ETV Bharat / entertainment

ప్రముఖ సీరియల్​ నటి ఆత్మహత్య.. మాజీ బాయ్​ఫ్రెండ్ వేధింపుల వల్లే! - యే రిస్తా క్యా కేలాటా హై హిందీ సీరియల్

ప్రముఖ సీరియల్​ నటి వైశాలి ఠక్కర్​ తన ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. 'నా చావుకు కారణం అతడే' అనే సూసైడ్​ నోట్ పోలీసులకు లభ్యమైంది.

Sasural Simar Ka actor Vaishali Takkar
Sasural Simar Ka actor Vaishali Takkar
author img

By

Published : Oct 16, 2022, 4:35 PM IST

ప్రముఖ హిందీ సీరియల్ నటి వైశాలి ఠక్కర్ ఆత్మహత్య చేసుకుంది. మధ్యప్రదేశ్​ ఇందోర్​లోని తన ఇంట్లో ఆమె ఉరేసుకుని చనిపోయింది. ఈ ఘటనపై తేజాజీ నగర్ పోలీస్ స్టేషన్​లో కేసు మోదైంది. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సాయిబాగ్ కాలనీలో ఉన్న ఆమె ఇంటి డోర్​ తెరిచి చూస్తే.. ఫ్యాన్​కు వేలాడుతూ కనిపించిందిని పోలీసులు తెలిపారు. వెంటనే ఎమ్​వై ఆస్పత్రికి తరలించామని చెప్పారు. కాగా, వైశాలి ఇంట్లో.. పోలీసులకు ఓ సూసైడ్​ నోట్​ లభ్యమైంది.

Sasural Simar Ka actor Vaishali Takkar
వైశాలి ఠక్కర్

ఎప్పుడూ సోషల్ మీడియాలో చురుకుగా ఉంటుంది వైశాలి. తన పర్సనల్​, ప్రొఫెషనల్​ విషయాలు కూడా అభిమానులతో పంచుకుంటుంది. తాను ఓ వ్యక్తిని పెళ్లి చేసుకుంటున్నట్లు గత ఏప్రిల్​లో సోషల్​ మీడియా వేదికగా వెల్లడించింది. అతడు డాక్టర్ అభినందన్ సింగ్ అని తన అభిమానులకు తన ఫియాన్సీ పేరు చెప్పింది. కానీ నెల తర్వాత.. అతడిని పెళ్లి చేసుకోవడం లేదని.. ఎంగేజ్​మెంట్​ క్యాన్సల్ చేసుకున్నట్టు తెలిపింది.

వైశాలి ప్రస్తుతం హిందీ బుల్లితెర అగ్ర నటీమణుల్లో ఒకరిగా ఉంది. 'ససురాల్ సిమర్ కా' అనే సీరియల్​తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. 'యే రిస్తా క్యా కేలాటా హై' అనే సీరియల్​తో తెరంగేట్రం చేసింది. అనంతరం 'యే హై ఆషికి'లో నటించింది. వైశాలి చివరి సారిగా 'రక్షాబంధన్​' షో లో కనిపించింది.

"గత రాత్రి తేజాజి నగర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో టీవీ నటి వైశాలి ఉరేసుకుని చనిపోయిందని మాకు సమాచారం వచ్చింది. ఆమె మృతదేహం వద్ద తన మాజీ ప్రియుడి వేధింపులతోనే స్ట్రెస్​కు గురై ఇలా చేశాననే సూసైడ్​ నోట్ లభ్యమైంద"ని ఏసీపీ ఎమ్ రెహమాన్ చెప్పారు.

ఇవీ చదవండి: 'దానికి వాళ్లే కారణం.. రెండుసార్లు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా'

T20 World Cup : నమీబియా బోణీ.. శ్రీలంకపై ఘన విజయం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.