ETV Bharat / entertainment

విశ్వక్​ స్థానంలో ఆ హీరో కోసం ఎదురుచూస్తున్న యాక్షన్ కింగ్​ - విశ్వక్​ సేన్​ అర్జున్ వివాదం

విశ్వక్​సేన్​తో వివాదం తర్వాత తన సినిమా కోసం మరో హీరోను వెతికే పనిలో పడ్డారట యాక్షన్ కింగ్ అర్జున్​. ప్రస్తుతం ఆయన మరో కథానాయకుడి పేరును పరిశీలించారని, ఆయన్ను సంప్రదించాలని భావిస్తున్నట్లు తెలిసింది. ఎవరంటే?

Sarvanand is next hero in action king Arjun film
విశ్వక్​ స్థానంలో ఆ హీరో కోసం ఎదురుచూస్తున్న యాక్షన్ కింగ్​
author img

By

Published : Nov 8, 2022, 11:08 AM IST

యాక్షన్ కింగ్ అర్జున్ ఇటీవలే తన స్వీయ దర్శకత్వంలో విశ్వక్ సేన్​ను హీరోగా, ఆయన కుమార్తె ఐశ్వర్యను హీరోయిన్​గా పెట్టి ఒక సినిమాను ప్రారంభించారు. అయితే అర్జున్-విశ్వక్ మధ్య ఏర్పడిన వివాదం వల్ల ఈ ప్రాజెక్ట్ అటకెక్కింది. ప్రస్తుతం టాలీవుడ్​లో ఈ విషయం చర్చనీయాంశమైంది. ఇప్పుడు విశ్వక్​ స్థానంలో మరో హీరోను వెతుకుతున్నారట అర్జున్​.

ప్రముఖ హీరో శర్వానంద్​ను ఈ సినిమా కోసం సంప్రదిస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో పడ్డారట అర్జున్. ఈ కథకి శర్వానంద్ అయితే న్యాయం చేయగలడని.. అతని డేట్స్ ఎలా అయినా సంపాదించాలని అర్జున్ ప్రయత్నాలు చేస్తున్నారని తెలిసింది. శర్వ ప్రస్తుతం కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. త్వరలోనే ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కానుంది. దీని తర్వాత కూడా శ్రీరామ్ ఆదిత్య డైరెక్షన్​లో మరో మూవీకీ ఆయన కమిట్​ అయ్యారంట. ఇలా వరుసగా రెండు సినిమాలు కమిటైన శర్వానంద్ ఇప్పుడు అర్జున్ కోసం డేట్స్ కేటాయిస్తారా అనేది సందేహంగా మారింది.

sarvanand
శర్వానంద్​

ఇదీ చూడండి: బర్త్​డే ముందు వర్షకు అదిరిపోయే సర్​ప్రైజ్.. కాస్ట్లీ గిఫ్ట్​ ఇచ్చిన ఇమ్మూ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.