్వకత్వం వహించారు, రాముడు పాత్రలో హరనాథ్ మెరిశారు. ఎన్టీరామారావు రావణ బ్రహ్మగా నటించి ఆ పాత్ర విశిష్టతను చాటిచెప్పారు.

తెలుగు ప్రేక్షకులకు దేవదానవుల యుద్ధాలే కాకుండా, దేవదేవుళ్ల యుద్ధాలూ ఇష్టం. 1972లో విడుదలైన శ్రీ కృష్ణాంజనేయ యుద్ధం లో ఎన్టీఆర్ శ్రీకృష్ణుడుగా నటించగా, ఆంజనేయ పాత్రలో రాజనాల జీవించారు. ఆంజనేయుడికి రాముడే దేశ బహిష్కరణ శిక్ష విధించే ఘట్టం శ్రీకృష్ణాంజనేయ యుద్ధంలో ఉంది. 1975 విడుదలైన రామాంజనేయ యుద్ధంలో తన ఇలవేల్పును ఢీకొంటాడు ఆంజనేయుడు. తన ప్రభువైన శ్రీరాముడితోనే ఆంజనేయుడు యుద్ధం చేస్తాడు..తను అభయమిచ్చిన భక్తుని కోసం. యయాతిని శిక్షిస్తానని రాముడు శపథం చేస్తాడు. యయాతి ఆంజనేయుడి శరణుకోరటం కథ.

దానవీర శూర కర్ణ.. 1977లో ఎన్టీరామారావు స్వీయ దర్శకత్వంలో నిర్మించి, నటించిన దానవీర శూర కర్ణ సినిమా నభూతో నభవిష్యతి. ఈ సినిమాను 43 రోజుల్లో తీశారు. ఎన్టీఆర్ శ్రీకృష్ణుడుగా, కర్ణుడుగా, సుయోధనుడుగా..మూడు పాత్రలలో నటించారు. ఓ వైపు దర్శకత్వం, మరో వైపు నిర్మాణం, మళ్లీ 3 పాత్రలలో నటించటం..అనితర సాధ్యం. ఎన్టీరామారావుకే సాధ్యమైంది. సుయోధనుడు కులాన్ని నిరసిస్తూ..ఆచార్యదేవా! ఏమంటివి? ఏమంటివి?' అనే సంభాషణలు నాడు పదునైన సంభాషణలు ఇంటింటా మోగాయి.

నాలుగు గంటల ఏడు నిమిషాల సినిమాలో 4 గంటల పాటు ఎన్టీఆర్ ఏదో ఒక పాత్రలో కన్పించారు. దానవీరశూర కర్ణలో దుర్యోధనుడికి యుగళ గీతం పెట్టిన ఎన్టీఆర్ 'చిత్రం భళారే విచిత్రం' అన్పించారు. ఎన్టీఆర్ తనయులు హరికృష్ణ, బాలకృష్ణ ఇందులో నటించారు.

NTR As krishna
దానవీర శూర కర్ణ..

ఇదీ చూడండి: రివ్యూ: 'ఎఫ్‌3' మూవీ ఎలా ఉందంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.