ETV Bharat / entertainment

టాలీవుడ్​పై నటుడు సుమన్​ షాకింగ్​ కామెంట్స్​! - సీనియర్ నటుడు సుమన్ ఎమోషనల్​​ కామెంట్స్​

Senior actor Suman comments on film industry: కన్నడ చిత్ర పరిశ్రమ తరహాలో తెలుగు సినీ పరిశ్రమలోని నిబంధనలను సవరించాలని సీనియర్ నటుడు సుమన్ డిమాండ్ చేశారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో వాతావరణం ఆరోగ్యకరంగా లేదని అన్నారు.

Senior actor Suman comments on film industry
టాలీవుడ్​పై నటుడు సుమన్​ షాకింగ్​ కామెంట్స్
author img

By

Published : May 30, 2022, 8:39 PM IST

Senior actor Suman comments on film industry: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో వాతావరణం ఆరోగ్యకరంగా లేదని సీనియర్ నటుడు సుమన్ అన్నారు. సినిమాలు కొనే బయ్యర్లు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చిత్ర పరిశ్రమలోని పెద్దలు దృష్టి సారించి బయ్యర్లను ఆదుకోవాలని కోరారు. అలాగే సమయపాలన లేకపోవడం వల్ల నటీనటులు, నిర్మాతలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కన్నడ చిత్ర పరిశ్రమ తరహాలో తెలుగు సినీ పరిశ్రమలోని నిబంధనలను సవరించాలని సుమన్ డిమాండ్ చేశారు.

భారత్ ఆర్ట్స్ అకాడమీ, వాసవి ఫిల్మ్ అవార్డ్స్ సంయుక్తంగా హైదరాబాద్ ఫిల్మ్ చాంబర్ దాసరి స్మారక పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సుమన్ పై వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ రచయిత యండమూరి, సీనియర్ నటి రోజారమణి-చక్రపాణి దంపతులతోపాు దర్శకులు సాగర్, రాజా వన్నెంరెడ్డి, విష్ణు బొప్పలను నిర్వాహకులు దాసరి స్మారక పురస్కారాలతో సత్కరించారు.

టాలీవుడ్​పై నటుడు సుమన్​ షాకింగ్​ కామెంట్స్​!

ఇదీ చూడండి: ఎన్టీఆర్​తో సినిమా.. క్లారిటీ ఇచ్చిన సోనాలి బింద్రే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.